Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Gold: ఈ రాశుల వాళ్లు ఒంటిమీద బంగారం పెట్టుకుంటే.. అన్నీ అశుభాలే!
బంగారం(Gold)అంటే ఇష్టం ఉండదనిది ఎవరికి చెప్పండి. ముఖ్యంగా చాలామంది మన దేశ మహిళలకి ఒంటి నిండా బంగారు నగలు ధరించాలనే ఆశ ఉంటుంది. ఆడవాళ్లకి ఎన్ని నగలు కొన్నా మళ్లీ ఇంకొకటి ఉంటే బాగుండు అనిపిస్తూనే ఉంటుంది. అంతేకాకుండా బంగారాన్ని ఓ ఇన్వెస్ట్ మెంట్ గా కూడా చూస్తారు ఎక్కువమంది. ఇంట్లో పెళ్లి లేదా ఇంకేదైనా శుభకార్యం ఉంటే బంగారం కొనుగోలు చేయాల్సిందే. సామాన్యులు కూడా ఎంతో కొంత బంగారం తమ వెంట ఉంచుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక అవసరాలు పనికొస్తుందని ఎంతో కొంత కొనుక్కుంటారు. బంగారం కూడా రోజురోజుకి ధర పెరుగుతూ సామాన్యుడికి కూడా చుక్కులు చూపిస్తుంది.
బంగారంతో చేసిన ఆభరణాలు మన అందాన్ని నాలుగు రెట్లు పెంచుతాయి. అయితే మనం చేసే చిన్న పొరపాటు ఏమిటంటే మనం ఆలోచించకుండా బంగారం కొనుగోలు చేయడం. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం కొన్ని రాశుల వారికి బంగారం ధరించడం మంచిది కాదు. అయితే బంగారం ధరించడం ఎవరికి శుభం,ఎవరికి అశుభం? జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?బంగారం ఏ గ్రహానికి సంబంధించినది? వంటి విషయాలను ఇఫ్పుడు తెలుసుకుందాం.

ప్రతి గ్రహం ఏదో ఒక రత్నానికి లేదా లోహానికి సంబంధించినది. రాగి సూర్యునికి,ఇనుముకు శని,బంగారాన్ని బృహస్పతి గ్రహానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. బంగారాన్ని ధరించడం బృహస్పతి గ్రహాన్ని బలపరుస్తుంది.. జీవితంలో సంపద,ఆనందాన్ని తెస్తుంది. అయితే రత్నశాస్త్రం ప్రకారం కొన్నిరాశుల వాళ్లు మాత్రం బంగారం ధరించడం మానుకుంటేనే మంచిదట.
ఈ రాశుల వాళ్లు బంగారం ధరించడం అశుభం
-రత్న శాస్త్రం ప్రకారం వృషభం,మిథునం,మకరం,తుల,వృశ్చికం,కుంభ రాశుల వారు బంగారం ధరించడం మానుకోవాలి.
-కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు బంగారం ధరించకూడదు. ఇది వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
-ఊబకాయం సమస్య ఉన్నవారు కూడా బంగారం ధరించకూడదు. ఎందుకంటే ఊబకాయం బృహస్పతి గ్రహానికి సంబంధించింది.
-చమురు,బొగ్గు, ఇనుము సంబంధిత పనులు చేసేవాళ్లు కూడా బంగారం ధరించడం మానుకోవాలి.
బంగారం ధరించడం వీరికి శుభప్రదం
రత్న శాస్త్రం ప్రకారం బంగారం.. మేషం,సింహం,కర్కాటకం,ధనుస్సు,మీనం లేదా లగ్న రాశిలో జన్మించిన వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశుల వాళ్లు మెడలో బంగారాన్ని ధరించినట్లయితే అది లగ్నంలో బృహస్పతి ప్రభావాన్ని చూపుతుంది. అదే సమయంలో జాతకంలో బృహస్పతి శుభప్రదంగా,ఉన్నతంగా ఉంటే బంగారం ధరించవచ్చు. బృహస్పతి స్థానం బలహీనంగా ఉన్నప్పటికీ బంగారం ధరించవచ్చు. దీన్ని ధరించడం వల్ల ఆర్థిక బలం చేకూరుతుంది.
Note: మత విశ్వాసాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. బోల్డ్ స్కై తెలుగు దీనిని ధృవీకరించలేదు. దీనిని పాటించడం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications