Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
కర్కాటక రాశిలో శుక్రుని సంచారం.. ద్వాదశ రాశివారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే..
ఆగస్టు 7న శుక్రుడు మిథునరాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది కొన్ని రాశులపై మంచి ప్రభావం చూపితే, మరికొన్ని రాశులపై అశుభ ప్రభావం చూపుతుంది. కర్కాటక రాశిలో శుక్రుడు రాకతో కొంతమంది స్థానికులకు ఖర్చులు విపరీతంగా పెరగవచ్చు. కొన్ని రాశుల్లో సాన్నిహిత్యం మెరుగుపడే అవకాశం కూడా ఉంది. శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి, ద్వాదశ రాశులపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి
కర్కాటక రాశిలో శుక్రుడు సంచరించడం వల్ల మేషరాశి వారికి సామాజిక గౌరవం లభిస్తుంది. వ్యాపారం చేసే వారికి మంచి పురోగతి అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఇది మంచి సమయం. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వైవాహిక, ప్రేమ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఎదుర్కొంటారు.
వృషభరాశి
వృషభ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉండనుంది. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగం చేస్తున్న వారికి, మారాలనుకునే వారికి ఇది అద్భుతమైన సమయం.
మిథునరాశి
కుటుంబ సభ్యుల మధ్య కలహాలు సమసిపోతాయి. ఉద్యోగాల్లో ఉన్న వారికి ప్రమోషన్ లభిస్తుంది. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది.
కర్కాటకరాశి
కర్కాటక రాశి వారి ఈ సమయంలో సంయమనం పాటించాలి. మంచి పదవి పొందుతారు. ఆర్థికంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి అనుభవిస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.
సింహరాశి
సింహ రాశి వారు ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
కన్యరాశి
సంబంధాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆదాయం, ధనలాభం పెరుగుతుంది. వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. అప్పుగా ఇచ్చిన డబ్బు వస్తుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
తులారాశి
వైవాహిక జీవితంలో సమస్యలు రావొచ్చు. ఉద్యోగస్తులు పురోగతిని పొందుతారు. స్నేహితులు, బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారవేత్తలు, ఉద్యోగులు సవాళ్లు ఎదుర్కొంటారు.
వృశ్చికరాశి
వైవాహిక జీవితంలో ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దీర్ఘఖాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.
ధనుస్సు రాశి
ఎవరి వద్ద అప్పు తీసుకోకుండా నియంత్రించుకోవాలి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు ఆటంకాలు ఎదురుకావొచ్చు.
మకరరాశి
జీవితంలో ఆనందాన్ని పొందుతారు. చెల్లించిన డబ్బు తిరిగి వస్తుంది. చదువులో శ్రమ పడాల్సి వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.
కుంభరాశి
విజయాన్ని అందుకోవడానికి చాలా కష్టపడాలి. ఖర్చులు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆచితూచి వ్యవహరించాలి.
మీనరాశి
ప్రేమ, ఆప్యాయతలు అందుతాయి. విజయాలు అందుకుంటారు. లాభం పొందుతారు. ఏకాగ్రత పెరుగుతుంది. అనుకూల ఫలితాలు అందుకుంటారు. వైవాహిక జీవితం మెరుగుపడుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
