Latest Updates
-
Jeera Biscuits Recipe:హెల్తీ, టేస్టీ జీరా బిస్కెట్స్..బేకరీని మించిన రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
బ్రకోలీ, బాదంతో సూపర్ హెల్తీ పాస్తా..రుచి చూస్తే వదిలిపెట్టరు! -
3 నిమిషాల మ్యాజిక్..ఈ చిన్న పనితో 13 రకాల క్యాన్సర్లకు చెక్! -
ఈ ఐదు లక్షణాలు ఉంటే మీ భర్త బంగారమే.. మరి మీవారిలో ఈ గుణాలు ఉన్నాయా.? -
కర్ణాటక స్పెషల్ వాంగి బాత్ పొడి..ఒక్కసారి చేస్తే 4 నెలలు నిల్వ..బోర్ కొట్టించే కూరలు కూడా అమృతమైపోతాయ్.. -
కృష్ణాష్టమి స్పెషల్: చిన్ని కన్నయ్యకి ఎంతో ప్రీతికరమైన అటుకుల లడ్డూ.. చక్కెర లేకుండా భలే రుచిగా.! -
పుట్టుకతోనే అదృష్టవంతులు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాజ యోగం ఉన్న రాశులు ఇవే! -
కృష్ణాష్టమి స్పెషల్..కన్నయ్యకు అత్యంత ఇష్టమైన ధనియాల పంజిరి ఎలా చేసుకోవాలంటే.. -
జ్వరం వచ్చినప్పుడు త్వరగా కోలుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? -
వంకాయ వండటం ఓ కళ.. అయ్యంగార్ స్టైల్ లో ఇలా చేస్తే రుచికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే!
సూర్య-శుక్ర కలయికతో రాజభంగ యోగం.. ఈ 4 రాశుల వారికి అదృష్టం, సంతోషం
వేదజ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్ర గ్రహాన్ని భౌతిక ఆనందాలకు అధిపతిగా పరిగణిస్తారు. ఆగస్టు 7వ తేదీ సోమవారం రోజున కర్కాటక రాశిని శుక్రుడు సంక్రమించనున్నాడు. అలాగే గ్రహాల అన్నింటికి అధిపతిగా, రాజుగా భావించే సూర్యుడు ఇప్పటికే కర్కాటక రాశిలో ఉన్నాడు. సూర్యుడు - శుక్ర గ్రహాలను శత్రు గ్రహాలుగా భావిస్తారు. ఇప్పుడు శుక్రుడు సంచారంతో సూర్య-శుక్ర కలయిక ఏర్పడనుంది. ఈ కలయిక రాజభంగ యోగాన్ని ఏర్పరుస్తుంది.
కర్కాటక రాశిలో సూర్యుడు, శుక్రుడు ఉండటం, రాజభంగ యోగం ఏర్పడటం వల్ల 12 రాశుల వారిపై ప్రభావం పడనుంది. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం ఈ రాజభంగ యోగం అద్భుతంగా ఉండనుంది. కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసిరానుంది. ఆ రాశులు ఏవో, అందులో మీ రాశి ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి
శుక్రుడు, సూర్యుడి కలయిక వల్ల ఏర్పడే రాజభంగ యోగం వల్ల మేష రాశి వారికి అద్భుతంగా ఉండనుంది. ఈ సమయంలో తల్లిదండ్రులతో కలిసి విహారయాత్రలకు వెళ్లి హాయిగా గడుపుతారు. పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి వస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అనవసర ఖర్చులు అదుపు చేయగలిగితే ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండనుంది. ఉద్యోగస్తులకు కెరీర్ లో పురోగతికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొత్త వ్యక్తులతో పరిచయం ప్రయోజనం చేకూరుస్తుంది. రోగాల బారి నుంచి బయట పడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త వాహనం, కొత్త ఆస్తులు కొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సమయం మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది.
కర్కాటక రాశి
సూర్య- శుక్ర గ్రహాల కలయిక వల్ల ఏర్పడనున్న రాజభంగ యోగం కర్కాటక రాశి వారికి చాలా కలిసి రానుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి సామాజికంగా, ఆధ్యాత్మికంగా బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తిరిగి రాని అప్పుల నుంచి డబ్బులు పొందుతారు. రాజభంగ యోగం ప్రభావంతో వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగం మారాలనుకునే వారు కూడా మంచి ఆఫర్లు అందుకుంటారు. జీవిత భాగస్వామితో అనుబంధం బాగుంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ కాలంలో మంచి అవకాశం లభిస్తుంది.
తులారాశి
తులారాశి వారికి రాజభంగ యోగం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో ఆర్థిక సవాళ్లను అధిగమించవచ్చు. ఆర్థిక లాభాలు పొందుతారు. కొత్త వ్యక్తులతో కలిసి పని చేసే అవకాశం లభిస్తుంది. ప్రైవేట్ రంగంలో పని చేసే వారికి ఈ కాలం కలిసివస్తుంది. ప్రభుత్వ రంగంలో పని చేసే వారికి అధిక లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. కుటుంబవ్యాపారులకు ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది.వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణఆళికలు సిద్ధం చేసుకుంటారు. ఒంటరి వ్యక్తులు త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి శుక్రుడు మరియు సూర్యుడు ఏర్పడిన రాజభంగ సమావేశం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ జీతం పెరుగుతుంది. పనిలో మీ విశ్వసనీయత పెరుగుతుంది. మీరు భవిష్యత్తులో మంచి ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థులకు చదువుపై ఆసక్తి ఉంటుంది. తల్లిదండ్రులతో మీ సంబంధం మెరుగ్గా ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications