Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
శుక్ర రాజయోగం..3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం,ఆకస్మిక ధనలాభం
ఖగోళంలో జరిగే గ్రహాల కదలికలు మన జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని జ్యోతిష్యశాస్త్రం తెలియజేస్తుంది. ప్రతి గ్రహం తన రాశిని మార్చుకున్నప్పుడు మనషుల జాతకాల్లో శుభ,అశుభ ఫలితాలు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలో ప్రేమ, సంపద, సౌభాగ్యం, భోగాలకు కారకుడైన శుక్రుడు చేయబోయే రాశి మార్పు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. శుక్రుడు అనుగ్రం ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదు. అలాంటి శుక్రుడు ఒక అద్భుతమైన రాజయోగాన్ని తీసుకురాబోతున్నాడు.
2025 అక్టోబర్9న శుక్రగ్రహం కీలకమైన సంచారం చేయనుంది. అక్టోబర్ 9 ఉదయం 10:55 గంటలకు శుక్రుడు తన మిత్రుడు బుధుడి రాశి అయిన కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. కన్యరాశిలోకి శుక్రుడు ప్రవేశించిన తర్వాత 3 రాశుల వారికి అదృష్ట దేవత తలుపు తట్టబోతుంది..వీరి జీవితాల్లో ఊహించని సాకునూల మార్పులు వస్తాయి. ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆ 3 రాశులేవో ఇక్కడ చూడండి.

సింహ రాశి
కన్య రాశిలోకి శుక్రుడు ప్రవేశం సింహ రాశి వ్యక్తులకు అద్భుతమైన యోగాన్ని తీసుకురాబోతోంది. ఈ సంచారం మీ జాతకంలో సుఖ, సౌఖ్యాలను సూచించే నాల్గవ ఇంట్లో జరగనుంది. దీని ఫలితంగా మీరు ఇంతకాలం కోరుకుంటున్న ప్రాపంచిక సుఖాలన్నీ నెరవేరుతాయి. కొత్త ఇల్లు కొనాలనే లేదా కొత్త వాహనం సమకూర్చుకోవాలనే మీ కలలు సాకారమయ్యే బలమైన అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఆనందం, శాంతి వెల్లివిరుస్తాయి. ముఖ్యంగా, మీ తల్లితో మీ సంబంధం మరింత బలపడుతుంది, ఆమె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలలో స్థిరత్వం లభించి, మానసిక ప్రశాంతతను పొందుతారు.
కన్య రాశి
శుక్రుడు కన్య రాశిలోకి ప్రవేశిస్తున్నందున కన్య రాశి వారికి ఇది అత్యంత యోగవంతమైన కాలం. ఈ సంచారం మీ జాతకంలో అదృష్టం, భాగ్యాన్ని సూచించే తొమ్మిదవ ఇంట్లో జరగబోతోంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. అదృష్టం మిమ్మల్ని వెన్నంటి ఉంటుంది. ఆర్థికంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. గతంలో ఎదుర్కొన్న అడ్డంకులు, సమస్యలు మంచులా కరిగిపోతాయి. జీవితాన్ని ఒక సరికొత్త ఉత్సాహంతో ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ప్రమాదాలు, ఆటంకాలు తొలగిపోయి మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు, కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన కాలం. కన్యారాశి వారికి ఇది ఒక స్వర్ణయుగం అని చెప్పవచ్చు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి శుక్రుడి సంచారం ఒక సువర్ణావకాశంలాంటిది. ఈ గ్రహ మార్పు మీ జాతకంలో ఆదాయం, లాభాలను సూచించే పదకొండవ ఇంట్లో జరగబోతోంది. ఫలితంగా మీ ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది. మీరు చేస్తున్న ఉద్యోగంలో ఉన్నత పదవులు, ప్రమోషన్లు వరిస్తాయి. మీ పనికి గుర్తింపు లభించి, ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు రెట్టింపవుతాయి. నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. సామాజికంగా మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు వేసే ప్రతి ఫ్లాన్ సక్సెస్ అవుతుంది. లాటరీలు లేదా షేర్ మార్కెట్ వంటి వాటి ద్వారా ఆకస్మిక ధనలాభం పొందే బలమైన యోగం ఉంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications