Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
Weekly Horoscope : (ఏప్రిల్ 21 - 28) ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకోండి..!
ఈ వారంలో హనుమాన్ జయంతి, మహావీర్ జయంతి, సంకష్ట చతుర్థి ఉండడం వల్ల ఈ వారానికి చాలా ప్రాముఖ్యం కలిగి ఉంది. ఈ రోజుల్లో వివిధ రాశుల వారికి వివిధ రకాలుగా ప్రయోజనాలున్నాయ్. ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 28 వరకు ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేషరాశి
ఈ రాశివారికి కేవలం ఆరోగ్యం విషయంలోనే కొంత ప్రతికూలతో ఉంది. దాదాపు మిగతా అన్ని అంశాల్లో మెరుగ్గానే ఉంటారు. సాఫ్ట్‌వేర్ మీడియా రంగంలో పనిచేస్తున్న వారి సంసార జీవితం చాలా బాగుంటుంది. రాజకీయాల్లో ఉన్న వారు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయ్.
అధృష్ట రంగు : తెలుపు
దోషం తొలగాలంటే : హనుమంతుడి పూజ చేయాలి
వృషభం
వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి విజయావకాశాలు ఉంటాయ్. నిరుద్యోగ సమస్య నుంచి బయటపడతారు. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్య సమస్యలు రావచ్చు.
అదృష్ట రంగు : నీలం
దొషం తొలగాలంటే : శివుడిని ధ్యానించాలి

మిథునం
చేయాలనుకున్న పనులు పూర్తవుతాయ్. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. విద్యార్ధులకు మంచి ఫలితాలు వస్తాయ్. డబ్బును ఎక్కువగా ఖర్చు పెడతారు.
అదృష్ట రంగు :ఆకు పచ్చ
దోషం తొలగాలంటే : ఆవులను పాలకూర తిపిస్తే దోషం పోతుంది
కర్కాటకం
విద్యార్ధులు పరీక్షలో విజయం సాధిస్తారు. వీరి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సినిమా రంగంలో ఉన్నవారు అనుకున్నది సాధిస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారు లాభాలార్జిస్తారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలును ఎదుర్కోకుండా ఆరోగ్యంగా ఉంటారు.
అదృష్ట రంగు : పసుపు
దోషం తొలగాలంటే : శివుడిని పూజించాలి
సింహ రాశి
మీడియాలో పనిచేసేవారు సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో వివాదాలు చెలరేగుతాయ్. రాజకీయాల్లో వున్న వారు విజయం సాధిస్తారు.
అదృష్ట రంగు : తెలుపు
దోషం తొలగాలంటే : సూర్యుడిని పూజించాలి
కన్య రాశి
ఐటీ రంగంలో ఉన్నవారు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని తరువాత విజయం సాధిస్తారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు పొందుతారు. సంసారిక జివితంలో సమస్యలు వస్తాయ్. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారలను మొదలుపెడతారు.
అదృష్ట రంగు : నీలం
దోషం తొలగాలంటే : విష్ణువును పూజించాలి
తుల రాశి
వైవామిక జీవితంలో సంతోషంగా ఉంటారు. సేవా రంగంలో పనిచేసే వారు విజయం సాధిస్తారు. రాజకీయాల్లో ఉన్న వారు విజయం సాధిస్తారు. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అదృష్ట రంగు : నీలం
దోషం తొలగాలంటే : శ్రీసూక్త పారాయణం చెయ్యాలి
వృశ్చిక రాశి
రాజకీయాల్లో వున్న వారికి మంచి జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్న వారు విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
అదృష్ట రంగు : తెలుపు
దోషం తొలగాలంటే : బట్టలను దానం చెయ్యాలి
ధనుస్సు రాశి
పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయ్. సాంసారిక జీవితం సాఫీగా సాగుతుంది. రాజకీయాల్లో ఉన్నవారు విజయం సాధిస్తారు. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అదృష్ట రంగు : తెలుపు
దోషం తొలగాలంటే : నువ్వులను దానం చెయ్యాలి
మకర రాశి
సేవారంగంలో ఉన్నవారు సమస్యలను ఎదుర్కొంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారు సుఖంగా ఉంటారు.
అదృష్ట రంగు : నీలం
దోషం తొలగాలంటే : హనుమంతుడిని పూజించాలి
కుంభ రాశి
వ్యాపార చేసే వారు లాభాలార్జిస్తారు. సర్వీస్ సెక్టార్‌లో పనిచేసేవారు వారి రంగంలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆరోగ్యంగా ఉంటారు.
అదృష్ట రంగు : నీలం, తెలుపు
దోషం తొలగాలంటే : శివుడిని పూజించాలి
మీన రాశి
డయాబెటీస్ రోగులు జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీ భార్య లేదా భర్థ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి.
అదృష్ట రంగు : తెలుపు
దోషం తొలగాలంటే : శ్రీరాముడిని పూజించండి
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications