Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఈ రాశుల వారికి 2025 దరిద్రంగా స్టార్ట్ అవుతుంది!
జోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తమ తమ రాశిని మార్చుకుంటూ ఉంటారు. అయితే ఈనెల 28వ తేదీ నుంచి నెల రోజుల పాటు శుక్రుడు కుంభ రాశిలో సంచరించనున్నాడు. అలాగే అదే రాశిలో ఉన్న శనితో కలవనున్నారు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు వచ్చినప్పటికీ కొన్ని రాశుల వారికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వైవాహిక, ధన, ఆర్ధిక నష్టాలపాటు కొన్ని ముఖ్యమైన విషయాల్లో కూడా విఫలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ రాశులు ఏంటి? వారికి ఏ విధమైన ఇబ్బందులు వస్తాయనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కర్కాటకం
ఈ రాశి వారికి ఎనిమిదో స్థానంలో శుక్ర, శని గ్రహాల కలయిక జరుగుతుంది. దీని కారణంగా ఈ రాశుల వారు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అక్రమ సంబంధాలు, వ్యసనాలు, అనవసర పరిచయాల కారణంగా తీవ్రంగా మనోవేదనకు గురవుతారు. అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి. వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు తొలిగిపోతాయి. లేనిపోని మనస్పర్థలు తలెత్తుతాయి. బంధు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి.

సింహం
ఈ రాశి వారికి సప్తమ స్థానంలో శుక్ర, శని గ్రహాల యుతి జరుగుతుంది. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కొంత విలాసవంతమైన జీవితం కోసం, స్నేహితుల కోసం డబ్బును ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆర్ధిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. అనవసర పరిచయాలు, వ్యసనాలకు దూరంగా ఉండాలి. వివాదాల్లో తలదూర్చకూడదు. జీవిత భాగస్వామితో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి ప్రయత్నాలు విఫలమవుతాయి.
కన్య
ఈ రాశిలో శనీశ్వరుడు ఆరో స్థానంలో సంచరిస్తున్నారు. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులకు అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ శనితో శుక్రుడు కలవడం వల్లే కొన్ని సమస్యలు ఎక్కువ అవుతాయి. బంధు మిత్రులతోనే కాకుండా, జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తుతాయి. ఆర్ధిక నిర్వహణలో తప్పటడుగులు వేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో కూడా కొంత సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ధనుస్సు
ఈ రాశి వారికి మూడో స్థానంలో శని సంచరిస్తున్నాడు. దీని కారణంగా మంచి ఫలితాలు పొందుతారు. కానీ ఆ శనితో శుక్రుడు చేరడం వల్లే ఇబ్బందులు ఎదురవుతాయి. విలాస జీవితానికి అలవాటు పడడం, స్నేహితుల కోసం ఎక్కువగా ఖర్చు చేయడం వల్ల కష్టార్జితం అంతా వృథా అవుతుంది. వ్యాపారంలో స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు తగ్గిపోతాయి. స్నేహితుల కారణంగా నష్టపోతారు. కొన్ని వివాదాల్లో ప్రతికూలమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మీన
ఈ రాశి వారికి వ్యయ స్థానంలో శుక్ర, శని గ్రహాల కలయిక జరుగుతుంది. దీని కారణంగా ఈ రాశికి చెందిన వారికి దాంపత్య జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. శారీరక శ్రమ పెరగడంతో పాటు ఆదాయానికి మించిన ఖర్చు ఉంటుంది. ఆరోగ్యం కూడా పాడవుతుంది. మీ సహాయం తీసుకున్న వ్యక్తులే ముఖం చాటేస్తారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications