Latest Updates
-
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తేనే సక్సెస్ వస్తుందా?.. ప్రముఖ న్యూరోసైంటిస్ట్ చెబుతున్న సంచలన నిజాలివే! -
ఎండ దెబ్బకు చెక్: బార్లీ నీళ్లా? చెరకు రసమా? వేసవి వ్యర్థాలను తరిమికొట్టే బెస్ట్ డ్రింక్ ఏది? -
ఇప్పటి ప్రేమ పరిచయాలు యువతను ఎందుకు మానసికంగా అలసిపోయేలా చేస్తోంది -
మధురై తణ్ణి చట్నీతో ఇడ్లీ, దోశల టేస్ట్ డబుల్!..ఎలా చేసుకోవాలంటే.. -
బాధ్యతలు ఏవైనా ఒత్తిడి సమానమే.. మహిళలూ వీటిపై నిర్లక్ష్యం వద్దు.! -
జూన్ 4: గ్రహాల కదలికలతో ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం, కెరీర్లో అద్భుతమైన మార్పులు! -
జూన్ 4న అరుదైన బ్రహ్మ యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీదే! -
వేసవిలో కడుపుకు హాయినిచ్చే బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..5 నిమిషాల్లో దహీ పోహా ఎలా చేయాలంటే.. -
ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా సందర్శించాల్సిన 10 అతి పురాతన శివాలయాలు -
12 ఏళ్ల తర్వాత కర్కాటకంలో గురు ఉచ్ఛ స్థితి: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీదే!
మేష రాశి వారు ఈ ఉంగరం ధరిస్తే కోటీశ్వరులౌతారు.. వెనక్కి తిరిగి చూడనవసరం లేదు..!
మేష రాశి వారు ఏ రత్నాన్ని ధరిస్తే అదృష్టం వరిస్తుందో చూద్దాం. మనుషులకు వుండే జన్మ రాశుల ఆధారంగా వారికుండే అనుకూలతలను ప్రతికూలతలను అంచనా వేస్తారు. జన్మించినప్పుడు జన్మరాశి, జన్మ నక్షత్రం నిర్ణయించబడుతుంది. ఒక వ్యక్తి తాను జన్మించిన రాశి ఆధారంగానే ఏది అనుకూలిస్తాయ్, ఏది ప్రతికూలిస్తాయో జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది.రాశి చక్రంలోని అన్ని రాశుల్లో మేష రాశికి చాలా ప్రత్యేకమైన స్థానం వుంది. రాశులలో మేషరాశి మొదటిది. మేషరాశిలో జన్మించిన వారు ధైర్యవంతులు. అయితే తరచూ వీరు ఏదో ఒక సవాళ్లను ఎదుర్కొంటూ వుంటారు. ఎంతో ఓర్పుగా సవాళ్లను పరిష్కరించుకోగలుగుతారు. చాలా సార్లు మేష రాశి వారు తమకు అవసరమైన దానికంటే కూడా ఎక్కువగా పొందుతారు. దీన్ని కూడా సక్రమంగా సద్వినియోగ పరుచుకోరు. అనవసరమైన ఖర్చుల లాగానే వీరు కోల్పోయేది చాలా ఎక్కువగా వుంటుంది. మేషరాశిలో జన్మించిన వారు కొంత స్వార్థపూరితంగా కూడా ఆలోచిస్తారని వుంది. ఎదుటివారు భవిష్యత్తు కోసం దాచుకున్న దనం కూడా వీరి స్వార్ధం కోసమే అన్నట్టుగా వుంటుంది.

మేషరాశిలో జన్మించిన వారికి అధిపతి అంగారకుడు. కాబట్టి వీరి అదృష్ట రత్నం వజ్రం. మేషరాశి వారు వజ్రాన్ని ధరిస్తే చాలు వారికి ఎటువంటి కష్టాలు వున్నా అవి తొలగిపోతాయ్. వజ్రం ధరించిన తరువాత మేషరాశి వారు ఏదనుకుంటే అది నెరవేరుతుంది. వీరి భవిష్యత్తు చాలా ఆశాజనకంగా వుంటుంది. వీరికి వున్న ఆర్థిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయ్. మేషరాశి వారికి ఈ వజ్రం బాగా కలిసి వస్తుంది కాబట్టి వీరి దీన్ని ఉంగరం రూపంలో కానీ, లేదా నెక్లెస్ రూపంలో కానీ ధరించడం చాలా మంచిది. మేషరాశి వారు అంగారకుడి నుంచి ప్రతికూల ఫలితం కాకుండా సానుకూల ప్రభావాన్ని పొందుతారు. వీరు తమ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా వుంటారు.

పూర్తికాలేదు అనుకున్న అన్ని పనులు కూడా పూర్తవుతాయ్. మేషరాశి వారు పగడాన్ని కూడా ధరించవచ్చు. ఈ ఉంగరాన్ని దరిస్తే వీరి పనుల్లో ఎలాంటి ఆటంకం వుండదు. మేషరాశి వారు వజ్రపు ఉంగరాన్ని కుడిచేతి మధ్య వేలికి ధరించాలి.
మేషరాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలంటే లేదా కోర్టు వివాదంలో అనుకూలమైన ఫలితాలు పొందాలంటే కుజ గ్రహ అనుగ్రహం చాలా వరకు వుండాలి. కుజగ్రహం అనుగ్రహం వుంటేనే రావాల్సిన సంపద బాగా వస్తుంది. అలాగే శత్రువులపై విజయం పొందాలంటే కూడా కుజగ్రహ అనుగ్రహం తప్పకుండా వుండాలి. మేషరాశి వారు కుజుడి అనుగ్రహం పొందాలంటే పగడం లేదంటే కెంపులు ధరించడం చాలా అవసరం. ఇంకా వీరు కుజగ్రహం అనుగ్రహం వల్ల జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. మేషరాశి వారు పగడం కెంపులు ధరించడం వల్ల వారి జీవితంలో పురోగతిని చూస్తారు. డబ్బు విషయంలో లేదా ఆర్ధికపరమైన విషయంలో అభివృద్ధి బాట పడతారు.
మేషరాశి వారు శాంతియుతమైన జీవితన్ని గడపాలన్నా కూడా వారు కెంపులు కానీ పగడాలు కానీ ధరించాలి. మేషరాశి వారికి ఎంత సహనం వుంటుందో అంతే కోపం కూడా వస్తుంది. ఆ కోపాన్ని అప్పటికప్పుడే ఎదుటి వారిపై ప్రదర్శిస్తూ వుంటారు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే కెంపులు కానీ లేదంటే పగడాన్ని కానీ వేసుకోవాలి. ఆతృతగా కాకుండా సున్నితంగా పనులను చక్కబెట్టాలన్నా, ఒత్తిడి లేకుండా పనులన్నీ సక్రమంగా పూర్తికావాలన్నా బంగారాన్ని కెంపుకు తొడికించి కుడి చేతికి లేదంటే ఎడమ చేతి ఉంగరపు వేలికి ధరించాలి.
గమనిక : పైన ఇచ్చిన వివరాలన్నీ ప్రమఖ జ్యోతిష్యుల నుంచి పండితుల నుంచి సేకరించినవి. వీటిని మేము ఎట్టి పరిస్థితుల్లో దృవీకరించము.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications