Latest Updates
-
చెట్టినాడ్ శనగ కుర్మా..చపాతీతో తింటుంటే కిక్కే కిక్కు! -
రక్తహీనతకు చెక్,చర్మానికి గ్లో..పోషకాల గని బీట్ రూట్ తో కమ్మని హల్వా చేసుకోండిలా.. -
రోజుకు ఒక స్పూన్ పీనట్ బటర్ తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
స్పైసీ, క్రంచీ చికెన్ మిక్చర్..ఆహా ఏమి రుచి అనాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మీ ప్రియమైనవారు మిమ్మల్ని అవమానించారా? ఈ ట్రిక్ పాటిస్తే అవమానించినోళ్లే నోరు మూసుకొని పోతారు! -
తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం హరిది..అమృతంలా ఉంటుంది..ఇలా సింపుల్ గా చేసేయండి -
క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై..ఈ స్పెషల్ మసాలాతో చేస్తే ప్లేట్ మొత్తం క్షణాల్లో ఖాళీ! -
సర్వ పాపాలను తొలిగించే తొలి ఏకాదశి.. మీ కుటుంబ సభ్యులకు ఈ మెసేజ్ లతో విషెస్ చెప్పండి -
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.!
జులై చివరి వారం.. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే.!
జ్యోతిష్యపరంగా జులై చివరి వారం చాలా ముఖ్యమైనది. గ్రహాలకు అధిపతి అయిన బుధ గ్రహం తిరోగమనం నుంచి ప్రత్యక్ష సంచారం చేయడం, శని వక్రగతిలో ఉండటం, సూర్య- గురు గ్రహాల సంయోగంతో ఈ వారం అనేక రాశుల వారికి కలిసివస్తుంది. గ్రహాల స్థానాల మార్పు, యోగాలు.. వృత్తి, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, వ్యాపారం, ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్ని గ్రహాల వారికి కలిసి వస్తుండగా.. మరికొన్ని గ్రహాల వారికి సాధారణంగా ఉండవచ్చు. మరి ఈ వారం రాశి ఫలాలు చూద్దాం..

మేష రాశి
మేష రాశి వారికి ఈ వారం అడ్డంకులన్నీ తొలగి కోరుకున్న విజయాన్ని అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. భూమి, ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ప్రజాదరణ, మద్దతు పొందుతారు. సామాజిక సేవలో గౌరవం లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. టూర్లకి వెళ్లే అవకాశం ఉంది. పెండింగ్ పనులు పూర్తి కావచ్చు. విద్యార్థులకు ఇది అనుకూల సమయం. ప్రేమ, వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ప్రతి రోజూ దుర్గాదేవికి ఎర్రటి పువ్వులను సమర్పించి పారాయణం చేస్తూ పూజ చేస్తే సత్ఫలితాలు ఉంటాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారు ఈ వారం మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి. ప్రతీ చిన్న విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ వెనుకే ఉండి మీ కీడు కోరుకునే శత్రువుల పట్ల జాగ్రత్త వహించాలి. ఫలితంగా కుటుంబంలో కలహాలు రావచ్చు. ఆందోళనలు ఉండవచ్చు. సంభాషణలో ఆచీతూచీ మాట్లాడాలి. వ్యాపారావేత్తలకు ఈ వారం లాభాలు అందుకునే అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో ఇబ్బందులు పడవచ్చు. విద్యార్థులు ఏకాగ్రత లోపం కారణంగా ఆశించిన ఫలితం సాధించలేకపోవచ్చు. ప్రేమ జీవితంలో అపార్థాలు చోటుచేసుకుంటాయి. పరిహారం కోసం రోజూ ఇంట్లో చేసిన మొదటి రొట్టెను ఆవుకు తినిపించి శ్రీయంత్రాన్ని పూజించడం శ్రేయస్కరం.
మిథునం
మిథున రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వృత్తిపరంగా కష్టాలు తొలగిపోతాయి. ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. ట్రాన్స్‌ఫర్ విషయానికి సంబంధించి మీరు కోరుకున్నవి జరగవచ్చు. వ్యాపారం రంగంలో రాణిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్తగా పెళ్లైన జంటలకు ఈ వారం సంతోషాన్ని ఇస్తుంది. ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే అవకాశం ఉంది. ప్రేమ, వైవాహిక జీవితం బాగుంటుంది. స్నేహితులు, శ్రేయోభిలాషులతో సంతోషంగా గడుపుతారు. విష్ణు పూజ, పారాయణం ద్వారా ఆధ్యాత్మికంగా మేలు చేకూరుతుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రయోనకరంగా ఉండవచ్చు. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఇంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొత్త ప్రాజెక్టులు, ప్రణాళికల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. ఇందుకోసం సరైన సమయం కోసం వేచి ఉండాలి. విద్యార్థులు చదువులో మరింతగా కష్టపడాలి. ఈ వారి పెద్దల, శ్రేయోభిలాషుల సలహాలను నిర్లక్ష్యం చేయకూడదు. వైవాహిక, ప్రేమ జీవితానికి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రతిరోజూ శివలింగాన్ని పూజిస్తూ శివమహిమ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పరిహారం పొందవచ్చు.
సింహరాశి
సింహ రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. శుభవార్త అందుకుంటారు. మానసిక ఆందోళనలు తగ్గుతాయి. ఉద్యోగంలో ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. కుటుంబీకుల నుంచి ఆప్యాయత, మద్దతు అందుకుంటారు. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది సరైన సమయం కావచ్చు. ప్రతిరోజూ సూర్య భగవానుడికి జలాభిషేకం చేసి, సూర్యాష్టకాన్ని పఠించడం ప్రయోజనకరంగా ఉంటుంది.
కన్యా రాశి
ఈ వారం కన్యా రాశి వారు ఒడుదొడుకులు ఎదుర్కొంటారు. వృత్తి, వ్యాపార రంగాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆవేశం, తొందరపాటులో నిర్ణయాలు తీసుకోకండి. ఇంటి పనులకి సంబంధించి డబ్బు ఖర్చు కావచ్చు. కనబడని శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకుని సహనంగా ఉంటేనే పనులు పూర్తవుతాయి. కుటుంబంలో మనశ్శాంతి కోల్పోవచ్చు. మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రతి రోజూ గణేశుడి పూజ చేసి గణపతి మంత్రాలను పఠించండి.
తులారాశి
తులారాశి వారికి ఈ వారం ఆనందం, అదృష్టం కొంత తగ్గుతాయి. దీంతో అనుకున్న పనులు ఆలస్యం అవుతాయి. సత్ఫలితం కోసం ఎక్కువగా కష్టపడాలి. సుదూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆస్తి సంబంధిత సమస్యలు, కుటుంబ కలహాలతో ఆందోళనగా ఉంటారి. అనవసరమైన విషయాలకు దూరంగా ఉంటూ లక్ష్యంపై దృష్టి సారించండి. ఉద్యోగ రంగంలో మహిళలు సవాళ్లను ఎదుర్కొంటారు. వృత్తి, కుటుంబాన్ని సమతుల్యం చేసుకోవాలి. సమయ నిర్వహణ ముఖ్యం. దినచర్య సరిగా ఉండేలా చూసుకోవాలి. వ్యాపారవేత్తలు అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ, వైవాహిక జీవితంలో అహంకారం పనికి రాదు. స్ఫటిక శివలింగాన్ని పూజిస్తూ శివ నామ పారాయణం చేయండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఇది అనుకూలమైన సమయం. రాజకీయం రంగంలో ఉన్నవారికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. వ్యాపార రంగంలో నష్టాల నుంచి తేరుకోవడానికి స్వదేశీ, విదేశాల నుంచి మద్దతు, సహకారం అందుకుంటారు. ఉద్యోగ రంగంలో కోరుకున్న చోటుకి బదిలీ కావచ్చు. పనిలో ఇబ్బందులు తొలగిపోతాయి. ఊహించని ఆర్థిక లాభాలు అందుకుంటారు. మేధావులతో సంభాషణ కారణంగా సమాజంలో హోదా పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రతిరోజూ హనుమంతుడిని పూజిస్తూ ఏడుసార్లు చాలీసా పఠించడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయి.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగంలో ఉపశమనం లభించినా కుటుంబ విషయాల్లో ఆందోళన ఎదుర్కొంటారు. సంభాషణలో జాగ్రత్తగా ఉండాలి. కాంట్రాక్టు విధానంలో పనిచేసే వారు శుభవార్త అందుతుంది. పెండింగ్ నిధులు అందుతాయి. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ప్రేమ, వైవాహిక జీవితంలో పలు ఇబ్బందులు పడవచ్చు. పరిహారం కోసం శ్రీ విష్ణుమూర్తిని పూజిస్తూ నారాయణ మంత్రం పఠించండి.
మకర రాశి
మకర రాశి వారికి ఈ వారం ఒడుదొడుకులతో కొనసాగుతుంది. పనిలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతికూల ఆలోచనలు కలుగజేసే వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఆర్థిక, ఆరోగ్య, సంబంధాల పట్ల శ్రద్ధగా ఉండాలి. వ్యాపార భాగస్వాములతో ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులు సంభాషణలో ఆచీతూచీ వ్యవహరించండి. వ్యసనాలను వదిలేయండి. వైవాహిక జీవితంలో భాగస్వామి భావాలను గౌరవిస్తూ సంతోషంగా ఉండండి. పరిహారం కోసం శివునికి ప్రతిరోజూ బిల్వపత్రం లేదా శమీపత్రాన్ని సమర్పించి పూజిస్తూ రుద్రాష్టకం పఠించండి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ వారం సవాళ్లతో ఉండవచ్చు. రాజీ పడటం, ముందుకు సాగడం తప్పనిసరి. చేసే పనులను సమీక్షించుకుంటూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పనిలో ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. పెండింగ్ పనుల నిర్వహణలో ఆర్థికంగా తెలివిగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో ఆడంబరాలు పనికిరాదు. హనుమంతుడిని పూజిస్తూ హనుమాన్ చాలీసా పఠించండి.
మీన రాశి
ఈ వారం మీన రాశి సోమరితనం, అహంకారానికి వీలైనంతగా దూరంగా ఉండాలి. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగంలో సహోద్యోగులతో అనవసరమైన గొడవలకి దూరంగా ఉండాలి. సన్నిహితుల సలహాలను పాటించడం ప్రయోజనకరంగా ఉంటుంది. తీర్థయాత్రలు, మతపరమైన కార్యకలాపాలు చేస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ వారం ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. చెడు వ్యక్తులకు దూరంగా ఉండి లక్ష్యాల వైపు దృష్టి సారించాలి. ప్రేమ వ్యవహారాల్లో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోండి. పరిహారం కోసం తులసీ పూజ చేస్తూ నారాయణ మంత్రం పఠించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications