Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక, సంచారం.. వివిధ రాశుల వారి జాతకాలపై ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ నక్షత్రాలకు అధిపతిగా ఉన్న శుక్ర గ్రహ గోచారంతో కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరి ఏయే రాశుల వారికి ఈ గ్రహ గోచారం కలిసి వస్తుందో చూద్దాం..

జూలై 29 న ఉదయం, శుక్రుడు ఉత్తరఫల్గుణి నక్షత్రంలోకి ప్రవేశించడం ద్వారా మూడు రాశుల వారికి లాభదాయకం, సంతోషదాయకంగా ఉంటుంది. ఉత్తరఫల్గుణి నక్షత్రం సూర్యునికి చెందినదిగా జ్యోతిష్యం చెబుతోంది. కాగా, శుక్రుడు, సూర్యుడు స్నేహపూర్వక సంబంధాన్ని పంచుకుంటుండగా.. గోచారం సంబంధించి శుభ పరిణామాలు అనేక రాశులపై కనిపిస్తాయి. ఉద్యోగ అవకాశాలు, వ్యాపార విజయం, ఆర్థిక స్థితితో పాటు సామాజిక హోదాలో సానుకూల మార్పులను పొందే సూచనలు ఉంటాయి. వారి గౌరవం, మర్యాద కూడా పెరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
వృషభ రాశి
వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అందుకే శుక్ర గోచారం ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సామాజిక ప్రతిష్ఠ మునుపటి కంటే బలంగా ఉంటుంది. మీ ఆలోచనలను, చేతలను సమాజం మెచ్చుకుంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా ఉద్యోగం చేసేవారికి కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఇది మీ బాధ్యతలను మరింత పెంచుతుంది. వ్యాపార రంగంలో కొత్త క్లయింట్‌లను పొందుతారు. కళా నైపుణ్యాలు మెరుగుపడే సూచనలు ఉన్నాయి.

సింహ రాశి
శుక్ర గ్రహ సంచారం సింహ రాశి వారి విజయానికి కొత్త మార్గాలను తెరిచి ఉంచే అవకాశాలు ఉన్నాయి. మునుపెన్నడూ లేనంత బలంగా ఈ ప్రభావం ఉంటుంది. వృత్తిపరంగా ఉద్యోగంలో మీ నాయకత్వ నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. మీ ప్రతిభను బహిరంగంగానే అందరూ మెచ్చుకుంటారు. కుటుంబపరంగా సంబంధాలు స్నేహపూర్వకంగా, సంతోషకరంగా కొనసాగుతాయి. ఆత్మవిశ్వాసం దృఢంగా ఉంటుంది. వివాహానికి సంబంధించి సానుకూల ఆలోచనలు, మిమ్మల్ని ఇష్టపడే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి విషయాలు ముందుకు సాగే సూచనలు ఉన్నాయి.
తులారాశి
తులారాశికి అధిపతిగా శుక్రుడు కావడంతో.. శుక్ర గ్రహ గోచారం ఈ రాశి వారికి ప్రత్యేకంగా శుభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల విషయానికొస్తే మునుపటి కంటే లాభదాయకంగా ఉంటుంది. దీంతో ఆర్థికంగా బలంగా ఉంటారు. పెట్టుబడి సంబంధిత విషయాలలో లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. వైవాహిక జీవితం ఆనందదాయకంగా, సామరస్యంగా ఉంటుంది. మీ బంధం మరింత బలపడుతుంది. వృత్తిపరంగా ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో విస్తరణకు మంచి అవకాశాలు కలిసి రానున్నాయి. మీరు కోరుకున్న విధంగా కుటుంబంతో కలిసి లేదా స్నేహితులతో కలిసి కొత్త ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications