Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
మీ నుదిటిపై ఈ రేఖ ఉందా? వారు ధనవంతులవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు!
మనకు ఏదైనా అనుకున్నది జరిగినా లేదా అనుకోనిది జరిగినా నుదిటిపై రాసుండాలి అని తరుచుగా చాలామంది అంటుండటం చూస్తుంటాం. వాస్తవానకి నుదిటి మీద రేఖలను బట్టి మీ జీవితం ఎలా ఉంటదో చెప్పేయవచ్చని పండితులు చెబుతున్నారు. సాముద్రిక శాస్త్రం అనే ప్రాచీన శాస్త్రం మీ ముఖంలోని గీతలు ముఖ్యంగా మీ నుదిటిపై ఉన్న రేఖలు మీ వ్యక్తిత్వం, ఆర్థిక స్థితి, ఆరోగ్యం, అదృష్టం,జీవితంలో ఎదురయ్యే సవాళ్ల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తుందని చెబుతోంది.
మీ నుదిటిపై ఉన్న ప్రతి గీత మీ గత కర్మలప్రతిబింబం, ఈ జీవితంలో మీరు చేసే ప్రయత్నాల సూచన అని నమ్ముతారు. అందుకే ఒక వ్యక్తి చిరునవ్వు కంటే వారి నుదిటిపై ఉన్న రేఖలు వారి భవిష్యత్తును మరింత స్పష్టంగా తెలియజేస్తాయి. ఈ రేఖల రహస్యాలను, అదృష్టవంతులను ఎలా గుర్తించాలో జ్యోతిష్య పండితులు వివరించారు.

ధన రేఖ
మీ నుదిటిపై కనుబొమ్మలకు కొంచెం పైన కనిపించే మొదటి రేఖను ధన రేఖ అంటారు. ఈ రేఖ స్పష్టంగా, లోతుగా ఎటువంటి తెగింపులు లేదా అడ్డంకులు లేకుండా నిటారుగా ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులు. మీ జీవితంలో డబ్బుకు ఎప్పటికీ కొదవ ఉండదని ఇది సూచిస్తుంది. మీరు ఆర్థికంగా స్థిరంగా ఉంటారు.. సంపదను పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అయితే ఒకవేళ ఈ రేఖ తెగిపోయినా, చిన్నగా ఉన్నా లేదా చాలా తేలికగా కనిపించినా మీ జీవితంలో ఆర్థిక సమస్యలు తరచుగా ఎదురవుతాయని అర్థం. డబ్బు నిలబడకపోవచ్చు లేదా అనవసరమైన ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.
ఆరోగ్య రేఖ
నుదిటిపై ధన రేఖకు కొంచెం పైన ఉన్న రేఖ మీ ఆరోగ్యం గురించి తెలియజేస్తుంది. ఈ రేఖ స్పష్టంగా, మందంగా ఉంటే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని అర్థం. మీరు శక్తివంతంగా ఉంటారు. పెద్దగా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. కానీ ఈ రేఖ సన్నగా, తేలికగా ఉంటే మీ ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. చిన్నపాటి అనారోగ్యాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రేఖ తెగిపోయినా లేదా వంకరగా ఉన్నా మీరు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.
దైవిక రేఖ
ఇది చాలా అరుదైన రేఖ. ఇది మీ ముక్కు మీద నేరుగా పైకి, తిలకం పెట్టినట్లుగా వెళుతుంది. దీనిని దైవిక రేఖ అంటారు. మీ నుదిటిపై ఈ రేఖ ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులు. మీరు ఊహించని విధంగా అద్భుతమైన పురోగతిని సాధిస్తారు మరియు మీ గత జన్మలలో చేసిన మంచి పనుల ఫలితంగా అకస్మాత్తుగా సంపదను పొందుతారు. ఇలాంటి వ్యక్తులు జీవితంలో ప్రత్యేక గౌరవం, ప్రతిష్టను పొందుతారు.
అదృష్ట రేఖ
మీ నుదిటి మధ్యలో కింది నుండి మూడవ వరుసలో కనిపించే రేఖను అదృష్ట రేఖ అంటారు. ఈ రేఖ చిన్నగా ఉన్నప్పటికీ మీరు అదృష్టవంతులని తెలుపుతుంది. మీ జీవితంలో మంచి అవకాశాలు, అదృష్టం మీకు లభిస్తుంది. ఒకవేళ మీ నుదిటిపై మూడు స్పష్టమైన, సమాంతర రేఖలు ఉంటే మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. ఇలాంటి వ్యక్తులు జీవితంలో గొప్ప విజయాన్ని,అభివృద్ధిని సాధిస్తారు. అన్నీ కలిసి వస్తాయి, ఉన్నత స్థానాలకు చేరుకుంటారు.
సవాళ్లను సూచించే గీత
ఈ రేఖ అదృష్ట రేఖకు పైన ఉంటుంది. చాలా తక్కువ మందిలో మాత్రమే కనిపిస్తుంది. మీ నుదిటిపై ఈ రేఖ ఉంటే మీ జీవితంలో అనేక ఒడిదుడుకులు, సవాళ్లు ఎదురవుతాయని అర్థం. ముఖ్యంగా 28 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే 40 సంవత్సరాల వయస్సు తర్వాత, ఇలాంటి వ్యక్తులు గొప్ప విజయాన్ని మరియు స్థిరత్వాన్ని సాధిస్తారు.
ఆందోళన రేఖ
ఈ రేఖ మీ జుట్టు మొదలయ్యే ప్రదేశానికి దగ్గరగా ఉంటుంది. మీ నుదిటిపై ఈ రేఖ ఉంటే మీరు జీవితంలో ఎంత విజయం సాధించినా ఏదో ఒక విషయం గురించి నిరంతరం ఆందోళన చెందుతూ ఉంటారు. తరచుగా ఇలాంటి వ్యక్తులు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి పాజిటివ్ గా ఉండటానికి ప్రయత్నించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications