Latest Updates
-
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి!
అల్లు అర్జున్ కథ ముగిసినట్లే.. పుట్టినరోజు నాడే బన్నీ గురించి సంచలన జ్యోతిషం చెప్పిన వేణు స్వామి!
ఇప్పటికే పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారిన జ్యోతిష్యుడు వేణు స్వామి, మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. ఆయన గతంలో సెలబ్రిటీ జాతకాలపై చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదమయ్యాయో తెలిసిందే. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మహిళా కమిషన్ ముందు హాజరై క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి కూడా ఎదురైంది. అప్పట్లో ఆయన తాను ఇకపై ప్రముఖుల జాతకాలను బహిరంగంగా చెప్పబోనని ప్రకటించినా, అది కేవలం మాటలకే పరిమితమైంది.
అల్రెడీ 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికవుతారనే జ్యోతిష్యం చెప్పి, తరువాత ఫలితాలు తారుమారు కావడంతో తాను ఇకనేం అంచనాలు చెప్పనని స్వయంగా ప్రకటించిన వేణు స్వామి.. ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చారు. అక్కినేని నాగచైతన్య మరియు శోభిత ధూళిపాళల నిశ్చితార్థం జరిగిన రోజే వారి విషయంలో అశుభంగా మాట్లాడిన ఆయన, తీవ్ర విమర్శలకు లోనవుతున్నారు. తాజాగా లీకైన ఆడియో టేప్ లో విజయ్ దేవరకొండ, ప్రభాస్, సమంత లాంటి స్టార్స్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అయ్యాయి. వీరిలో ఒకరు "అఘాయిత్యం" చేసుకోవచ్చనే వ్యాఖ్యలు మళ్ళీ అతనిపై సోషల్ మీడియాలో విమర్శలు రావడానికి కారణమయ్యాయి. అయితే వెనుస్వామి.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన భవిష్యత్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి, మరోసారి వార్తల్లో నిలిచారు. అల్లు అర్జున్ గురించి వేణు స్వామి ఏం చెప్పారో ఈ స్టోరీలో వివరించాము చూడండి.

అల్లు అర్జున్ విషయంలో మోస్ట్ షాకింగ్ కామెంట్స్
జ్యోతిష్యుడు వేణు స్వామి ఇప్పటి వరకు అందరు సెలెబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటికీ.. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కొంత పాజిటివ్‌గానే మాట్లాడేవారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ మీద కూడా కొంత విస్మయానికి గురి చేసే అంచనా వేశారు. అదేంటంటే.. "తెలుగు సినిమా పతనానికి అల్లు అర్జున్ నాంది పలికాడు. ఆయన కారణంగా ఇండస్ట్రీ భవిష్యత్తు మసకబారే ప్రమాదం ఉంది." అని అన్నారు. అంతే కాదు, "అల్లు అర్జున్ పై శని ప్రభావం తీవ్రంగా ఉంది. దాని కారణంగానే ఆయన జైలుకు కూడా వెళ్లి వచ్చారని చెప్పారు. దీంతో ఆ దోషం కొంత తగ్గినప్పటికీ.. ఇంకా పూర్తిగా తొలగలేదు" అని చెప్పారు. అలాగే, "రాబోయే కాలంలో అల్లు అర్జున్ మరియు సుకుమార్ మధ్య బలమైన విభేదాలు చెలరేగుతాయి" అని అన్నారు.
ఆయన భవిష్యత్తులో చేసే సినిమాలు చాలా నెగిటివిటీని మూటగట్టుకుంటాయని చెప్పారు. శని కారణంగా అల్లు అర్జున్ సినిమాలు హిట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పారు. అల్లు అర్జున్ జాతకం ప్రకారం కుటుంబ సభ్యులతో కొంత ముప్పు వచ్చే అవకాశం ఉంటుందని.. వివాదాలకు ఆయన ఎంత దూరం ఉంటే అంత మంచిదన్నారు. తన సొంత కుటుంబానికి చెందిన వారే ఆయనను కిందికి లాగేస్తారని జోస్యం చెప్పారు. ఇప్పటి నుంచి కొన్ని సంవత్సరాల పాటు అల్లు అర్జున్ పతనం ఉంటుందని చెప్పారు.
సోషల్ మీడియా స్పందన
ఈ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. "ఎన్నిసార్లు తిట్టించుకున్నా, మార్పు లేదు" అంటూ కామెంట్లు చేస్తున్నారు. "ఈయన వాడుతున్న భాష, విధానం చూస్తే జ్యోతిష్య జ్ఞానం కన్నా పబ్లిసిటీ కోసమే మాట్లాడుతున్నట్టుంది" అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ వ్యాఖ్యలు బన్నీ పుట్టినరోజైన ఏప్రిల్ 8న రావడం కూడా ఉద్దేశపూరితమేనని పలువురు అంటున్నారు. పుష్ప చిత్రం తర్వాత తెలంగాణలో ప్రభుత్వం అదనపు షోలకు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆ పరిణామాలను ఆధారంగా తీసుకుని వేసిన అంచనాలే ఈ వ్యాఖ్యల వెనుక ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications