Weekly Horoscope(సెప్టెంబర్ 22-05అక్టోబర్): ఈ వారంలో ఈ రాశుల వారు ఆర్థికంగా బలపడుతారు

Weekly Rashi Phalalu From 29 To 05 Oct 2024: మన జీవితంలో జరిగే అన్ని మంచి మరియు చెడు విషయాలు మన జాతకంలో గ్రహాల స్థానాలపై ఆధారపడి ఉంటాయి. ఆ విధంగా, గ్రహాల స్థానాల ప్రకారం మొత్తం 12 రాశుల వారికి ఈ కొత్త వారంలో రాబోయే 7 రోజులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా?

అలా అయితే, ఈ కథనాన్ని చదవడం కొనసాగించండి. ఎందుకంటే 29 సెప్టెంబర్ 2024 నుండి 05 అక్టోబర్ 2024 వరకు మేషం నుండి మీనం వరకు మొత్తం 12 రాశుల వారపు జాతకాలు క్రింద విధంగా ఉన్నాయి.

Weekly Horoscope

మేషం:
మేషరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. ఈ వారంలో కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగస్తులకు కొత్త అఫర్లు వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ మొదటి వారంలో అద్భుతంగా ఉంటుంది. ఆదాయం మరియు ఖర్చులు బ్యాలెన్స్ చేసుకోవాలి. కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది. ఆరోగ్యపరంగా ఈ వారం మిశ్రమంగా ఉంది. మీరు కుటుంబంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా పెద్దలను సలహాలను తప్పకుండా తీసుకోండి
అదృష్ట రంగు: నీలం రంగు
అదృష్ట సంఖ్య: 28
శుభ దినం: సోమవారం

వృషభం:
అక్టోబర్ మొదటి వారంలో మీరు శుభవార్తలు వింటారు. ఈ వారంలో ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి, బడ్జెట్ ను అనుసరించి ఖర్చుచేసుకోవాలి. విద్యార్థుకు మంచిగా ఉంది. ఉద్యోగస్తులు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి మార్పులు కనబడుతాయి. భాగాస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఆరోగ్యం పరంగా బాగుంది.

అదృష్ట రంగు: క్రీమ్ కలర్
అదృష్ట సంఖ్య: 8
శుభ దినం: మంగళవారం

మిథునం:
మిథున రాశి వారు ఈ వారంలో ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ పనులు మీ ప్లాన్ ప్రకారం పూర్తి చేస్తారు. మీ ప్రియమైన వారిని కలుసుకుంటారు. ఇంట్లో విలాసాలా కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. దుష్టులకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులకు మంచి ఫలితాలు పొందుతారు.

అదృష్ట రంగు: పసుపు రంగు
అదృష్ట సంఖ్య: 22
శుభ దినం: గురువారం

కర్కాటకం:
కర్కాటకరాశికి అక్టోబర్ మొదటి వారంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. కొంచెం కష్టపడితే ఆర్థికంగా స్థిరపడుతారు.చిన్న పనులకు కూడా ఆటంకాలు ఎదురవుతాయి. ఈ పరిస్థితిలో కూడా విశ్వాసాన్ని కోల్పోకండి. ఎలాంటి సమస్య అయినా పరిష్కరించబడుతుంది. మీ అనుభవంతో సమస్యలను సులభంగా బయటపడుతారు. ఆదాయంను బట్టి ఖర్చు చేయండి. బయట ఆహారాలను తినడం మానుకోవాలి. లేదాంటి పొట్ట సమస్యలు వస్తాయి.
అదృష్ట రంగు: ఎరుపు రంగు
అదృష్ట సంఖ్య: 4
శుభ దినం: ఆదివారం

సింహ రాశి :
సింహరాశి వారికి అక్టోబర్ మొదటి వారం మంచిగా ఉంది. వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు. కొత్త ఆర్డర్లు పొందుతారు. వాటి ద్వారా మీరు ఆశించిన లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులు న్యాకత్వం లక్షణాలు నిర్ణయాలతో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.ఈ వారంలో పనిలో విజయం సాధిస్తారు. మంచి సంకేతాలు సూచిస్తున్నాయి. మీ ప్రియతముల నుండి మద్దతు పొందుతారు. జీవిత భాగస్వామితో వివాదాలు ఉండవచ్చు. ఆరోగ్యపరంగా బాగుంటుంది. కుటుంబంలో సమస్యలను పరిష్కరిస్తారు
అదృష్ట రంగు: గులాబీరంగు
అదృష్ట సంఖ్య: 31
శుభ దినం: శుక్రవారం

కన్య :
తల్లిదండ్రులకు మీ మీద నమ్మకంతో మరి మరింత ముందుకు సాగుతారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఈ వారంలో పనిలో చాలా బిజీగా గడుపుతారు. ఈ వారంలో మరికొన్ని కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. దాంతో మీరు ప్లాన్ ప్రకారం మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ కష్ట సమయంలో మీ ప్రియమైన వారిని నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఆరోగ్య పరంగా నిర్లక్ష్యం వద్దు.
అదృష్ట రంగు: స్కై బ్లూ
అదృష్ట సంఖ్య: 16
శుభ దినం: బుధవారం

తులారాశి:
ఇంట్లో శుభకార్యంతో ఇల్లంతా ఆహ్లాదకారంగా ఉంటుంది. అవివాహితులకు వివాహిత ప్రతిపాధనలు వస్తాయి. సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఇదే మంచి సమయం. కొత్త జీవితానికి పునాది . అలాగే ఈ వారం ఆర్థికపరంగా బలంగా ఉంటారు. అయితే ఆర్థిక విషయాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల నుండి సలహాలు సూచనలు పొందుతారు. ఆస్థికి సంబంధించిన కోర్టు కేసుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. రోజూ యోగ మరియు ధ్యానం చేస్తే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది
అదృష్ట రంగు: ఆకుపచ్చ రంగు
అదృష్ట సంఖ్య: 39
శుభ దినం: సోమవారం

వృశ్చికం :

వృశ్చిక రాశి వారికి ఈ వారం వ్యాపారస్తులకు మెరుగ్గా ఉంటుంది. మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. దాంతో ఈ వారమంతా పనిలో నిమగ్నమైపోతారు. మీ పనులన్నింటి, బాధ్యతగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు ఈ వారం చాలా బాగుంది. వ్యాపారస్తులు వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో తొందరి పడి ఎలాంటి నిర్ణాయలు తీసుకోకండి. ముఖ్యంగా అనవసరమైన వాటికి అనవసరంగా ఖర్చు చేయాకూడదని నిర్ణయించుకోండి. ఆరోగ్య పరంగా బలహీనంగా ఉంటారు. ఆహారపు అలవాట్లలో అజాగ్రత వద్దు.
అదృష్ట రంగు: నారింజ కలర్
అదృష్ట సంఖ్య: 7
శుభ దినం: గురువారం

ధనుస్సు :
ఈ వారంలో మీ తండ్రి ఆరోగ్యం ఆందోళ కలిగిస్తుంది. ఉద్యోగస్తుల ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనే మీ కోరిక నెరవేరుతుంది. వ్యాపారస్తులు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది.
ఆరోగ్యం అకస్మాత్ గా క్షీణిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఆస్తికి సంబంధించిన కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
అదృష్ట రంగు: తెలుపు రంగు
అదృష్ట సంఖ్య: 21
శుభ దినం: శుక్రవారం

మకరం: ఈ వారం మీరు చాలా ఓపికగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, అయితే మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. వ్యక్తిగత లేదా వృత్తిపరమైన జీవితం అయినా, మీరు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో చాలా నిరాశ చెందవచ్చు. కుటుంబ సభ్యుల అసభ్య ప్రవర్తన మీకు నచ్చకపోవచ్చు. మీ తండ్రితో సంబంధం క్షీణించవచ్చు. భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీరు పనిలో చాలా బిజీగా ఉంటారు. ఈ కాలంలో, మీరు పనికి సంబంధించిన అనేక ప్రయాణాలను చేపట్టవలసి ఉంటుంది. మీ రహస్య శత్రువులు మీపై కుట్ర చేయవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. పని ఒత్తిడి తగ్గించుకోండి.
అదృష్ట రంగు: పసుపు రంగు
అదృష్ట సంఖ్య: 2
శుభ దినం: గురువారం

కుంభం:
కుంభ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది. దాంతో ఖర్చు చేయడంలో వెనకాడరు. పాత బకాయిలను తీరుస్తారు. దాంతో ఒత్తిడి లేకుండా జీవిస్తారు. వ్యాపారంలో నిలిచిపోయిన ఒప్పందాలు తిరిగి ఖరారు చేస్తారు. వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించాలనే మీ ప్రయత్నం ఫలిస్తుంది. ఈ వారం పనిపరంగా మంచి సంకేతాలను సూచిస్తోంది. విద్యార్థులకు ఉన్నవిధ్యకోసం విదేశాలకు వెళ్ళాలనే మీ ప్రయత్నం ఫలిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
అదృష్ట రంగు: పింక్ కలర్
అదృష్ట సంఖ్య: 17
శుభ దినం: సోమవారం

మీనం:
ఈ వారం మీన రాశి వారికి వ్యాపారంలో లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు సకాలంలో పనులు పూర్తి చేస్తారు. సహోద్యోగులు మరియు పై అధికారుల మద్ధతు పొందుతారు. ఆర్థికంగా పెద్ద ప్రయోజనాలను పొందుతారు. కొంత మంది పెద్ద మనుష్యులను కలుసుకుంటారు. వారి ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. భవిష్యత్తులో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో మీకు ఇష్టమైన ప్రదేశానికి ప్లాన్ చేస్తారు. పిల్లలకు సంబంధించి ఆందోళల నుండి ఉపశమనం పొందుతారు
అదృష్ట రంగు: క్రీమ్ కలర్
అదృష్ట సంఖ్య: 24
శుభ దినం: శనివారం

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Desktop Bottom Promotion