Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
విలాసాల కారకుడి రాశి మార్పు..ఈ 3 రాశుల వారికి శుక్రుడి కటాక్షంతో ధనయోగం,అన్ స్టాపబుల్ లక్
ఈ ఏడాది ఏప్రిల్ 30న అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. అయితే ఇదే రోజున విలాసాలు, ప్రేమ, డబ్బుకి కారకుడు అయిన శుక్రుడు అగ్ని తత్వానికి చెందిన మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జూన్ 6 వరకు శుక్రుడు మేష రాశిలోనే సంచరిస్తాడు. మేష రాశిలోకి శుక్రుడి సంచారం ఎఫెక్ట్ మొత్తం 12 రాశులపై ఉంటుంది. అయితే మూడు రాశుల వారికి మాత్రం భారీ ప్రయోజనాలుంటాయి. శుక్రుడి సంచారంతో లాభపడే 3 రాశులు ఏవి? శుక్ర సంచారం ఎవరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందో ఇక్కడ చూడండి.
మేష రాశి
శుక్ర సంచారంతో మేష రాశి వ్యక్తులకు మంచి రోజుల మొదలవుతాయి. శుక్రుడు మేష రాశిలోకి అడుగుపెట్టగానే మీలో ఒక కొత్త శక్తి ఉప్పొంగుతుంది. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఆత్మనూన్యత భావం, మిమ్మల్ని వెనక్కి లాగుతున్న పరిమితులు ఇకపై మీ దారికి అడ్డురావు. గత కొన్ని నెలల్లో మీ ప్రేమ వ్యవహారాల్లో ఎదురైన ఒడిదుడుకులు, ఆర్థిక విషయాల్లొ గందరగోరళం,మీ అదృష్టానికి అడ్డుపడుతున్న సమస్యలన్నీ ముగిసిపోతాయి. మీ బంధాలన్నీ మళ్లీ చిగురిస్తాయి. మీ జీవితం మళ్లీ పువ్వులా వికసిస్తుంది. ఇన్నాళ్లు మీరు పట్టించుకోని మీ సొంత అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఇది. మీరు ఎప్పటినుంచో ఆశిస్తున్న కోరికలు నెరవేరుతాయి.

తుల
ఏప్రిల్ చివరిరోజు తుల రాశి వ్యక్తుల జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలకు వేదిక కానుంది. శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించిన తర్వాత మీ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుంది. కెరీర్ పరంగా కొన్ని అద్భుతమైన అవకాశాలు మీకు వస్తాయి. కొత్త స్నేహాలు చిగురిస్తాయి. ప్రేమ బంధాలు బలపడతాయి. ఒక నూతన భాగస్వామం మీ జీవితంలో రావచ్చు. నాయకత్వ పగ్గాలు చేపట్టడానిిక మీరు సిద్ధంగా ఉంటారు. మీ కలలు సాకారమయ్యే సమయం ఇది. మీలోని ప్రత్యేకమైన నైపుణ్యాలను ఎలా వెలికి తీయాలో ఈ సమయంలో మీరే గ్రహిస్తారు. ఏదో తెలియన నూతన ఉత్తేజం మిమ్మల్ని ఆవహించి ఏఉంటుంది. మీ మనస్సు చెప్పేదే యవింటారు. మీ అంతరంగంలో చోటుచేసుకునే మార్పులు మీ బంధాలలో సృష్టంగా కనిపిస్తాయి. ఈ సమయంలో అనేక కొత్త పనులు చేపట్టడానికి ఎక్కవగా ఇంట్రెస్ట్ చూపిస్తారు.
కర్కాటకం
శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించాక కర్కాటక రాశి వాళ్ల దరిద్రాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోవడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఏది చేయాలనుకుంటే దాన్ని విజయవంతంగా చేసేయగల్గుతారు. మీ సామర్థ్యాన్ని, మీ బలాన్ని ఇతరులు గుర్తిస్తారు. లక్ష్యాలవైపు ధైర్యంగా అడుగులు వేస్తారు. సమాజంలో మీకు గుర్తింపు లభిస్తుంది.మీ కృషికి ప్రశంసలు దక్కుతాయి. మీరు ఎంత విలువైనవారో అందరూ గుర్తిస్తారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసేవాళ్లు ఇక ఉండరు. గత కొంతకాలంగా కెరీర్ పరంగా,మీ లక్ష్యాలను చేరుకునే క్రమంలో మీరు ఎదుర్కొన్న అడ్డంకులు,నిస్తేజ పరిస్థితులు అన్నీ తొలగిపోతాయి. ఏం సాధించాలి, భవిష్యత్తులో ఏం జరగబోతుందో అర్థం చేసుకొని ఆ విధంగా మీరు అడుగులు వేస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications