Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ముఖం చూసి ఎదుటివాళ్లు ఎలాంటోళ్లో చెప్పేయొచ్చు..అదెలాగో ఇక్కడ చూడండి
నీ కళ్లు నిజం చెబుతున్నాయి, పెదాలు ప్రేమను పలుకుతాయివంటి మాటలు మనం తరచుగా సినిమాల్లో, బయట చాలామంది యెబుతుండటం వింటుంటాం. అయితే మన ముఖంలోని ప్రతి భాగం మన వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని అద్దంలా పట్టి చూపిస్తుందని మీకు తెలుసా? సాముద్రిక శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ముఖ కవళికలను, ఆకారాన్ని బట్టి..వారి స్వభావాన్ని, ఆలోచనా విధానాన్ని అంచనా వేయవచ్చు. ఎదుటివారి గురించి ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలు మనకు తెలిసిపోతాయి.
కళ్ళు
నల్లని కళ్ళు: గాఢమైన నల్లని కళ్లు ఉన్నవారు తమలో చాలా రహస్యాలు దాచుకుంటారు. వీరు అంత ఈజీగా ఎవరితో కలవరు, కానీ నమ్మిన వారి కోసం ఎంతదాకా అయినా వెళ్తారు.

గోధుమ రంగు కళ్ళు: వీరు స్వతంత్ర భావాలు కలిగినవారు. సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం వీరి సొంతం. తమ పనులను తామే చేసుకోవడానికి ఇష్టపడతారు.
ఆకుపచ్చ కళ్ళు: వీరు చాలా శాంతికాముకులు, దయార్ద్రహృదయులు. గొడవలకు, అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు.
బూడిద రంగు కళ్ళు: మానసిక స్థైర్యం, కఠోర శ్రమ వీరి లక్షణాలు. ఎలాంటి కష్టమైన పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడగలరు.
నీలి కళ్ళు : వీరు చాలా ధైర్యవంతులు, నిస్వార్థపరులు. ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ఫస్ట్ ఉంటారు. వీరిది విశాల హృదయం.
కనుబొమ్మలు..జ్ణానానికి సంకేతం
విశాలమైన కనుబొమ్మలు: వీరికి జ్ఞాన దాహం ఎక్కువ. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపనతో ఉంటారు.
ఇరుకైన కనుబొమ్మలు: వీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించే దాకా పట్టు వదలరు. వీరిలో నిర్ణయాత్మక శక్తి ఎక్కువగా ఉంటుంది.
పెదవులు..ప్రేమను తెలిపే ఆకృతి
మందమైన పెదవులు: వీరు ముక్కుసూటిగా మాట్లాడతారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి చెప్పడం వీరికి నచ్చదు. నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలను చెప్పేస్తారు.
సన్నని పెదవులు: వీరు కొంచెం అంతర్ముఖులు. తమ భావాలను అంత సులభంగా బయటపెట్టరు. తమ ఆత్మీయులు తమ మనసును అర్థం చేసుకోవాలని ఆశిస్తారు.
ముక్కు..ఆత్మగౌరవానికి ప్రతీక
పదునైన ముక్కు: వీరికి ఆత్మవిశ్వాసం, పట్టుదల ఎక్కువ. కొన్నిసార్లు కొద్దిగా గర్వంగా కనిపించినా, తమ పనిలో అపారమైన ఏకాగ్రతను ప్రదర్శిస్తారు.
మొద్దుబారిన ముక్కు: వీరు చాలా నిరాడంబరంగా, ప్రశాంతంగా ఉంటారు. ఇతరుల విజయాన్ని చూసి ఆనందిస్తారు తప్ప అసూయపడరు.
నుదురు, గడ్డం..అదృష్టం, సంకల్ప బలం
విశాలమైన, స్పష్టమైన నుదురు అదృష్టానికి, ఉన్నత భవిష్యత్తుకు చిహ్నమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక గడ్డం విషయానికొస్తే..పొడవాటి గడ్డం ఉన్నవారు మొండి పట్టుదలతో ఉంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ. చిన్న గడ్డం ఉన్నవారు మృదు స్వభావులు, కళాత్మక హృదయం కలిగినవారు. అయితే వీరు కొంచెం బద్ధకంగా ఉండే అవకాశం ఉంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications