Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
శుక్రుడి అనుగ్రహం..ఈ 5 రాశులకు గోల్డెన్ పీరియడ్..కెరీర్, ధనం, సంబంధాల్లో అద్భుతాలు
జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రేమ, అందం, కళలు, విలాసాలు, సంపద, భౌతిక సుఖాలు, దాంపత్య సౌఖ్యం వంటి సకల శుభాలకు శుక్రుడిని అధిపతిగా పరిగణిస్తారు. శుక్రుడిని భోగకారకుడు అని కూడా అంటారు. అటువంటి శుభగ్రహం తన గమనంలో ఒక కీలకమైన మార్పు చేయబోతోంది. ఒక గ్రహం తన సొంత ఇంట్లో లేదా స్వక్షేత్రంలో సంచరించడం అత్యంత శక్తివంతమైన, శుభప్రదమైన సంఘటనగా పరిగణిస్తారు. దీనివల్ల ఆ గ్రహం కారకత్వాలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయి.
శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. జూన్ 29వ తేదీ మధ్యాహ్నం 2:08 గంటలకు, శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడి ఈ స్వక్షేత్ర సంచారం దాదాపు 25 రోజుల పాటు కొనసాగి మేషం నుండి మీనం వరకు ఉన్న మొత్తం 12 రాశుల వ్యక్తుల జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. దేశ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, వ్యాపార రంగాలలో కూడా అనేక సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఈ శుక్ర సంచారం ముఖ్యంగా 5 రాశుల వాళ్లకి అద్భుతమైన యోగాన్ని, అనూహ్యమైన అదృష్టాన్ని తీసుకురాబోతోంది. జూలై నెల మొత్తం ఈ రాశుల వారికి ఒక పండగ వాతావరణాన్ని సృష్టిస్తుంది. వారి జీవితాల్లో సంపద, సంతోషం వెల్లివిరుస్తాయి. మరి ఆ అదృష్టవంతమైన 5 రాశులు ఏవి? వాటికి కలగబోయే ప్రయోజనాలేంటో ఇక్కడ చూడండి.

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఇది అత్యంత యోగదాయకమైన కాలం. ఎందుకంటే మీ రాశి అధిపతే అయిన శుక్రుడు మీ రాశిలోనే అంటే మీ లగ్నంలోనే (మొదటి ఇంట) సంచరించబోతున్నాడు. ఇది మీ వ్యక్తిత్వానికి ఒక కొత్త మెరుపును ఇస్తుంది. మీ మాటతీరు, ప్రవర్తన ఇతరులను సులభంగా ఆకట్టుకుంటాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దాంపత్య జీవితంలో మాధుర్యం వెల్లివిరుస్తుంది. భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. అత్తమామలతో సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి, కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది. మొత్తంమీద ఇది మీకు ఒక గోల్డెన్ పీరియడ్ లా ఉంటుంది.
సింహ రాశి
సింహ రాశి వారికి శుక్రు సంచారం వృత్తి, ఉద్యోగ రంగాలలో అద్భుతమైన ఫలితాలను అందించనుంది. శుక్రుడు మీ రాశికి పదవ ఇంట అంటే కర్మ స్థానంలో (రాజ్య స్థానం) సంచరిస్తున్నాడు. ఇది మీ కెరీర్ కు ఊహించని మలుపునిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్, జీతం పెరుగుదల వంటివి ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు ఇది లాభాల పంట పండించే సమయం. వ్యాపార విస్తరణ, కొత్త భాగస్వామ్యాలు, కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా ఆర్థిక పరిస్థితిని పటిష్టం చేసుకుంటారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల పూర్తి సహకారం లభించడం వల్ల పనులన్నీ సులభంగా పూర్తవుతాయి.

కన్య రాశి
కన్య రాశి వారికి శుక్రుడు భాగ్య స్థానంలో (తొమ్మిదవ ఇల్లు) సంచరించడం వల్ల అదృష్టం రెక్కలు తొడుగుతుంది. ఈ సమయంలో మీరు ఏది పట్టినా బంగారమే అయిపోతుంది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు, పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు ఈజీగా పూర్తవుతాయి. మీ సౌకర్యాలు, విలాసాలు పెరుగుతాయి. చాలా కాలంగా ఇల్లు కొనాలన్న, కొత్త వాహనం కొనుగోలు చేయాలన్నా మీ కలలు నెరవేరే బలమైన అవకాశాలున్నాయి. తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి. విదేశీ ప్రయాణ యోగం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు మీకు లాభాలను తెచ్చిపెడతాయి. కెరీర్ లో ముందుకు సాగడానికి అనేక కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. దాంపత్య జీవితం కూడా ఆనందదాయకంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి శుక్రుడు సప్తమ స్థానంలో సంచరించడం వల్ల ఆదాయంలో అనూహ్యమైన పెరుగుదల ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యాలు లాభిస్తాయి. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ సమయంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపార పని కోసం దేశ,విదేశీ ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఈ జర్నీలు మీకు లాభదాయకంగా ఉంటాయి. ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లే యోగం ఉంది. సరైన ఆహార నియమాలు, వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి గుడ్ న్యూస్ లు అందుతాయి.
మీన రాశి
మీన రాశి వారికి శుక్రుడు తృతీయ స్థానం అంటే పరాక్రమ స్థానంలో సంచరించడం ద్వారా మీ ధైర్యసాహసాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు అద్భుతంగా మెరుగుపడతాయి. అదృష్టం మీకు పూర్తిగా సహకరిస్తుంది. ధన సంపాదనకు కొత్త మార్గాలు, అవకాశాలు లభిస్తాయి. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి కెరీర్ లో పురోగతి సాధించవచ్చు. మీ ఇద్దరి మధ్య అవగాహన పెరిగి, భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన ప్రణాళికలు వేస్తారు. వ్యాపార విస్తరణకు, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మీరు కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా మంచి లాభాలు పొందుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications