Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
జులై 21 నుంచి జులై 27 2024. వరకు కన్యా రాశివారి జీవితంలో జరిగేది ఇదే..!!
కన్యారాశి వారికి జులై 21 నుంచి 27 వరకు మధ్య జరిగే వార ఫలాల గురించి తెలుసుకుందాం. ఈ వారంలో గ్రహాల స్థితిని పరిశీలించినప్పుడు. కుజ, గురు ఒకే రాశిలో వున్నాయ్. కర్కాటక రాశిలో రవి శుక్రుడు, కుంభ రాశిలో వని ఉండడంతో ఈ వారం ప్రారంభమౌతుంది. కుజ గురు కలిసి ఉండడం వల్ల ఆర్థిక లాభం ఎక్కువగా జరుగుతుంది. ఖర్చులు ఎక్కువగా జరుగుతాయ్. రవి శుక్రుడు కలిస్తే విశేషమైన ధన వ్యయం జరుగుతుంది. బుధుడు సింహరాశిలో ఉండడం వల్ల విద్యార్ధులకు చాలా అనుకూలంటా ఉంటుంది.

రాహువు, కేతువు, మీన కన్య రాశిలో ఉన్నాయ్. కన్యారాశిలో ధన వ్యయం జరుగుతుంది. శుక్రుడు, శని 11వ స్థానంలో సంచరిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి చాలా లాభాలు వస్తాయ్. ప్రభుత్వ పధకాలు కూడా వీరికి బాగా అందుతాయ్. శుక్రుడు రవితో కలిసి ఉండడం వల్ల అధికారంలో ఉన్న వారి సహకారం లభిస్తుంది. మీ బంధువుల్లో ఎవరైనా ఉన్నత స్థానంలో ఉంటే మీకు వారు కచ్ఛితంగా సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మీరు ఉద్యోగ ప్రయత్నంలో వున్నా సహకారం మీకు ఉంటుంది.
ఈ రాశిలో ఉన్న స్త్రీలకు వివాహంలో ఉన్న అనిశ్చితి తొలగిపోతుంది. వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. స్త్రీల మనసులో ఉన్న కోరకలు నెరవేరుతాయ్. ప్రస్తుతం ఉన్న చాలా సమస్యల నుంచి వీరు బయట పడే అవకాశం ఉంటుంది.
బుధుడు వేయి స్థానంలో సంచరించడం వల్ల కన్యారాశికి చెందిన దాదాపు అందరూ చిన్న వ్యాపారస్థులై ఉంటారు. వీరు పెద్ద వ్యాపారాల్లో కాకుండా చిన్న వ్యాపారస్థులుగా ఉంటారు. ఒక వేళ ఉద్యోగంలో చేస్తున్నట్టయితే రాజకీయనాయకులకు సెక్రటరీగానో, చిన్నపాటి, ఫ్యాన్సీ స్టోర్లు, కిరాణా షాపులను నడుపుతూ ఉంటారు. కన్యారాశి వారికి దాదాపు అన్ని గ్రహాలూ అనుకూలంగానే ఉన్నాయ్. జీవిత భాగస్వామికి మంచి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది.
ఈ రాశిలో వయసులో ఉన్నవారు పుణ్య క్షేత్రాలను దర్శించడం జరుగుతుంది. ఆధ్యాత్మిక కేంద్రలో కొన్ని రోజులు ఉండాలనే నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ రాశివారిలో కేతువు వుండడం వల్ల గతంలో ఏ అవకాశం వచ్చినా వదులుకున్నారు. కానీ ప్రస్తుతం అనుకూలంగా గ్రహాలు ఉండడం వల్ల ఏ మంచి అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశం వస్తుంది.
గతంలో కన్నా ఇప్పుడు కన్యారాశి వారు మరింత శ్రమ చేసి ఇంకా మంచి ఫలితాలను బయటకు తీసుకొని వస్తారు. కన్యా రాశి వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొంచెం కష్టపడినా చాలా మంచి ఫలితాలను పొందుతారు.
జులై 24న సంకష్టహరి చతుర్థి రాబోతోంది. ఆర్థిక, కుటుంబ పరంగా సమస్యలు ఉన్నవారు ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల వారి మంచి ఫలితాలను పొందుతారు. ఆ రోజు గణపతి ఆలయంలో జరిగే అభిషేకంలో పాల్గొనడం వల్ల కూడా మంచి జరుగుతుంది.
గమనిక : పైన ఇవ్వబడిన వివరాలన్నీ ప్రముఖ జ్యోతిష్యుల నుంచి, పండితుల నుంచి సేకరించినవి. వీటిని మేము ఎట్టి పరిస్థితిలో దృవీకరించము.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications