2025 రాశి ఫలాలు చెప్పేసిన వేణు స్వామి.. ఆ రాశి వారు చాలా అదృష్టవంతులట!

2024 ఏడాది చివరి దశకు వచ్చేసింది. ఇప్పటి నుంచే చాలామంది 2025కు సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడం మొదలుపెట్టేశారు. అందులో భాగంగానే 2025లో తమ తమ జాతకాలు ఎలా ఉండబోతున్నాయని తెలుసుకుంటున్నారు. అయితే 2025లో ఏ రాశికి వారికి ఎలాంటి జాతకాలు ఉండబోతున్నాయి? ఎవరి జాతకం బాగుంది అని ప్రముఖ జోతిష్యులు వేణు స్వామి వెల్లడించారు. ఆ విషయాలు మీకోసం ఈ స్టోరీలో వివరించాము చదివేయండి.

మేష రాశి:

2025లో మేష రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7గా ఉండబోతుంది. 2025 మార్చి 29వ తేదీ నుంచి ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. దీని కారణంగా ఎవరైతే 24 సంవత్సరాలు నిండి ఉంటారో వారి జీవితంలో పెను మార్పులు సంభవించే అవకాశం ఉందట. మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణగండం ఉంది. అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే సమాజంలో చెడ్డపేరు రావడం, ఉద్యోగంలో బదిలీలు, బంధువుల వలన సమస్యలు, వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

Venu swamy horoscope prediction for each zodiac sign in 2025

విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం, విదేశీయానం, ఉద్యోగంలో ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా భారీగా లాభాలను గడించే అవకాశం ఉంది. కానీ CBI, ఇన్‌కం ట్యాక్స్, ఈడీ వంటి సమస్యలు వారిని వెంటనే ఛాన్సుంది. మరీ ముఖ్యంగా మేష రాశికి చెందిన ఆడవాళ్ళ జాతకం అద్భుతంగా ఉండబోతోంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. అలాగే బ్లూ కలర్ దుస్తులు వాడడం వలన మంచి ఫలితాలను పొందొచ్చు

వృషభ రాశి:

వృషభ రాశి వారికి 2025లో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3గా ఉండబోతుంది. ఈ రాశి వారికి 2025లో రాహు, కేతుల ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుంది. అలాగే శనీశ్వరుడు సానుకూలత వలన చాలావరకు అనుకూలంగానే ఉండబోతుంది. ఈ సంవత్సరం వృత్తి, వ్యాపార, ఉద్యోగస్థులతో పాటు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. బంధువుల సహకారం లభిస్తుంది. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి.

పెళ్లి కానీ వ్యక్తులకు పెళ్లి అయ్యే అవకాశం ఉంది. అలాగే సంతానలేమితో ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు సంతాన ప్రాప్తి కలిగే ఛాన్సుంది. విదేశాల్లో ఉన్న వ్యక్తులు కూడా అన్ని రంగాల్లో రాణిస్తారు. రైతులకు కూడా విపరీతమైన లాభాలు వస్తాయి. వృషభ రాశికి చెందిన రైతులు ఎరుపు రంగు ధాన్యాలను పండించడం ద్వారా విపరీతమైన లాభాలను పొందే అవకాశం ఉంటుంది.

Venu swamy horoscope prediction for each zodiac sign in 2025

మిథున రాశి:

ఈ రాశి వారికి 2025లో ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉండబోతుంది. ఈ సంవత్సరం మిథున రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది. ఈ రాశి వారికి విపరీతమైన రాజయోగం పట్టుకోనుంది. దీని కారణంగా ఈ రాశి వారు చేపట్టే ప్రతీపని కలిసి వస్తుంది. విపరీతమైన ధనలాభం వస్తుంది. ఉద్యోగంలో ప్రొమోషన్స్, ఇంక్రెమెంట్స్ వస్తాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. గురు బలం వల్ల.. సమాజంలో చెడ్డపేరు పోయి మంచి పేరు వస్తుంది.

రాజకీయ నాయకులకు, వ్యాపారులకు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులకు ఈ సంవత్సరం విపరీతమైన పేరు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతుంది. మరీ ముఖ్యంగా మిథున రాశికి చెందిన స్త్రీలకు 2025వ సంవత్సరం అమోఘంగా ఉండబోతుంది. ఈ సంవత్సరం ఎవరైనా స్త్రీలు వ్యాపారం ప్రారంభిస్తే వారు విశేషమైన అభివృద్ధిని సాధిస్తారు. అలాగే మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది.

కర్కాటక రాశి:

2025లో కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉండబోతుంది. 2025లో కర్కాటక రాశి వారికి అష్టమ శని వెళ్ళిపోతుంది. తొమ్మిదో స్థానంలో శని ప్రవేశించనున్నాడు. అలాగే గురువు వ్యయంలోకి రాబోతున్నారు. దీని కారణంగా ఈ రాశి వారికి 2025 అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. అలాగే 2025లో కర్కాటక రాశికి చెందిన వ్యక్తులకు గొంతు నుంచి బొడ్డు వరకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కాళ్ళు, చేతులు విరగడం వంటివి కూడా జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Venu swamy horoscope prediction for each zodiac sign in 2025

ఈ సంవత్సరం విదేశీ ప్రయాణం, విదేశాల్లో పెట్టుబడులు, విదేశాల్లో చదువు కలిసి వచ్చే అవకాశం ఉంది. దూరమైనా బంధువులు కూడా దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించేది అవకాశం ఉంది. పెళ్లికాని వ్యక్తులకు పెళ్లిళ్లు కావడం, సంతానలేమి వ్యక్తులకు సంతాన ప్రాప్తి, ముఖ్యంగా అన్ని రంగాల వారికి అనుకూలమైన జీవనం ఉండబోతుంది. ముఖ్యంగా రైతులకు 2025వ సంవత్సరంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది. కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు గురువారం పసుపు రంగు వస్తువులను ధరించడం వల్ల మంచి ఫలితాలను పొందొచ్చు.

సింహ రాశి:

2025వ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6గా ఉండబోతుంది. ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి అష్టమ శని ప్రారంభంకానుంది. అలాగే రాహువు ఏడవ స్థానంలో ఉండడం, కేతువు జన్మ స్థానంలో ఉండడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీని కారణంగా తల్లి ఆరోగ్యంగా ఇబ్బందికరంగా ఉంటుంది. బంధువులు, స్నేహితులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంది. నరదృష్టి అధికంగా ఉండే అవకాశం ఉంది. దీని కారణంగా సమాజంలో మీకు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది.

రాజకీయాల్లో, సినిమాల్లో, న్యాయవాదులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, రైతులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతుంది. ఆదాయ మార్గాలు పెరగనున్నాయి. పలు రకాలు ఆదాయం వచ్చి పడుతుంది. కానీ వచ్చినటువంటి ఆదాయం వచ్చినట్టే ఖర్చు అయిపోతుంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడంతో పాటు బ్లూ కలర్ దుస్తులను ధరిస్తే మంచి ఫలితాలను పొందొచ్చు.

కన్యా రాశి:

ఈ రాశి వారికి 2025లో ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉండబోతుంది. ఈ రాశి వారికి 2025లో చాలా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఆరోగ్యం చాలా బాగుటుంది. ధనలాభం కలుగుతుంది. నూతన గృహలాభం లేదా ఆస్తిలాభం పొందే అవకాశం ఉంది. కన్య రాశికి చెందిన వ్యక్తులకు అన్ని రంగాల వారికి జీవనం చాలా చాలా బాగుండబోతుంది. విద్యార్థులు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు లభించనుంది.

అలాగే వ్యాపారులకు వ్యాపారంలో భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. న్యాయవాద వృత్తిలో ఉద్యోగ రంగంలో ఉన్న వ్యక్తులకు ప్రొమోషన్స్ వచ్చే ఛాన్సుంది. పెళ్లికాని వ్యక్తులకు పెళ్లిళ్లు కావడం, సంతానలేమితో బాధపడుతున్న వారికి సంతానం కలగడం వంటి శుభపరిణామాలు జరుగుతాయి. ఎలా చూసుకున్న ఈ రాశికి చెందిన వ్యక్తులకు అన్ని విధాలుగా అద్భుతంగా ఉండబోతుంది. వీరికి ఎలాంటి దోష నివారణ చర్యలు అవసరం లేదు.

