Latest Updates
-
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.!
ఫిబ్రవరి 2-8 వారఫలం..ఈ 4 రాశుల వారికి అదృష్టం..పట్టిందల్లా బంగారమే!
సాధారణంగా గ్రహాల కదలికలు మనుషుల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ క్రమంలో 2026 ఫిబ్రవరి మొదటి వారం కొన్ని రాశుల వారికి వరంగా మారనుంది. ఈ వారంలో రెండు ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మార్చుకోబోతున్నాయి. బుద్ధికి కారకుడైన బుధుడు ఫిబ్రవరి 3న, ఐశ్వర్య కారకుడైన శుక్రుడు ఫిబ్రవరి 6న తమ రాశులను మారుస్తున్నారు.
వారం వ్యవధిలోనే జరుగుతున్న ఈ రెండు గ్రహాల సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం వరించనుంది. ముఖ్యంగా కెరీర్ పరంగా పురోగతి, ఆర్థికంగా లాభాలు కలిగే ఆస్కారం ఉంది. ఆ అదృష్ట రాశులు ఏవో, వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ చూడండి.

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఫిబ్రవరి మొదటి వారం చాలా సానుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా చేస్తున్న కృషికి ఇప్పుడు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇది మీ కెరీర్ గ్రోత్ కు దోహదపడుతుంది. అనుకున్న పనులు సులువుగా పూర్తవుతాయి. ముఖ్యంగా ఉద్యోగ వేటలో ఉన్నవారికి ఇది గోల్డెన్ వీక్ అని చెప్పవచ్చు.
సింహ రాశి
ఈ వారం పని ప్రదేశంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మీలోని క్రియేటివిటీ,పని నైపుణ్యాలు బాస్, సహోద్యోగులను ఆశ్చర్యపరుస్తాయి. మీ ఆలోచనలు, ఐడియాలు ఆఫీసులోనే కాదు, కుటుంబంలోనూ అందరినీ ఆకట్టుకుంటాయి. ఏదైనా పనిని సాధించాలనే మీ దృఢ సంకల్పం ఈ వారం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. బుధ, శుక్రుల అనుగ్రహం వల్ల భవిష్యత్తులోనూ మీకు శుభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.
కన్య రాశి
కన్యా రాశి వారికి వృత్తిపరంగా ఈ వారం చాలా కీలకం. గణేశుడి ఆశీస్సులతో పాటు గ్రహాల అనుకూలత వల్ల మీరు కెరీర్‌లో ఒక మెట్టు పైకి ఎక్కుతారు. ఆఫీసులో మీకు కొన్ని అదనపు బాధ్యతలు లేదా కొత్త ప్రాజెక్టులు అప్పగించే అవకాశం ఉంది. ఇవే మీ టాలెంట్ ను నిరూపించుకోవడానికి సరైన వేదికలు. ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్ల రూపంలో ప్రశంసలు దక్కవచ్చు.
ధనుస్సు రాశి
ఈ వారం మీ ఆలోచనలు చాలా సానుకూలంగా ఉంటాయి. గతంలో పెండింగ్ లో పడిన పనులను ఈ వారంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. అదృష్టం మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఊహించని ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. గతంలో కెరీర్ పరంగా ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే, వాటికి ఇప్పుడు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగులకు వారు కోరుకున్న చోటుకి బదిలీ అయ్యే యోగం కూడా ఉంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications