Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్..కన్నయ్యకు అత్యంత ఇష్టమైన ధనియాల పంజిరి ఎలా చేసుకోవాలంటే.. -
జ్వరం వచ్చినప్పుడు త్వరగా కోలుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? -
వంకాయ వండటం ఓ కళ.. అయ్యంగార్ స్టైల్ లో ఇలా చేస్తే రుచికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే! -
పేరెంట్స్ రిచ్ అయితే జెన్ జెడ్ చెడుదారులు పడుతుందా.. వైరల్ పోస్ట్‌పై చర్చ.! -
కన్నయ్య కరుణ: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నుంచి ఈ రాశులకు కుబేర యోగమే! -
యమ్మీ స్పైసీతో స్ట్రీట్ ఫుడ్ స్టైల్ మసాలా నూడుల్స్.. ఈ ట్రిక్ పాటిస్తే అస్సలు విరిగిపోదు.! -
150 డిగ్రీల కోణంలో శని, బుధులు..సెప్టెంబర్ 1న షడాష్టక యోగంతో ఈ 4 రాశులకు అఖండ ఐశ్వర్యం! -
Sorakaya Payasam Recipe: పైదరాబాదీ వెడ్డింగ్ స్టైల్ సొరకాయ పాయసం..రుచిలో లేదు దీనికి సాటి.. -
పోషకాల గని.. వర్షాకాలంలో తప్పనిసరిగా తాగాల్సిన చెట్టినాడ్ ఫ్రూట్ పాయసం.! -
Chicken Benefits: చికెన్ తింటే కలిగే 5 అద్భుత ప్రయోజనాలు ఇవే!
రాహుకాలం అంటే ఏంటి? ఈ టైంలో పుడితే అన్నీ కష్టాలేనా?..అదృష్టాన్ని తెచ్చే జ్యోతిష్య రహస్యం!
నవగ్రహాలలో రాహువు పేరు వినగానే చాలామంది గుండెల్లో ఏదో తెలియని భయం మొదలవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువును ఒక పాప గ్రహంగా, అశుభాలకు ప్రతీకగా చూస్తుంటారు. అందుకే రాహువు స్థానం సరిగ్గా లేదంటే చాలు.. ప్రజల మనసుల్లో ఆందోళన మొదలవుతుంది.కానీ ఇతర గ్రహాల మాదిరిగానే రాహువు కేవలం చెడు మాత్రమే కాదు, అద్భుతమైన శుభ ఫలితాలను కూడా ఇస్తాడని మీకు తెలుసా?

అయితే, రాహువు ప్రతికూల ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి, ఆ గ్రహం గురించి పూర్తిగా అర్థం చేసుకుని ముందుకు సాగడం ఎంతో అవసరం.మన ప్రాచీన శాస్త్రాల ప్రకారం.. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్న పగటి సమయాన్ని ఎనిమిది భాగాలుగా విభజించారు. అందులో ఎనిమిదవ భాగానికి ఆధిపత్యం వహించేది రాహువే. ప్రతిరోజూ సుమారు 90 నిమిషాల పాటు ఉండే ఈ నిర్దిష్ట సమయాన్నే మనం రాహుకాలం అంటాం.
ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు, కొత్త పనులు ప్రారంభించకూడదని పండితులు చెబుతారు. మరి ఈ రాహుకాలంలో జన్మించిన వారి జీవితం ఎలా ఉంటుంది? అది కేవలం చెడు మాత్రమే చేస్తుందా? వారి లక్షణాలు ఏమిటి? అన్న ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ చూడండి.
రాహుకాలంలో జన్మించిన వారిలో కనిపించే ప్రత్యేక లక్షణాలు
విలాసవంతమైన జీవితం
జ్యోతిష్యం ప్రకారం రాహువు భౌతిక సుఖాలకు, ఆధునికతకు, ఆనందానికి కారకుడు. అందుకే ఈ సమయంలో జన్మించిన వారికి చిన్న వయసు నుంచే లగ్జరీ లైఫ్, సుఖసంతోషాలు, సౌకర్యాల పట్ల మక్కువ చాలా ఎక్కువగా ఉంటుంది.
అంతా ఆకస్మికమే
వీరి జీవితంలో జరిగే సంఘటనలు చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. అంతా హఠాత్తుగా జరిగిపోతుంది. ఊహించని విధంగా రాత్రికి రాత్రే భారీ విజయాలు వస్తాయి, అదే సమయంలో నష్టాలు కూడా అంతే వేగంగా పలకరిస్తాయి. వాస్తవం గ్రహించేలోపే జరగాల్సినవి జరిగిపోతాయి.
కీర్తి ప్రతిష్టలు
జాతకంలో రాహువు అనుగ్రహం ఉంటే.. వీరు సమాజంలో ఎవరూ ఊహించని ఉన్నత స్థాయికి చేరుకుంటారు. విశేషమైన పేరు, ప్రఖ్యాతులు గడిస్తారు.
మానసిక ఆందోళన
ఒకవేళ జాతకంలో రాహువు చెడు స్థానంలో ఉంటే మాత్రం కష్టాలు తప్పవు. మనసులో ఎప్పుడూ ఏదో తెలియని అకారణ భయం వెంటాడుతుంది. అధిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో నిరంతరం సతమతమవుతారు.
అన్వేషణ, జిజ్ఞాస
వీరికి తెలియని విషయాలను, నిగూఢ రహస్యాలను తెలుసుకోవాలనే ఆసక్తి చాలా ఎక్కువ. ఈ అన్వేషణే వీరిని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తుంది.

రాహువును ప్రసన్నం చేసుకునే అద్భుతమైన మార్గాలు
రాహుకాలంలో పుట్టడం అంటే అంతా చెడు జరుగుతుందనే అపోహను ముందుగా పక్కనపెట్టండి. రాహువును శాంతింపజేస్తే, అత్యున్నత శిఖరాలకు చేరుకోవచ్చు. అందుకోసం ఈ క్రింది పరిహారాలు పాటించండి.
జపాలు, పూజలు: ప్రతి మంగళవారం, శనివారం క్రమం తప్పకుండా రాహు బీజ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలాగే శనివారం నాడు ఉపవాసం ఉండి పరమశివుడిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి.
దానధర్మాలు: పేదలకు, నిస్సహాయులకు నల్ల నువ్వులు, ఆవ నూనె దానం చేయడం ద్వారా రాహు దోషాలు ఇట్టే తొలగిపోతాయి.
పరిశుభ్రత: రాహువుకు పరిశుభ్రత అంటే ఇష్టం. కాబట్టి రోజూ క్రమం తప్పకుండా స్నానం చేస్తూ, మీ బాహ్య సౌందర్యంపై శ్రద్ధ వహించండి. ముఖ్యంగా కాటన్ దుస్తులు ఎక్కువగా ధరించడం చాలా మంచిది. దీనివల్ల రాహువు సంతోషిస్తాడు.
ఇంటి వాతావరణం: వస్తువులు చిందరవందరగా, మురికిగా పడి ఉండే ఇళ్లను రాహువు అస్సలు ఇష్టపడడు. అది మీ అదృష్టంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
Disclaimer: నమ్మకాలు, మత విశ్వాసాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. దీనిని బోల్డ్ స్కై తెలుగు దృవీకరించలేదు. దీనిని విశ్వసించడం వ్యక్తుల నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.



Click it and Unblock the Notifications