Latest Updates
-
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే..
వార ఫలాలు: సోమ-ఆది 29-05 ఏప్రిల్-మే 2013

వృషభం - పనివారల నిర్లక్ష్యం ఇబ్బందులకు దారితీస్తుంది. ఏ పని సవ్యంగా సాగక అశాంతికి లోనవుతారు. మీ సమర్థతపై నమ్మకం సడలుతుంది. ఈ సమస్యలు, ఆటంకాలు తాత్కాలికమేనని గమనించండి. త్వరలోనే ఆశాజనకమైన మార్పులు చూస్తారు. వివాహ నిశ్చితార్ధాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఆచితూచి వ్యవహరించాలి.
మిథునం - ఒక శుభకార్యానికి హాజరు కావాలనే ఆలోచన బలీయమవుతుంది. ప్రముఖుల సహకారంతో కొన్ని వ్యవహారాలు సానుకూలమవుతాయి. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మిమ్ములను పొగిడే వారి ఆంతర్యం గ్రహించండి. చెక్కులు చెల్లుబాటు కాక ఇబ్బందులెదుర్కుంటారు. ప్రయత్నపూర్వకంగా నిరుద్యోగులకు ఒక అవకాశం కలిసివస్తుంది.
కర్కాటకం - రావలసిన ధనం సమయానికి అందుతుంది. వేడుకలు, శుభకార్యాల్లో ఆత్మీయులకు విలువైన కానుకలు చదివించుకుంటారు. మీ పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య చక్కని అవగాహన, పరస్పర సహకారం చోటు చేసుకుంటారు.
సింహం - మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి, పెద్దల జోక్యంతో మీ సమస్యలు పరిష్కారం కాగలవు. ఖర్చులు అధికం, గురు, శుక్ర వారాల్లో ధనం సమయానికి అందక ఇబ్బందులెదుర్కొంటారు. మీ శ్రీమతి సలహాను తేలికగా కొట్టివేయకండి.
కన్య - వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాల దిశగా దృష్టి సారిస్తారు. మీ చెంత పెద్దమొత్తంలో ధనం ఉందన్న విషయాన్ని గోప్యంగా ఉంచాలి. శనివారం నాడు మీ కార్యక్రమాలు, బాధ్యతలు మీరు చూసుకోవటమే ఉత్తమం.
తుల - వాణిజ్య ఒప్పందాలు, వివాహ నిశ్చితార్థాల్లో మీ వైఖరిని స్పష్టంగా తెలియచేయాలి. ఇంటా బయటా సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఖర్చులు అధికం, ధనవ్యయంలో మితం పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు, అనవసర ప్రసంగాలు వివాధాలకు దారితీస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహా తీసుకోవటం ఉత్తమం.
వృశ్చికం - అనుక్షణం ఏదో ఒక సమస్యతో సతమతమవుతారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటానికి యత్నించండి. సమయానుకూలంగా వ్యవహరించి ఒక ఆపద నుంచి గట్టెక్కుతారు. దంపతుల మధ్య అవగాహన లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. ఇతరుల వ్యాఖ్యలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వటం మంచిది కాదు.
ధనస్సు - ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచలుంటాయి. నూతన వ్యాపారాలు, సంస్థలు ప్రగతిపథంలో సాగుతాయి. కొత్తగా చేరిన పనివారలను ఓ కంట కనిపెట్టి ఉండటం మంచిది. కుటుంబ సమేతంగా ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. ఆది, సోమ వారాల్లో మీ పనులు, కార్యకలాపాలు అనుకున్నంత చురుకుగా సాగవు.
మకరం - గృహంలో ఒక శుభకార్యం నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. మీ ఆదరాభిమానాలు, అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఏ విషయంలోను ఒంటెత్తుపోకడ మంచిది కాదు. అర్ధాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఊహించని పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. స్త్రీల ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది.
కుంభం - చేపట్టిన పనులు అనుకున్నంత చురుకుగా సాగవు. గత కొంత కాలంగా వేధిస్తున్న సమస్యలకు తెరపడుతుంది. ఆర్థిక, కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. మీ జీవితభాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు. పుణ్యక్షేత్ర సందర్శనలు సంతృప్తినిస్తాయి. ఒక సమాచారం మిమ్ములను తీవ్రంగా ఆలోచింప చేసేదిగా ఉంటుంది. స్త్రీలు వీలైనంత మితంగా సంభాషించటం శ్రేయస్కరం.
మీనం - ప్రణాళికాబద్దంగా వ్యవహరించి మీ పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. తొందరపడి హామీలివ్వటం మంచిది కాదు. అవివాహితులు కొత్త అనుభూతికి లోనవుతారు. స్త్రీలకు వస్త్ర, వస్తులాభం వంటి శుభపరిణమాలుంటాయి. శుభకార్యాల్లో ఆత్మీయులు, ప్రముఖులను కలుసుకుంటారు. రాబడికి మించి ఖర్చులుంటాయి. శనివారం నాడు ధనవ్యయం విషయంలో ఏకాగ్రత అవసరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications