Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఏ రాశి వారు ఏ వయస్సులో మరణిస్తారో చూడండి, వారికి మాత్రం పాపం
భూమ్మీద జన్మించిన ఏ జీవికి అయినా మరణం తధ్యం. మనుషులైనా, జంతువులైనా, క్రిమికీటకాలైనా ఏదో ఒక సమయంలో మరణం ఖాయం. అయితే ఎవరికైనా ఎప్పుడు మరణం సంభవిస్తుందో ఊహించడం అసాధ్యం. ప్రజలు మరణానికి భయపడటానికి ఇదే ప్రధాన కారణం. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీ మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలుసుకోవచ్చు.
మీరు ఎప్పుడు చనిపోతారో జ్యోతిష్యం ఖచ్చితంగా చెప్పలేకపోయినా..మీరు ఎంతకాలం జీవిస్తారో మీ జన్మ రాశి తెలియజేస్తుంది. అయితే మీ ప్రయత్నాలు, జీవనశైలి ద్వారా ఇది మారగలదని గుర్తుంచుకోవాలి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశి వ్యక్తులు ఎంతకాలం బతుకుతారో ఇప్పుడు చూద్దాం.

మేషరాశి
మేష రాశి వ్యక్తులు రిస్క్ తీసుకునేవారు, మనసులోని మాటలను బహిరంగంగా చెప్పడానికి వెనుకాడరు. వీరి ఈ లక్షణమే వీరి మరణానికి కారణం కావచ్చు. వీరి మరణం 30 ఏళ్ల వయస్సు తర్వాత సంభవించవచ్చు. అయితే వీరుమరణించిన తర్వాత కూడా అందరి హృదయాల్లో జీవిస్తూనే ఉంటారు.
వృషభం
వృషభ రాశి వ్యక్తులు దృఢ సంకల్పం కలిగి ఉంటారు, చాలా కష్టపడి పనిచేసేవారు. వీరి స్కిల్స్, ప్రయత్నాలు వీరి దీర్ఘాయువును నిర్ధారిస్తాయి. 80 ఏళ్ల తర్వాత వీరి మరణం సహజంగానే సంభవించే అవకాశం ఉందట.
మిథున రాశి
ఏదైనా అన్వేషించాలనే వీరి తీరని కోరిక, సాహసం పట్ల ఉన్న ప్రేమ మిథునరాశి వ్యక్తులను ప్రమాదకరమైన ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. కాబట్టి వీరి మరణం వీరు ఊహించిన దానికంటే త్వరగా రావచ్చు. వీరి మరణం 20 సంవత్సరాల వయస్సులో కూడా సంభవించవచ్చు. దానిని మార్చగల సామర్థ్యం కూడా వీరికి ఉందట.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వ్యక్తులు ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడతారు. ఇతరుల నుండి సహాయం అడగడానికి వెనుకాడతారు. వీరి ఈ లక్షణం వారు కొన్ని దశాబ్దాల పాటు మంచి ఆరోగ్యంతో జీవించడానికి సహాయపడవచ్చు, కానీ 50 సంవత్సరాల వయస్సులో వీరికి మరణం అనుకోకుండా రావచ్చు.
సింహ రాశి
సింహ రాశి వ్యక్తులు అత్యంత ఆకర్షణీయంగా ఉంటారు, వీరు ఎల్లప్పుడూ ఇతరుల దృష్టిని ఆకర్షించాలని కోరుకుంటారు. అదే సమయంలో చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు. వీరి అజాగ్రత్త 40 సంవత్సరాల వయస్సులో మరణానికి దారితీయవచ్చు.
కన్య రాశి
కన్య రాశి వ్యక్తులు ప్రతి విషయంలోనూ పరిపూర్ణంగా ఉండాలని కోరుకునే తెలివైన వ్యక్తలు. ఇది వారి జీవితకాలాన్ని గణనీయంగా పెంచుతుంది. వీరు 70 సంవత్సరాల వయస్సులో చనిపోవచ్చు.
తుల రాశి
తుల రాశి వారు సహజంగానే శాంతియుత వ్యక్తులు. ప్రపంచంలో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పాలని వీరు కోరుకుంటారు. వీరి మరణం 50-55 సంవత్సరాల మధ్య ప్రమాదంలో సంభవించే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు చాలా కఠినంగా ఉంటారు. వీరి ప్రతీకార స్వభావమే వారి మరణానికి కారణం అయి ఉండవచ్చు. శత్రుత్వం కారణంగా వీరి మరణం 35- 40 సంవత్సరాల మధ్య సంభవించవచ్చు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వ్యక్తులు సాహస ప్రియులు. కాబట్టి వీరు ఎల్లప్పుడూ ప్రమాదాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. వీరి ఈ సాహసోపేత స్వభావం వీరిని త్వరగా మరణం వైపు నడిపిస్తుంది. వీరి మరణం 25-30 సంవత్సరాల మధ్య సంభవించవచ్చు.
మకర రాశి
మకర రాశి వారు క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ తమ లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పనిచేస్తారు. కాబట్టి వీరు తమ లక్ష్యాలను సాధించకుండా ఎప్పుడూ చనిపోరు. వీరు తమ లక్ష్యాలను సాధించిన తర్వాత 60 సంవత్సరాల వయస్సులో చనిపోవచ్చు.
కుంభ రాశి
కుంభ రాశి వారు ప్రశాంతంగా ఉంటారు. ఎక్కువ కాలం జీవించాలనే కోరిక కలిగి ఉంటారు. కానీ వీరి మరణం 40 సంవత్సరాల వయసులో అనుకోకుండా రావచ్చు.
మీన రాశి
మీన రాశి వారు కలల ప్రపంచంలో జీవిస్తారు. వీరు కలల ప్రపంచంలో జీవిస్తూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దీనివల్ల వీరి మరణం 20 సంవత్సరాల వయస్సులో సంభవించే అవకాశం ఉంటుంట.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications