Latest Updates
-
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం! -
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
వడగాల్పుల వేళ జాగ్రత్త! ఎండల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం ఎలా? -
అక్షయ తృతీయ రోజున ఈ సమయాల్లో పూజ చేస్తే అదృష్టం మీదే! -
వృషభం, సింహం, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉందంటే? - 19 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త! - ఆదివారం, 19 ఏప్రిల్ 2026 -
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు! -
పెళ్లి గురించి ఎవరూ చెప్పని 5 పచ్చి నిజాలు..ఇవి తెలుసుకోకపోతే కష్టమే!
Weekly Horoscope : (ఏప్రిల్ 22 - ఏప్రిల్ 28) కెరీర్‌లో ఏ రాశివారు ఎలా ఉన్నారో తెలుసుకోండి..!
ఏప్రిల్ 22 - ఏప్రిల్ 28 వరకు కెరీర్‌లో ఏ రాశివారు ఎలా ఉన్నారో తెలుసుకోండి..! అన్ని రాశులవారి గురించి వివరించాము. మేషరాశికి సంబంధించిన వారు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మిథునం రాశిలో కమీషన్లు తీసుకున్నవారు ఉంటే వారికి మరిన్ని లాభాలు వచ్చే అవకాశం ఉంది.
మేష
జాగ్రత్తగా ఆలోచించి మీ కెరీర్ పై నిర్ణయం తీసుకోండి. తొందరపాటులో ఎటువంటి నిర్ణయాలకు రావద్దు. మీ కెరీర్ విషయంలో పెద్దలు, కుటుంబ సభ్యుల సలహా తప్పకుండా తీసుకోవాలి. ఏ సమస్య వచ్చినా ఎటువంటి సహాయం అవసరం కావాలన్నా మొహమాటం లేకుండా మీ కుటుంబ సభ్యులను అడగండి.
వృషభం
మీ వృత్తి ఉద్యోగంలో మీ నెట్వర్క్‌ను పెంచుకునే ప్రయత్నం చేయండి. మీ నుంచి మీ తొటి ఉద్యోగులు ఈ వారం చాలా ఆశిస్తారు. మీరు ఇతరులను కూడా ప్రభావితం చేయగలుగుతారు కాబట్టి మీరు ఆచితూచి అడుగులు వేయండి. మీకున్న ప్రతిభను చూపించాల్సిన అవసరం ఉంది.
మిథునం
కమీషన్ల తీసుకుంటూ ఉద్యోగం చేసే వారు ఈ వారం మరింత ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది. ప్రతీ రోజు మీ పనిలో కొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేయండి. అటు పనితో పాటు ఇటు వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగండి.
కర్కాటకం
మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ మీ ఎదుగుదల కోసం ఖచ్చితంగా కృషి చేయాలి. కొత్త ప్లాన్స్ ఏవైనా ఉంటే వాటిని ఆచరణలో పెట్టి అమలు చేయండి. మీరు చేసే పనులకు మీతోటి ఉద్యోగుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది.
సింహరాశి
ఈ వారం మీరు చేపట్టే అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. మీరు పనిచేసే రంగంలో మీ నీనియర్ల నుంచి ప్రోత్సాహాన్ని అందుకుంటారు. మీకు అప్పజెప్పిన పనులను శ్రద్ధగా పూర్తి చేయడానికి కృషి చేయండి.
కన్య
ఈ రాశివారు ఇప్పుడు ఉద్యోగ ప్రయంత్నంలో గనక ఉంటే వారు తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తారు. వారి కెరీర్‌ను జీవితాన్ని బంగారంలో మార్చుకోవడానికి ఇదే సదావకాశంగా చెప్పుకోవచ్చు. ఇంతకంటే మంచి సమయం మళ్లీ రాకపోవచ్చు. మీరు కష్టపడిన దానికి తప్పకుండా ఫలితం లభిస్తుంది.
తుల
కొత్త నైపుణ్యాలతో మీ ఉద్యోగంలో ఎదిగేందుకు కృషి చెయ్యాలి. మీరు చేస్తున్న పని పట్ల మీ సీనియర్ల ప్రశంసలు గుప్పిస్తారు. మీకు మంచి గుర్తింపు కూడా వస్తుంది. మీ నైపుణ్యాలను మరింత పెంచుకోవడానికి ప్రత్యేక శిక్షనను తీసుకోవాల్సిన అవసరం ఉంది.
వృశ్చికం
ఈ రాశివారు ఉద్యోగం వద్ద వచ్చే సమస్యలపై సహనం ప్రదర్శించాలి. పరిస్థితి తీవ్రమవకుండా, చేయిదాటిపోకుండా అప్రమత్తంగా ఉండాలి. మీ లక్ష్యాన్ని మరిచిపోకుండా కష్టపడుతూనే ఉండాలి. ఉద్యోగంలో మిమ్మల్ని బాధ్యులను చేసేట్టుగా మీ చర్యలు ఉండకూడదు. మీ ప్రత్యర్ధులకు కూడా మీరు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు.
ధనుస్సు
మీరు చేసే పనుల్లో మీకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముంది. ఇలాంటి ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా వాటిని ఎదుర్కొండి. పని సమర్ధవంతంగా పూర్తి చేసేందుకు మీ సీనియర్ల సహాయాన్ని తీసుకోండి.
మకర
మీరు సంపాదించే డబ్బులో భవిష్యత్తు కోసం డబ్బును దాచే ప్లాన్‌లపై ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎక్కడైనా భారీ పెట్టుబడి లేక ఏదైనా ఆస్తి కొనాలనుకుంటే సరైన వ్యక్తుల నుంచి సలహా తీసుకోండి.
కుంభ
వత్తిడిని కూడా తట్టుకొని మీరు పనిచేయగలిగితే విజయం సాధించడమే కాకుండా మీ తొటి ఉద్యోగులు సీనియర్ల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మనసులో ఏదీ దాచుకోకుండా మనస్పర్ధలు రాకుండా సమస్యలను పరిష్కరించుకోండి.

ఉద్యోగంలో మీరు చురుగ్గా పాల్గొనండి. పనివద్ద ఓపిక, ప్రొషెషనలిజమ్ చాలా ముఖ్యమన్న విషయాన్ని మరిచిపోకూడదు. పని ప్రదేశంలో మీపట్ల మరింత గౌరవం పెరిగేలా మీ ప్రవర్తన ఉండేట్టుగా జాగ్రత్తపడాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











