Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
Weekly Horoscope: ఈ వారం ఈ 2 రాశుల వారికి అన్ని కష్టాలే.. ఆ రాశులు వారు అనువన్నీ పూర్తి చేస్తారు!
మన జీవితంలో జరిగే అన్ని మంచి చెడు విషయాలు మన గ్రహాల స్థితులపై ఆధారపడి ఉంటాయి. గ్రహాల స్థానాలు రాశుల అధిపతులు, వాటి సంచార బలాల ఆధారంగా మన జీవితంలో విషయాలు జరుగుతుంటాయని జోతిష్య శస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వారం ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండనున్నాయి? ఏ రాశి వారి జాతకం ఈ వారం బాగుంటుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేష
ఈ రాశి వారికి తమ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అన్ని రంగాల్లోని వ్యక్తులు తమ తమ రంగాల్లో రాణించి మంచి విజయాలను సాధిస్తారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబంలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలు తొలిగిపోతాయి. ఇంటికి పలువురు అతిథులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.

వృషభం
ఈ రాశివారు వారం మంచి ఫలితాలు పొందాలంటే కస్టపడి పని చేయాల్సి ఉంటుంది. వృషభ రాశికి చెందిన జాతకులు ఈ వారం కొంత గందరగోళంగా ఉంటారు. కుటుంబంలో విభేదాలు పెరిగే అవకాశం ఉంది. ఈ వారం ఈ రాశి వారు తమ ప్రవర్తనను, తమ మాటలను నియంత్రిచుకోవాలి. లేకపోతే సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది.
మిథున
ఈ వారం మిథున రాశి జాతకుల జీవితం సమస్యలతో నిండి ఉంటుంది. ప్రతి పనిని బాగా అర్థం చేసుకోండి. లేదంటే భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఈ వారం మీ అజాగ్రత్త వలన పెద్ద నష్టం జరగవచ్చు. ఉద్యోగ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. అనవసరమైన వివాదాల్లో తలదూర్చవద్దు. ఆస్తి విషయాల్లో ఇంట్లోని వ్యక్తులకు భేదాభిప్రాయాలు నెలకొంటాయి.
కర్కాటక:
ఈ రాశివారు ఈ వారం మీరు కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. ఉద్యోగస్తులు తమ తమ ఆఫీసులో సమస్యలను ఎదుర్కోవచ్చు. కొన్ని ఉద్యోగాలు మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. చెడు సమయంలో మీ కుటుంబ సభ్యులు మీకు అండగా ఉంటారు. జీవిత భాగస్వామి, పిల్లల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది.
సింహ
ఈ రాశివారు ఈ వారం కుటుంబంతో కలిసి విహారయాత్రలను ప్లాన్ చేసుకోవచ్చు. పిల్లల చదువుల కోసం మీరు ఈ వారం మీ ఇంటిని మార్చే అవకాశం ఉంది. ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగులు మరియు వ్యాపారులు ఈ వారం శత్రువుల నుండి కొంత సురక్షితంగా ఉండటం మంచిది.
కన్య
కన్యారాశి వారు ఈ వారం కొంత గందరగోళానికి గురవుతారు. పనిలో సహోద్యోగులు మిమ్మల్ని నిర్లక్ష్యం చేయవచ్చు. ఫలితంగా, మీరు పనిలో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్ట్‌లలో పాల్గొనలేకపోవచ్చు. మీరు కొన్ని విషయాల గురించి చాలా ఆందోళన చెందుతారు. ఆస్తి సంబంధిత సమస్యలు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.
తుల
ఈ రాశివారు ఈ వారం శుభవార్త అందుకుంటారు. మీకు ఇప్పటి వరకు డబ్బు సమస్యలు ఉంటే ఈ వారం ఆ సమస్య నుండి బయటపడతారు. స్నేహితుల సహాయంతో మీరు కొత్త ఉద్యోగానికి మారతారు. అలాగే దానిలో మంచి విజయాన్ని పొందుతారు. ఈ వారం మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. దీని ద్వారా మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
వృశ్చిక
ఈ రాశి వారు ఈ వారం మీ ప్రవర్తనలో పెద్ద మార్పుతో మీ శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. రాజకీయాల్లో ఉన్నవారు మంచి విజయాలు సాధిస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు పదోన్నతులు పొందవచ్చు. మీరు ఈ వారంలో ఎవరినైనా ప్రత్యేకంగా కలుసుకునే అవకాశం ఉంది.
ధనుస్సు
ఈ రాశి వారు ఈ వారం కుటుంబంలో సమస్యలను ఎదుర్కొంటారు. తల్లిదండ్రులు మరియు జీవిత భాగస్వామి మధ్య తగాదాలు పెరగవచ్చు. మీరు మానసికంగా చాలా ఆందోళనలకు గురవుతారు. కుటుంబ జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.
మకర
ఈ రాశి వారు ఈ వారం చాలా సంతోషంగా ఉంటారు. పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక మద్దతు కారణంగా ఈ వారం ఆర్థిక స్థితి బాగుంటుంది. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి మరియు పిల్లల పూర్తి మద్దతు లభిస్తుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది.
కుంభ
ఈ రాశి వారు ఈరోజు అతిపెద్ద సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. అలాగే ఆ విషయమై కోర్టుకు కూడా వెళ్లే అవకాశం రావచ్చు. అనవసరమైన మాటలను నియంత్రణలో పెట్టుకోవాలి. ఎలాంటి వివాదాల్లో తలదూర్చకుండా ఉండాలి. కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి.
మీన
ఈ రాశి వారికి ఈ వారం బాగానే ఉంటుంది. అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఉద్యోగస్తులకు కొత్త ప్రయోజనాలు లభిస్తాయి. కార్యాలయంలో మీ ప్రవర్తన పట్ల ఉన్నతాధికారులు సంతోషిస్తారు మరియు ప్రమోషన్ మరియు జీతం పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో మీ విలువ, గౌరవం పెరుగుతుంది. అలాగే, ఈ వారం మీరు కొన్ని పెద్ద కుటుంబ సమస్యల నుండి బయటపడతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