Venu swamy horoscope prediction for each zodiac sign in 2025

తులా రాశి:

2025వ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయాం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 2గా ఉండబోతుంది. ఈ రాశి వారు 2025వ సంవత్సరంలో కొంచెం కాంట్రవర్సియల్‌గా ఉంటారు. ఈ రాశి వారికి 6వ స్థానంలో శని సంచరిస్తున్నాడు. దీని కారణంగా 2025లో 98% వీరికి అనుకూలంగా ఉండబోతుంది. ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, రైతులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది. ఏ రంగంలో ఉన్న వ్యక్తులైనా తమ తమ రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. భారీగా లాభాలను గడిస్తారు. వివాహితులు వివాహం అయ్యే సూచనలు, సంతానలేమి వ్యక్తులకు సంతాన ప్రాప్తి సూచనలు కనిపిస్తున్నాయి.

అయితే 2025వ సంవత్సరంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు కాంట్రవర్సియల్ టాపిక్స్‌లో చిక్కుకునే అవకాశం ఉంది. అలాగే పలు వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. జీవితంలో పెను సంచలనం జరగబోతుంది. మీడియాలో పేరు ఎక్కడం, సమాజంలో చెడ్డ పేరు రావడం వంటివి జరుగుతాయి. ఈ రాశికి చెందిన వ్యక్తులు గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం, తిరునళ్ళార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శనిపూజ జరిపించడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు.

వృశ్చిక రాశి:

2025లో వృషిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉండబోతుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్లిపోయే అవకాశం ఉంది. దీని కారణంగా ఈ రాశికి వారికి 2025లో చాలా వరకు అనుకూలంగా ఉండబోతుంది. అయితే నరదృష్టి కారణంగా సమాజంలో కొంచెం చెడుపేరు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలోనే శత్రువులు తయారయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వాపారాల్లో రాణిస్తారు. మంచి లాభాలను పొందడంతో పాటు ఉద్యోగంలో భారీగా జీతం పెరిగే అవకాశం ఉంది.

అలాగే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బాధించేది అవకాశం ఉంది. కుటుంబంలో కుటుంబ వాతారణం చాలా అనుకూలంగా ఉండబోతుంది. బంధువుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే ఛాన్సుంది. మీడియా, రాజకీయ, సినిమా రంగాల్లో ఉన్న వారికి ఈ సంవత్సరం చాలా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తులకు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి:

2025వ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 3, రాజపూజ్యం 1, అవమానం 5గా ఉండబోతుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం కానుంది. దీని కారణంగా ఈ రాశి వారికి సమాజంలో చెడ్డపేరు, కుటుంబంలో సమస్యలు, పోలీసులు, కోర్టు సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ ఆ సమస్యలను ఎదుర్కొని, గెలుపును ఈ రాశికి చెందిన వ్యక్తులు సొంతం చేసుకుంటారు. అయితే మీ వాక్చాతుర్యం, మీ ప్రవర్తనతో ఇతరులను ఆకట్టుకుంటారు. రైతులు, వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. లాభాలు కూడా గడించే అవకాశం ఉంది. గృహ నిర్మాణాలు చేపట్టాలని అనుకునే వ్యక్తులకు ఆ ప్రయత్నం విజయవంతమవుతుంది. అయితే ఈ సంవత్సరం అన్ని రంగాలకు చెందిన వ్యక్తులకు ఇన్‌కం ట్యాక్స్ రైడ్స్ ఎదురయ్యే ఛాన్సుంది.

విద్యార్థులకు, ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతుంది. మరీ ముఖ్యంగా స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతుంది. సొంతంగా వ్యాపారం ప్రారంభించే స్త్రీలకు మంచి లాభాలను పొందుతారు. 10 రూపాయల పెట్టుబడికి 100 రూపాయల లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. వివాహ భాగ్యం, సంతాన భాగ్యం కలగబోతుంది. విద్యార్థులు విదేశీయానం కలిసి వస్తుంది. విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.

మకర రాశి:

2025లో మకర రాశి జాతకులకు ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉండబోతుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోతుంది. దీని కారణంగా గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ రాశికి చెందిన వ్యక్తులు పడుతున్న కష్టానికి విముక్తి లభించనుంది. విపరీతమైన అనుకూలతలు, రాజయోగం పట్టుకోనుంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండబోతుంది. రాజకీయ నాయకులకు అనుకోకుండా పెద్ద పెద్ద పదవులు వచ్చే అవకాశం ఉంది. విదేశీయానం, విదేశీ పెట్టుబడులు కలిసిరానున్నాయి.

