Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
శుక్రుడు టైం మొదలయ్యింది.. ఈ రాశుల వారు అంబానికే అప్పు ఇచ్చేంత డబ్బులు సంపాదిస్తారు!
జోతిష్య శాస్త్రం ప్రకారం నవ గ్రహాల్లో శుక్రుడు అత్యంత ముఖ్యమైన, శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ఏ రాశి అయితే శుక్ర సంచారం ఉంటుందో ఆ రాశి వారికి ప్రేమ, సంపద, సమాజంలో గౌరవ మర్యాదలు, ఇంట్లో సుఖ సంతోషాలు, కీర్తి సౌకర్యాలు ఉంటాయి. అలాంటి గొప్ప గుణాలు, లక్షణాలు కలిగిన శుక్రుడు నిన్న మకర రాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా పలు రాశుల వారు ప్రభావితం కానున్నారు. శుక్రుడు అనుగ్రహంతో తమ జీవితంలోకి సుఖ సంతోషాలను పొందనున్నారు. ఐశ్వర్య సంపదలతో తలతూగానున్నారు. కుటుంబ జీవితంలో ఎన్నడూ ఎన్ని సంతోషాలను చూస్తారు. అయితే ఇంతకీ ఆ రాశులు ఏంటి? ఏ ఏ రాశుల వారికి శుక్రుడు అనుగ్రహం కలిసిరానుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మకర రాశిలోకి శుక్రుడు ఎప్పుడు ప్రవేశించాడంటే..
జోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు డిసెంబర్ 2వ తేదీ ఉదయం 11:46 మకర రాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడు శుభ ఘడియల్లో రాశి మార్పు చెందడంతో పాటు శుభ సూచకాలు ఇస్తుండడంతో ఈ రాశుల వారి జీవితం మారిపోనుంది. అలాగే ఈ మూడు రాశుల వారికి 2025 గొప్ప ప్రారంభం కాబోతుంది.

ఏ ఏ రాశుల వారికి కలిసి వస్తుందంటే?
వృషభ:
మకర రాశిలో శుక్రుడు సంచారం కారణంగా వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. అనుకోని స్థాయిలో డబ్బులు సంపాదిస్తారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉండిపోయిన పనులను ఈ రాశి వారు శుక్రుడి అనుగ్రహంతో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు తమ తమ ఉద్యోగంలో ఉన్నత స్థానానికి పదోన్నతి పొందుతారు. అలాగే కోరుకున్న స్థానానికి బదిలీ అయ్యే ఛాన్సుంది. కొన్ని న్యాయపరమైన విషయాల్లో ఈ రాశికి చెందిన వ్యక్తులు విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు సంచారం కారణంగా ఈ రాశి వారికి కొత్త సంవత్సరం గొప్పగా ప్రారంభం కానుంది. మంచి కుటుంబ వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా 2025ను ఈ రాశి వారు ప్రారంభించనున్నారు.
మిథున:
మకర రాశిలో శుక్రుడు సంచారం మిథున రాశి వారికి చాలా శుభప్రదంగా మారింది. వృత్తి, వ్యాపారాల్లో ఈ రాశి వారికి పురోగతి కనిపిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టతలు పెరుగుతాయి. సంపద పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. రాజకీయాల్లో రాణించే వ్యక్తులు తమ ప్రభావాన్ని గట్టిగా చూపుతారు. కొత్త గృహ కొనుగోలు, ఆస్తి కొనుగోలు వంటి విషయాలు ఈ రాశి వారికి కలిసి వస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. చిన్న చిన్న గొడవలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో ఓ వ్యక్తికి సంబంధించిన శుభవార్త వింటారు.
కుంభ రాశి:
మకర రాశిలో శుక్రుడి సంచారం ఈ రాశి వారికి కూడా అదృష్టాన్ని ఇవ్వనుంది. దీనివల్ల కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఈ నెల మొదటి వారంలో శుక్రుడు సంచారం కారణంగా ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా లాభాలు చేకూరనున్నాయి. డబ్బులు బాగా సంపాదించే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు తాము చేస్తున్న పనిలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆర్ధిక రాబడి పెరుగుతుంది. వ్యాపార విస్తీర్ణం చేయాలనే ఆలోచన మంచి నిర్ణయంగా మారబోతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇది శుభకాలం. అన్ని విధాలుగా వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications