Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
ఈ వారం ఈ ఆరు రాశుల వారికి మంచి.. ఈ ఆరు రాశుల వారికి చెడు జరగనుంది! అందులో మీ రాశి కూడా ఉందా?
మన జీవితంలో జరిగే అన్ని మంచి, చెడు విషయాలు మన జాతకంలో గ్రహాల స్థానాలపై ఆధారపడి ఉంటుంది. గ్రహాల స్థానాల ప్రకారం మొత్తం 12 రాశులకు రాబోయే 7 రోజులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ స్టోరీలు మేము జనవరి 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జాతకులు ఎలా ఉన్నాయో వివరించాము. పూర్తిగా చదవండి.
మేష రాశి
మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు ఆరోగ్యంపై ద్రుష్టి సారించాలి. వ్యాపారంలో ఉన్న వ్యక్తులకు మంచి ఫలితాలు వస్తాయి. వారం ప్రారంభంలో కొంత ఆర్ధిక ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్ధిక కష్టాల కారణంగా కొంచం ఆర్ధిక ఒడిదుడుకులను ఎదుర్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నిర్ణయాలు ఆచితూచి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.

వృషభం
వృషభ రాశి వారికి ఈవారం ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. వారం ప్రారంభంలో వ్యాపారంలో హెచ్చు తగ్గులు కనిపిస్తాయి. తరువాత పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రయాణాలలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఖర్చులు ఎక్కువగా అయ్యే సూచనలు కైంపిస్తున్నాయి.
మిధున రాశి
మిథున రాశి వారికి ఈవారం ఆరోగ్యం చాలా బాగుంటుంది. వ్యాపారం కూడా బాగుంటుంది. వారం మధ్యలో కొత్త వ్యాపారాలు ప్రారంభించవద్దు. వారం చివరి నాటికి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఈ రాశి వారు ఒక శుభవార్త అందుకుంటారు. కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. ఇతరులకు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ వారం అంతగా బాగుండదు. ఈ వారం మీకు మీ జీవిత భాగస్వామి మద్దతు లభించదు. అనుకోకుండా కొన్ని సమస్యల్లో మీరు చిక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారం మధ్యలో అవమానాలు ఎదుర్కోవచ్చు. వృత్తిపరంగా మంచి విజయాన్ని అందుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ వారం ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారం కూడా బాగుంటుంది. ఉద్యోగార్ధులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. కోరికలు పెరుగుతాయి. దీని వలన మీరు కలత చెందుతారు. జీవిత భాగస్వామితో కలహాలు రావచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ వారం పనిలో రిస్క్ తీసుకోకండి.
కన్య
కన్యా రాశి వారికి ఈ వారం వ్యాపారం బాగుంటుంది. మీరు శత్రువులతో సమర్థవంతంగా వ్యవహరిస్తారు. వారం ప్రారంభంలో మీ పనిలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొన్నప్పటికీ, మీరు దానిని విజయవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ వారం కాస్త కష్టంగా ఉంటుంది.
తులా రాశి
తులా రాశి వారికి ఈ వారం మానసిక స్థితి సరిగ్గా ఉండదు. కొంత గందరగోళానికి లోనవుతారు. మీరు ప్రేమలో ఉంటే, మీరు మీ భాగస్వామితో గొడవ పడవచ్చు. ఈ వారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. సమస్యలు అలాగే ఉన్నాయి. ఆరోగ్యం మిశ్రమంగానే ఉంటుంది. పని చేసే వారికి పురోగతి ఉంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో సంతోషం తగ్గుతుంది. వాహనాలు పాడైపోయి భారీ ఖర్చులు తప్పవు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. జీవిత భాగస్వామితో తగాదాలకు దూరంగా ఉండాలి. కుటుంబ పెద్దల పూర్తి ఆశీస్సులు మీకు లభిస్తాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ వారం అదృష్టంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. అయితే కొత్త ఉద్యోగాలలో చేరవద్దు. ప్రియమైన వారితో కలహాలు ఉండవచ్చు. భూమి, ఇల్లు, వాహనం కొనుగోలులో ఇబ్బంది ఉంటుంది. తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది. మానసికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకండి.
మకర రాశి
మకర రాశి వారి వ్యాపారులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. డబ్బు అనేక విధాలుగా వస్తుంది. కుటుంబ జీవితంలో మానసిక ప్రశాంతత ఉంటుంది. ముక్కు, గొంతు మరియు చెవి సమస్యలను ఎదుర్కొంటారు. గృహ, వాహన కొనుగోలు యోగం కనిపిస్తుంది.
కుంభ రాశి
కుంభ రాశికి చెందిన వ్యక్తులు ఈ వారం పూర్తి అదృష్టవంతులుగా మారుతారు. వ్యాపారం కూడా పుంజుకుంటుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉండాలంటే అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. పెట్టుబడులు పెట్టడం మానుకోండి. అలా చేస్తే వ్యాపారంలో విజయావకాశాలు ఉంటాయి.
మీన రాశి
మీన రాశికి చెందిన వారు ఈ వారం ఆరోగ్య సమస్యలు ఎదుర్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమికుల మధ్య విబేధాలు రావచ్చు. వ్యాపారులు కూడా ఆర్ధిక అనిశ్చితిని ఎదుర్కునే సూచనలు కనిపిస్తున్నాయి. పిల్లలకు కూడా విభేదాలు ఉండవచ్చు. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications