Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డిసెంబర్‌లో రెండుసార్లు సంచరించనున్న శుక్రుడు.. ఈ మూడు రాశులవారికి జాక్‌పాట్ తగలనుంది!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని అరుదైన సందర్భాల్లో ఒకే నెలలో గ్రహాలు రెండుసార్లు సంచరిస్తాయి. దీని ప్రభావం అన్ని రాశుల వారిలోనూ కనిపిస్తుంది. అయితే ఈ డిసెంబర్‌లో ప్రేమ, అందం, సంపదకు కారణమైన శుక్రుడు డిసెంబర్ రెండుసార్లు సంచరించనున్నాడు. డిసెంబర్ 2న మకర రాశిలోకి, డిసెంబర్ 28వ తేదీన కుంభరాశిలోకి ప్రవేశించి ఆ రెండు రాశుల్లో సంచరించనున్నాడు.
దీని కారణంగా మూడు రాశుల వారికి డిసెంబర్‌లో అదృష్టం కలిసిరానుంది. ప్రేమ విజయవంతమవడంతో పాటు సంపదకు కారణమవుతాయి. అలాగే అనుకున్న కార్యాలన్నీ విజవంతమవుతాయి. చేపట్టిన పనులన్నీ పూర్తవడంతో పాటు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అయితే ఆ రాశులు ఏంటి? ఏ రాశుల వారికి అదృష్టం పట్టుకోనుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు డిసెంబర్‌లో శుక్రుని సంచారం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశిలో శుక్రుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఈ రాశివారు తమ అదృష్టాన్ని బలపరుచుకోనున్నారు. నిరుద్యోగులకు ఈ నెలలో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న వ్యక్తులకు ఉద్యోగం రావడం, వ్యాపారం ప్రారంభించాలనుకునే వ్యక్తులకు అనుకున్న విధంగా కలిసి రావడం జరుగుతుంది. కొత్త ఒప్పందాలు మీ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి.
మకర రాశి
మకర రాశిలో జన్మించిన వారికి డిసెంబర్ నెలలో రెండుసార్లు శుక్రుని సంచారం శుభాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే శుక్రుడు ఒకసారి మకర లగ్నములో రెండవసారి ధన స్థానంలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా మకర రాశి వారికి గొప్ప ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ నెలలో మకర రాశి వారి ఆత్మవిశ్వాసం పెరగనుంది.
మకర రాశి వారి వైవాహిక జీవితం చాలా బాగుటుంది. ఆర్ధిక పరిస్థితులు కూడా చక్కబడతాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. అలాగే వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలను పొందుతారు. వివాహం చేసుకోవాలని అనుకుంటున్న వ్యక్తులకు మంచి సంబంధం కుదురుతుంది.
కుంభ రాశి
డిసెంబర్ నెలలో రెండుసార్లు శుక్రుడు సంచారం కారణంగా ఈ రాశి చెందిన వ్యక్తుల జీవితం స్థిరమైన పురోగతిని సాధిస్తుంది. ఎందుకంటే శుక్రుడు సంచరించిన రెండుసార్లు ధన, లాభ స్థానంలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా కుంభ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ కాలంలో చేపట్టే పనులన్నీ విజయవంతమవుతాయి. అప్పుగా ఇచ్చిన నగదు తిరిగి ముడుతుంది.
కుంభరాశికి చెందిన వ్యక్తులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా?, పెట్టుబడులు పెట్టాలన్నా ఇది చాలా మంచి సమయం. ఈ సమయంలో మీ మనోహరమైన సంభాషణ కారణంగా కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. అది లాభదాయకంగా మారడంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు సృష్టించడానికి ఉపయోగపడుతుంది. ఈ డిసెంబర్ నెలలో కుంభరాశి వారి ఆర్ధిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు డబ్బు లేని లోటు ఉండదు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, జోతిష్యం, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. దీనిని విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications