Numerology ప్రకారం ఈ వారంలో పుట్టిన వారి సంఖ్య 4 ఐతే, ఈ వారం మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది

జ్యోతిష్యం వలె, న్యూమరాలజీ కూడా ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు, స్వభావం మరియు వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది. ప్రతి పేరు ప్రకారం రాశిచక్రం ఉన్నట్లే, అదే విధంగా ప్రతి పుట్టిన తేదీకి న్యూమరాలజీలో సంఖ్యలు ఉన్నాయి, ఈ సంఖ్యను బట్టి మీరు న్యూమరాలజీ సంఖ్య ఏమిటో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీ పుట్టిన సంఖ్య 15 అయితే మీ పుట్టిన సంఖ్య 13 అయితే (1+3=4, 4+0=4) సంఖ్యాపరంగా జూలై నెలలో మూడ వారంలో మీ జన్మ సంఖ్య ఆధారంగా, ఈ వారం ఎలా ఉంటుందో, ఏ రోజు ఎవరికి అదృష్టమో, ఎవరికి ఆర్థిక లాభమో, నష్టమో ఈ వారం వారపు న్యూమరాలజీలో చూడండి.

న్యూమరాలజీ లెక్కల ప్రకారం, ఈ వారం 21 నుండి 27 జూలై వరకు ఉన్న వారందరికీ ఎలా ఉంటుంది. పుట్టిన తేదీ ఆధారంగా 1వ సంఖ్య నుండి 9వ సంఖ్య వరకు స్థానికులందరికీ ఈ వారం ఎలా ఉంటుందనే వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Weekly Numerology Prediction

సంఖ్య 1 (పుట్టిన తేదీ 1,10,19,28)

ప్రేమ జీవితంలో మార్పులు వస్తాయి. మీ భాగస్వామితో రొమాంటిక్ గా గడుపుతారు. వివాహితులకు ఈ వారం ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. పనిలో బిజీగా ఉండటం వల్ల, మీ జీవిత భాగస్వామి మీకు ఎక్కువ సమయం ఇవ్వలేరు. కెరీర్‌కు పరంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకండి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు మంచి విజయాన్ని పొందుతారు. ఈ వారం ఆరోగ్యం బాగుటుంది

సంఖ్య 2 (పుట్టిన తేదీ 2,11,20,29)
మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి ఈ వారం చాలా బాగుంది. వ్యాపారం ప్రారంభంలో సమస్యలు కొనసాగుతాయి, కానీ క్రమంగా పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ సమయంలో పెండింగ్‌లో ఉన్న ఏదైనా పనిని పూర్తి చేస్తారు. మీరు ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. కెరీర్ సంబంధిత సమస్యలు పరిష్కరించబడతాయి మరియు మీరు మీ పనిపై సరిగ్గా దృష్టి పెట్టాలి, అప్పుడే ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు బాగా ఉంటాయి. మీరు మీ జీవిత భాగస్వామి నుండి ఒక ఆశ్చర్యం కలిగించే విషయం వింటారు. ఆరోగ్యం బాగుంటుంది.

సంఖ్య 3 (పుట్టిన తేదీ 3,12,21,30)
డబ్బు గురించి ఆందోళనలు ఉంటాయి. మీ ఆధాయం కంటే అప్పులు ఎక్కువగా ఉండటం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటారు . మీరు పని ఒత్తిడిని అనుభవిస్తారు. మీరు చిన్న విరామం తీసుకుంటే మంచిది. దాంతో మీరు రిఫ్రెష్‌ అవుతారు. పనితో పాటు మీ ఆరోగ్యం కూడా ముఖ్యం, మీరు దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కష్టసమయాల్లో మీ ప్రియమైనవారి నుండి మద్దతు పొందుతారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. విద్యార్థుల చదువులో కొంత ఆటంకాలు ఏర్పడవచ్చు. మీరు ఓపిక పట్టాలి.

సంఖ్య 4(పుట్టిన తేదీ 4,13,22,31)

మీ అదృష్టం బలంగా ఉంటుంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు . ఈ వారంలో మీ పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుతారు.వ్యాపారులకు ఎప్పటి నుండి రావాల్సిన బాకాయిలు వస్తాయి. ఈ వారంలో మీరు కొంతమంది కొత్త మరియు పెద్ద పెద్ద వ్యక్తులను కలుసుకుంటారు.దీని వల్ల మీకు భవిష్యత్ లో ప్రయోజనం ఉంటుంది. ఇంట్లో కొన్ని శుభ కార్యాలు జరుగుతాయి. ఈ సమయాన్ని కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వారం చివరిలో ఆర్థిక లాభం కోసం గట్టిగాప్రయత్నం చేస్తారు.

సంఖ్య 5 (పుట్టిన తేదీ 5,14,23)

వ్యాపారులకు ఈ వారం కొంత కష్టంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న వ్యాపార విషయాలను పరిష్కరించడానికి తెలివిగా వ్యవహారించాలి. జీవితం అందంగా కొనసాగుతుంది. మీరు వివాహం చేసుకున్నట్లయితే, మీ వైవాహిక జీవితంపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి. మీ జీవిత భాగస్వామితో కొంత సమయం గడపండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును సరిగ్గా ఉపయోగించుకోండి. ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టడం మీకు లాభదాయకంగా ఉంటుంది.

సంఖ్య 6 (పుట్టిన తేదీ 6,15,24)

మీరు మీ కార్యాలయంలో గొప్ప విజయాన్ని పొందుతారు మరియు మీ గౌరవం పెరుగుతుంది. ఇదంతా మీ కష్టానికి తగిన ఫలితం వల్ల వస్తుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. కుటుంబంలో సంతోషంగా ఉంటుంది. మీరు డబ్బు విషయంలో చాలా అదృష్టవంతులు అవుతారు. కొత్త ఆదాయ వనరుగా మారే అవకాశం ఉంది. మీరు కొన్ని విలువైన వస్తువులు కొంటారు.మానసిక ప్రశాంతత కోసం చిన్న వివాహర యాత్రకు వెళితే మంచిది. ఇది మీకు మానసికంగా మెరుగ్గా ఉంటుంది.

సంఖ్య 7 (పుట్టిన తేదీ 7,16,25)

ప్రతికూల పరిస్థితుల్లో ఓపిక పట్టాలి. తొందరపాటుతో తీసుకున్న మీ నిర్ణయం మీ సమస్యలను పెంచుతుంది. డబ్బు పరంగా ఈ సమయం మీకు మంచిది కాదు. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నట్లయితే, మీరు మరికొంత కాలం వేచి ఉండాలి. పని పట్ల నిర్లక్ష్యం వల్ల మీ సమస్యలను పెంచుతుంది. మీ అసంపూర్ణ పని వల్ల ఒత్తిడి ఆందోళన పెరుగుతుంది.ఇది మీ మానసిక ప్రవర్తనపై కూడా ప్రభావం చూపుతుంది. మీరు చాలా చిరాకుగా ఉంటారు, ఇది మీ కుటుంబ సభ్యులలో ఆందోళన కలిగిస్తుంది.

సంఖ్య 8 (పుట్టిన తేదీ 8,17,26)

ఉద్యోగస్తులకు ఈ వారం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు పెద్ద ప్రాజెక్ట్‌లో పని చేసే అవకాశాన్ని పొందుతారు. మీ పనిని మెరుగుపరచడానికి కష్టపడి పని చేస్తారు. ప్రేమ జంటలకు ఈ సమయం కొంత సవాలుగా ఉంటుంది. మీ మధ్య అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. అనవసరమైన మాటలతో మీ మద్య దూరం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇతరుల సలహా మేరకు డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.

సంఖ్య 9 (పుట్టిన తేదీ 9,18,27)

మీరు చాలా ఒంటరిగా ఫీలవుతారు మరియు ఏకాంతంగా జీవించడానికి ఇష్టపడతారు. ఏదైనా సమస్య ఉంటే మీ ప్రియమైన వారితో ఓపెన్‌గా మాట్లాడండి. మౌనంగా ఉండడం వల్ల మీ సమస్యలు మరింత పెరుగుతాయి. పనికి సంబంధించిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీరు కొన్ని శుభవార్తలను వింటారు. ఈ వారం డబ్బు పరంగా ఖర్చులు పెరుగుతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ప్రేమ బంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు మీ విశ్వాసం బలపడుతుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Sunday, July 21, 2024, 22:26 [IST]
Desktop Bottom Promotion