Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
vehicle purchase muhurat 2025: కొత్త ఏడాదిలో వాహనం కొనాలనుకుంటున్నారా?..శుభ ముహూర్తాలు ఇవే
వాహనం కొనడం అనేది చాలా మందికి ఒక డ్రీమ్. ఈ రోజుల్లో ఏ వాహనం కొనడానికి అయినా మీ దగ్గర మొత్తం డబ్బు ఉండక్కర్లేదు.. ఈఎంఐ, లోన్ వంటి ఆప్షన్ల ద్వారా కొనుగోలు చేసి మీ కలను సాకారం చేసుకోవచ్చు. కొందరికి వాహనం మహాలక్ష్మి లాంటిది దానివల్ల వచ్చే ఆదాయంతో జీవిస్తారు. ప్రయాణం సాఫీగా సాగి ఎలాంటి ప్రమాదం లేకుండా లేకుండా ఉండాలని వాహనం కొనేటప్పుడు అందరూ అనుకుంటారు. అందుకే కారు,బైక్ లేదా ఇంకేదైనా వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు చాలామంది మంచి ముహుర్తం(vehicle purchase muhurat) చూసుకుంటారు.
మంచి ముహూర్తంలో వాహనాన్ని ఇంటికి తెచ్చుకుంటే ఎలాంటి ప్రమాదాలు రావని,అంతా మంచి జరుగుతుందని భావించి ఇలా చేస్తుంటారు. కొందరు తమ జాతకం ప్రకారం,రాశి ప్రకారం చూసుకొని కొనుగోలు చేస్తూ ఉంటారు. మరి కొందరు ఆ నెలలో మంచి రోజు ఏదో చూసి వేసుకుంటూ ఉంటారు. శుభ ముహూర్తంలో వాహనాన్ని కొనుగోలు చేయడం వ్యక్తి జీవితంలో శ్రేయస్సు, విజయం, ఆనందం, శాంతిని తెస్తుందని నమ్ముతారు.

కొంతమంది అయితే ఏ కలర్ వాహనాన్ని కొనాలని కూడా పండితులని అడిగి నిర్ణయం తీసుకుంటారు. వాహనం కొనుగోలు కోసం ప్రత్యేక ముహూర్తాలు ఎంపిక చేయబడతాయి. నక్షత్రం, తిథి, వారాలు, నిర్దిష్ట గ్రహ స్థితి ఆధారంగా 2025లో వాహనాన్ని కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయాలను జాగ్రత్తగా ఎంపిక చేస్తారు. మీరు కొత్త సంవత్సరం మొదటి నెలలో అంటే 2025 జనవరిలో మీ కోసం లేదా మీ కుటుంబంలోని ఎవరికైనా వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే వాహనాన్ని కొనుగోలు చేయడానికి మంచి సమయం ఏదో ఇక్కడ చూడండి.
2025 జనవరిలో కొత్త వాహనం కొనడానికి మంచి సమయం
-జనవరి 2 గురువారం ఉదయం 07:14 నుండి 3 వ తేదీ మధ్యాహ్నాం 01:08 వరకు.
-జనవరి 6 సోమవారం రాత్రి 07:06 నుండి 7వ తేదీ ఉదయం 07:15 వరకు
-జనవరి 13 సోమవారం ఉదయం 10:38 నుండి 14వ తేదీ ఉదయం 07:15 వరకు.
-జనవరి 19 ఆదివారం సాయంత్రం 05:30 నుండి జనవరి 20 రాత్రి 07:14 వరకు.
-జనవరి 20 సోమవారం ఉదయం 07:14 నుండి ఉదయం 09:58 వరకు.
-జనవరి 22 బుధవారం వాహన కొనుగోలుకు శుభ సమయం ఉదయం 07:14 నుండి మధ్యాహ్నం 03:18 వరకు.
-జనవరి 24 శుక్రవారం ఉదయం 07:13 నుండి జనవరి 25 ఉదయం 07:07 వరకు.
-జనవరి 31 శుక్రవారం మశ్యాహ్నాం 01:59 నుండి ఫిబ్రవరి 1 ఉదయం 04:14 వరకు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