అన్ని అనుకూలతలు ఉన్నా కుటుంబంలో ఓ వ్యక్తి మీ నుంచి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్త్రీలకు ఈ సంవత్సరం ఎంతగానో అనుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా అన్ని రకాలుగా స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతుంది. విద్య, వైద్య వ్యాపారాల్లో ఉన్న వ్యక్తులకు అనుకూలంగా ఉండబోతుంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తులకు ప్రొమోషన్స్ లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి.

కుంభ రాశి:

ఈ రాశి వారికి 2025లో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5గా ఉండబోతుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి శని జన్మం నుంచి ఏలినాటి శనికి వస్తున్నాడు. ఏలినాటి శని ప్రారంభం వల్ల ఈ రాశి వారికి 2025లో సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం తీవ్రంగా ఉండడం వల్ల ఆరోగ్య, మానసిక సమస్యలు తీవ్రంగా బాధించనున్నాయి. బుద్ధి భ్రమించడం వల్ల ఏమి చేయాలో తెలియని పరిస్థితి నెలకొంటుంది. అలాగే ఆర్ధిక అనిశ్చితి ఏర్పడడం వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ సంవత్సరం తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు లేదా ప్రాణగండం గోచరిస్తున్నాయి. సంతాన సమస్యలు తీవ్రంగా బాధిస్తాయి. న్యాయపరమైన చిక్కులు కూడా ఎదుర్కునే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభాలు వచ్చినప్పటికీ ట్యాక్సుల పరంగా చాలా రకాల సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంది. అలాగే వాహన ప్రమాదాలు గోచరిస్తున్నాయి. అలాగే రాత్రి వేళల్లో ప్రయాణాలను మానుకుంటే మంచిది. నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండడంతో పాటు బ్లూ కలర్ దుస్తులను ధరించడం వల్ల శని ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది.

మీన రాశి:

ఈ రాశి వారికీ 2025 ఆదాయం 5, వ్యయం 3, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉండబోతుంది. ఈ రాశి వారికి 2025వ సంవత్సరంలో ఏలినాటి శని, జన్మ శనిగా మారబోతుంది. దీని కారణంగా ఎవరైతే 25 సంవత్సరాలు పై బడిన వ్యక్తులు ఉంటారో వారికి విపరీతమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చిత్ర పరిశ్రమల్లో ఉండే వ్యక్తులకు ఈ సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. భార్య భర్తల మధ్య ఏదైనా సమస్యలు ఉంటే.. అది ఎడబాటుగా మారే ప్రమాదం కూడా ఉంది. ఆందోళనలు, భయానక సంఘటనలు, శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి.

ఆదాయ మార్గాలు తగ్గిపోయి.. ఆదాయ రాబడి తగ్గిపోతుంది. దీని కారణంగా EMI చెల్లించడం కుటుంబాన్ని నెట్టుకురావడం అనేది చాలా సమస్యగా మారబోతుంది. కోర్టు కేసులు, పోలీసులు వంటి అనవసర వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు కూడా జరిగే ఛాన్సుంటుంది. కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల సమస్యలను తెచ్చుకుంటారు. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పోతాయి. లోకువ అయిపోయే ప్రమాదం ఉంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు విదేశాల్లో ఉన్న వారికి తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. 2025వ సంవత్సరంలో ఈ రాశి వారికి అత్యంత దరిద్రంగా ఉండబోతుంది. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం, బ్లూ రంగు దుస్తులను ధరించడం శుభం.

గమనిక: ఈ కథనంలోని సమాచారం, జోతిష్య వివరణలు కేవలం మీకు జ్ఞానం అందించేందుకు మాత్రమే అందించబడింది. ఈ కథనం ఆధారంగా మీకు ఎలాంటి నష్టాలైన కలిగిస్తే వాటికి బోల్డ్ స్కై బాధ్యత వహించదు. ఈ సమాచారం ఆధారంగా మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు కచ్చితంగా గుర్తింపుపొందిన నిపుణుల సలహాలు తీసుకోవాలని Boldsky.com మీకు సూచిస్తుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Desktop Bottom Promotion