Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్..కన్నయ్యకు అత్యంత ఇష్టమైన ధనియాల పంజిరి ఎలా చేసుకోవాలంటే.. -
జ్వరం వచ్చినప్పుడు త్వరగా కోలుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? -
వంకాయ వండటం ఓ కళ.. అయ్యంగార్ స్టైల్ లో ఇలా చేస్తే రుచికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే! -
పేరెంట్స్ రిచ్ అయితే జెన్ జెడ్ చెడుదారులు పడుతుందా.. వైరల్ పోస్ట్‌పై చర్చ.! -
కన్నయ్య కరుణ: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నుంచి ఈ రాశులకు కుబేర యోగమే! -
యమ్మీ స్పైసీతో స్ట్రీట్ ఫుడ్ స్టైల్ మసాలా నూడుల్స్.. ఈ ట్రిక్ పాటిస్తే అస్సలు విరిగిపోదు.! -
150 డిగ్రీల కోణంలో శని, బుధులు..సెప్టెంబర్ 1న షడాష్టక యోగంతో ఈ 4 రాశులకు అఖండ ఐశ్వర్యం! -
Sorakaya Payasam Recipe: పైదరాబాదీ వెడ్డింగ్ స్టైల్ సొరకాయ పాయసం..రుచిలో లేదు దీనికి సాటి.. -
పోషకాల గని.. వర్షాకాలంలో తప్పనిసరిగా తాగాల్సిన చెట్టినాడ్ ఫ్రూట్ పాయసం.! -
Chicken Benefits: చికెన్ తింటే కలిగే 5 అద్భుత ప్రయోజనాలు ఇవే!
ఎవరైనా చనిపోయినట్లు కల వచ్చిందా? జ్యోతిష్యశాస్త్రం ఏం చెబుతుందంటే
నిద్రపోతున్న సమయంలో ఎవరికైనా కలలు రావడం సర్వసాధారణం. ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా కలలు వస్తుంటాయి. కొందరికి అయితే రోజూ కలలు వస్తుంటారు. అయితే కొందరికి చిత్ర విచిత్ర కలలు, కొందరికి రొమాంటిక్ కలలు ఇలా రకరకాలుగా వస్తుంటాయి. కొంతమంది మరుసటి రోజు కలలో చూసిన వాటిని గుర్తుంచుకోగులుగుతారు. కొంతమందికి గుర్తు కూడా ఉండదు. వారు తమ కలలో చూసిన వస్తువులు, సంఘటనలు లేదా వ్యక్తులను స్వయంగా కలిస్తేనే వాటిని గుర్తుంచుకుంటారు.
అయితే కొన్ని కలలు మన మనస్సుని బలంగా ప్రభావితం చేస్తాయి. అందులో ముఖ్యంగా కుటుంబ సభ్యులు లేదా బంధువు మరణించడాన్ని కలలో చూడటం చాలా మంది భయపడిపోతారు, ఏదో చెడు జరగబోతోందని ఆందోళన చెందుతారు. మనకు దగ్గరగా ఉన్న వ్యక్తి లేదా మనం ప్రేమించే వ్యక్తి చనిపోతున్నట్లు కలలుగన్నట్లయితే మరుసటి రోజు మనం చాలా నిరాశకు గురవుతాం. అయితే కలలో మరణం కనిపించడం దేనికి సంతకేతం? జ్యోతిష్యశాస్త్రం దీని గురించి ఏం చెబుతోంది?

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కలలో కనిపించే ప్రతి దృశ్యానికి ఒక నిర్దిష్ట అర్థం ఉంటుంది. మరణం అనేది ఒక రకమైన మార్పుకు సంకేతంగా పరిగణించబడుతుంది. కలలో ఎవరైనా చనిపోయినట్లు కనిపిస్తే అది వారి జీవితంలో లేదా మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు రాబోతోందని సూచిస్తుంది. ఈ మార్పు సానుకూలంగా లేదా ప్రతికూలంగా కూడా ఉండవచ్చు.
జీవితంలో ఒక అధ్యాయం ముగియడం
కలలో ఒక వ్యక్తి మరణించడం వారి జీవితంలోని ఒక నిర్దిష్ట దశ లేదా సమస్య ముగియబోతోందని సూచిస్తుంది. ఇది ఉద్యోగంలో మార్పు, సంబంధంలో ముగింపు లేదా ఒక అలవాటును వదులుకోవడం వంటివి కావచ్చు.
పునర్జన్మ లేదా కొత్త ప్రారంభం
కలలో మరణం ఒక కొత్త ప్రారంభానికి లేదా పునర్జన్మకు సంకేతం. పాత ఆలోచనలు లేదా అలవాట్లు అంతరించిపోతాయి, మీరు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది. మనం ప్రేమించే ఎవరైనా చనిపోతున్నట్లు కలలో కనిపిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఆనందం ఉంటుందని అర్థం. వారు అన్ని బాధల నుండి విముక్తి పొంది సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.
కలలు కనే వ్యక్తి చనిపోతున్నట్లు కలలు కన్నట్లయితే వారి జీవితంలో ఏదో మార్పు రాబోతోందని అర్థం. మీ స్నేహితులు చనిపోతున్నట్లు కలలు కన్నట్లయితే మీరు వారిని ప్రేమిస్తున్నారని అర్థం. మీ భర్త లేదా భార్య చనిపోతున్నట్లు కలలు కనడం అంటే మీరు కోరుకునే లక్షణాలలో ఏదో లోపం ఉందని అర్థం.
భావోద్వేగాల విడుదల
కొన్నిసార్లు మనం లోపల దాచుకున్న బలమైన భావోద్వేగాలు కలలో మరణం రూపంలో బయటకు వస్తాయి. ఇది బాధ, కోపం, భయం లేదా విచారం కావచ్చు. ఈ కలలు మన మనసుకు ఉపశమనం కలిగిస్తాయి.
సంబంధాలలో మార్పులు
మీరు కలలో చూసిన వ్యక్తితో మీ సంబంధంలో ఏదో మార్పు రాబోతోందని ఇది సూచిస్తుంది. ఇది వారి ప్రవర్తనలో మార్పు కావచ్చు లేదా మీ మధ్య దూరం పెరగవచ్చు.
ఆరోగ్య సమస్యల సూచన
కొన్ని సందర్భాల్లో కలలో మరణం కనిపించడం ఆ వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనలను సూచిస్తుంది. అయితే ఇది తప్పనిసరిగా నిజమైన మరణాన్ని సూచించదు. వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించమని ఒక హెచ్చరిక.ః
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications