Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఎంతకీ పెళ్లి కావట్లేదా? ఈ రుద్రాక్షలను ధరించండి.. త్వరలోనే పెళ్లి ఖాయమవుతుంది
కొందరికి ఎంతకీ పెళ్లి కాదు. ఏదో ఒక కారణం వల్ల సంబంధాలు ఏవీ ఖాయం కావు. కొందరు సంవత్సరాల తరబడి ఎదురుచూసినా జీవిత భాగస్వామి దొరకడం కష్టంగా ఉంటుంది. చిన్న చిన్న కారణాల వల్ల కూడా పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయిపోతుంటాయి.
మరికొందరేమో వివాహం అయ్యాక అనేక ఇబ్బందులు పడుతుంటారు. దంపతుల మధ్య సాన్నిహిత్యం, అపార్థాలు చేసుకోవడం, తరచూ గొడవలు, కలహాలతో మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది. దీని వల్ల శారీరకంగా, మానసికంగా ఆనందంగా ఉండలేరు.

ఈ వివాహ సంబంధిత సమస్యలకు జ్యోతిష్య శాస్త్రం మంచి పరిష్కారం చెబుతోంది. వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు చేయడం వల్ల వివాహ సంబంధిత సమస్యలు తొలగిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఎంతకీ పెళ్లి కానివారు, పెళ్లయ్యాక రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్న వారు రుద్రాక్ష ధరిస్తే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నాయి శాస్త్రాలు. మరి ఎలాంటి రుద్రాక్ష ధరించాలి లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ గ్రహాల ప్రభావం వల్లే సమస్యలు:
అమ్మాయి అయినా, అబ్బాయి అయినా జాతకంలో వివాహానికి గురు గ్రహం అనుకూలత చాలా ముఖ్యం. అదే సమయంలో శని గ్రహంపై గురుగ్రహ ప్రభావం పడకూడదు. శని గ్రహం, దశ-మహాదశ, అంతర్దశ, సప్తమ శని, శని అంగారక దోషాల కారణంగా వివాహం సరైన సమయంలో జరగకుండా ఇబ్బందులు ఎదురవుతాయి.
శివునికి ప్రతిరూపం రుద్రాక్ష:
రుద్రాక్షను శివునికి ప్రతిరూపంగా చూస్తారు. రుద్రాక్ష ధరించడం వల్ల అదృష్టం వస్తుందని నమ్ముతారు. రుద్రాక్ష ధరించడం వల్ల ప్రతికూలతలు తొలగిపోయి అనుకూల ఏర్పడుతుందని, దీని వల్ల వివాహ సంబంధిత సమస్యలు దూరం అవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
గౌరీ శంకర రుద్రాక్ష:
రుద్రాక్షలో అనేక రకాలు ఉంటాయి. 1 నుంచి 21 ముఖాల వరకు రుద్రాక్షల్లో లభిస్తాయి. అయితే వివాహ సంబంధిత సమస్యలు తొలగిపోవాలంటే కొన్ని రకాల రుద్రాక్షలు ధరిస్తేనే ఫలితం ఉంటుంది. అందులో ముఖ్యమైనది.. గౌరీ శంకర రుద్రాక్ష. ఈ రుద్రాక్షను శివపార్వతుల ప్రతిరూపంగా పరిగణిస్తారు.
ఈ రుద్రాక్ష ధరించడం వల్ల ప్రతికూల సమస్యలు తొలగిపోయి త్వరగా వివాహం జరుగుతుంది. అలాగే వివాహ బంధంలో ఆనందాన్ని ఇస్తుంది. దీని వల్ల అడ్డంకులు, గ్రహ దోషాలు తొలగిపోతాయి. అయితే ఈ రుద్రాక్ష చాలా అరుదు. ఒకవేళ దొరికినా ఖరీదు ఎక్కువ.
ద్విముఖ రుద్రాక్ష:
రెండు ముఖాల రుద్రాక్షను ద్విముఖ రుద్రాక్షగా వ్యవహరిస్తారు. ఇది పెళ్లి కాని వారికి వరం లాంటిది. ఈ రుద్రాక్షను ధరించడం వల్ల వివాహ ఆటంకాలు తొలగిపోతాయి. త్వరగా పెళ్లి అయ్యేందుకు అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి. పెళ్లి అయిన వారు ధరిస్తే.. దాంపత్య బంధంలో శారీరక, మానసిక సంతోషం లభిస్తుంది.
చతుర్ముఖ రుద్రాక్ష:
నాలుగు ముఖాల రుద్రాక్ష వివాహ సంబంధం సమస్యలను తొలగిస్తుంది. ఇది వ్యక్తి యొక్క తెలివితేటలను, ఏకాగ్రతను పెంచుతుంది. జాతకంలో గ్రహాలు అనుకూలించకపోతే ఈ రుద్రాక్ష ధరించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. వివిధ సమస్యలతో వివిహం ఆలస్యం అవుతుంటే చతుర్ముఖ రుద్రాక్ష ధరించడం శ్రేయస్కరం.
షణ్ముఖ రుద్రాక్ష:
షణ్ముఖ రుద్రాక్ష అంటే ఆరు ముఖాలు కలిగినది అని అర్థం. ఈ షణ్ముఖ రుద్రాక్ష వివాహ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. త్వరగా పెళ్లి కావడానికి, పెళ్లయ్యాక ఆనందంగా ఉండటానికి ఈ షణ్ముఖ రుద్రాక్ష ధరించడం మంచిది.
సప్తముఖ రుద్రాక్ష:
ఏడు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల శని, అంగారక దోషాలు తొలగిపోతాయి. అలాగే గురుగ్రహ బలాన్ని అందిస్తుంది. ఏడు ముఖాల రుద్రాక్షను శని రుద్రాక్షగా కూడా పరిగణిస్తారు. శనిదోషాలు పోవడానికి ఎక్కువ మంది ధరిస్తుంటారు.
త్రయోదశ ముఖ రుద్రాక్ష:
13 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. ఈ రుద్రాక్ష జాతకంలో 7వ స్థానానికి బలాన్ని చేకూరుస్తుంది.
మీరు ఎదుర్కొనే సమస్యలు, రాశి, నక్షత్రం ఆధారంగా మీకు సరిగ్గా సరిపోయే రుద్రాక్షను ఎంచుకోవడానికి మంచి జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications