Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
గడ్డంపై పుట్టమచ్చ అదృష్టమా? దురదృష్టమా?..ఈ రహస్యం తెలుసుకోండి
జ్యోతిష్యశాస్త్రం మాదిరిగానే సాముద్రిక శాస్త్రం కూడా చాలా పాపులర్. ఒక వ్యక్తి భవిష్యత్తును గ్రహాల స్థానాలు,నక్షత్రాల కదలికల ఆధారణంగా జ్యోతిస్యశాస్త్రం అంచనా వేస్తుండగా..శరీర భాగాలు,శరీరంపై ఉండే ఉండే పుట్టుమచ్చల ఆధారణంగా వ్యక్తుల స్వభావం, వ్యక్తిత్వం భవిష్యత్తుని సాముద్రిక శాస్త్రం అంచనా వేస్తుంది. సాధారణంగా ఏ మనిషికైనా ఒంటిమీద ఏదో ఒక ప్లేస్ లో పుట్టుమచ్చలు ఉండటం సహజం. అయితే శరీరంలోని కొన్ని చోట్ల పుట్టమచ్చ ఉండే అదృష్టం..కొన్ని చోట్ల ఉండే దురదృష్టం అనే మాటలను తరుచుగా మనం వింటుంటాం.
సాముద్రిక శాస్త్రం ప్రకారం గడ్డం మీద పుట్టు మచ్చ ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి..ఇది అదృష్టానికి సంకేతమా లేక దురదృష్టానికి సంకేతమా? ఈ వక్తుల స్వభావం ఎలా ఉంటుంది వంటి అనేక ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి గడ్డం మీద పుట్టుమచ్చ ఉంటే దాని స్థానం బట్టి ఫలితాలు మారుతూ ఉంటాయి.

గడ్డం మధ్యలో పుట్టుమచ్చ
ఒకవేళ మీ గడ్డం సరిగ్గా మధ్యలో ఒక పుట్టుమచ్చ ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులు. ధనవంతులవుతారు. వీరికి అష్ఠైశ్వర్యాలు కలుగుతాయి. సాముద్రిక శాస్త్రం ప్రకారం గడ్డం మధ్యలో పుట్టుమచ్చ ఉన్నోళ్లు ఇలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా ఉంటారు. తమ చుట్టూ ఉన్నవారిని కూడా నవ్విస్తూ,సంతోషంగా ఉంచడమే వీరికిష్టం.
వీరు చాలా తెలివైనవారు కూడా. ఖరీదైన వస్తువులంటే వీరికి చాలా ఇష్టం. తమ సంపాదనలో ఎక్కువ భాగం విలాసాలకే ఖర్చు చేస్తారు. అయినా వారికి డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదు. వీరు చాలా దాన గుణం కలిగిన వ్యక్తులుగా కూడా ఉంటారు. కీర్తివంతులు, ధైవభక్తి కలిగిన వారు కూడా అవుతారు.
గడ్డం కుడి వైపున పుట్టుమచ్చ
గడ్డం కుడి వైపున పుట్టుమచ్చ ఉన్నోళ్లు మర్యాదకలవారు, కీర్తిని సంపాదిస్తారు. సాధారణంగా వీళ్లు చాలా ఆసక్తికర వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి కళల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉండవచ్చు. సంగీతం, చిత్రలేఖనం, నృత్యం లేదా మరే ఇతర సృజనాత్మక రంగంలోనైనా వీరు తమదైన ముద్ర వేయగలరు. వీరి ఆలోచనలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఒకే రకమైన జీవితాన్ని గడపడానికి వీరు ఇష్టపడరు.
కొత్త ప్రదేశాలు చూడాలని, కొత్త అనుభవాలు పొందాలని తపిస్తుంటారు. ఒకే ఉద్యోగం లేదా ఒకే వ్యక్తితో ఎక్కువ కాలం స్థిరంగా ఉండటం వీరికి కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. వీరు అనేక విషయాల్లో నైపుణ్యం కలిగి ఉంటారు. ఒకేసారి అనేక పనులు చేయగల సామర్థ్యం వారికి ఉంటుంది. వివిధ రంగాల్లో వారికున్న పరిజ్ఞానం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ వీరిలో అణువంతైనా గర్వం ఉండదు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం వీరిది. అందరితోనూ కలిసిపోతారు, మర్యాదగా ప్రవర్తిస్తారు. వీరి జీవితం ఎల్లప్పుడూ కొత్త మలుపులతో ఆసక్తికరంగా ఉంటుంది.
గడ్డం ఎడమవైపున పుట్టుమచ్చ ఉంటే
గడ్డం ఎడమ వైపున పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు కూడా ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి ఉండవచ్చు. దేవుడిపై నమ్మకం, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి వారి జీవితంలో ముఖ్యమైన భాగంగా ఉంటాయి. తమ మంచి ప్రవర్తన, దయగల హృదయంతో అందరినీ ఆకట్టుకుంటారు.
సమాజంలో వీరికి మంచి పేరు, గౌరవం లభిస్తాయి. వీరు సాధారణంగా జీవితాన్ని సానుకూల దృక్పథంతో చూస్తారు. కష్టాల్లో కూడా ఆశావాహంగా ఉంటారు, ఇతరులకు స్ఫూర్తినిస్తారు. ఇతరులకు సహాయం చేయడంలో వీరు ముందుంటారు. అయితే వీరిని పిసినారులు అని ఇతరులు అనుకుంటుంటారు. తమ వంతుగా ఎవరికేమైనా సాయం చేయాలని తపిస్తారు. సమాజంలో వీరికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎవరైనా వీరిని కలిస్తే వీరికి ఫ్యాన్ అయిపోతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











