Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Astro tips: జనవరి 1న ఈ 3 పనులు చేస్తే ఏడాదంతా డబ్బులో మునిగిపోతారు!
కొన్ని రోజుల్లో కొత్త ఏడాది 2025లోకి ప్రవేశించబోతున్నాం. కొత్త సంవత్సరం గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉండాలని, అన్ని కష్టాలు,బాధలు తొలగిపోవాలని కోరుకుంటారు. కొత్త ఏడాదిలో ఇలా చేయాలి,అలా చేయాలి అని చాలామంది జనవరి 1వ తేదీన కొన్ని ప్రతిజ్ణలు కూడా చేస్తుంటారు. అయితే కొంతమంది వాటిని పాటించి మరుసటి ఏడాదికి మరికొన్ని కొత్త గోల్స్ సెట్ చేసుకుంటారు..మరికొందరు అయితే 1వ తేదీన చేసిన ప్రతిజ్ణలన్నీ ఫుల్లుగా తాగి 2వ తేదీనే మర్చిపోతారు. ప్రతి ఏడాది ఇది రొటీన్ గా జరిగే తంతే.
2024 కంటే 2025ని మెరుగ్గా మార్చాలనుకుంటే కొత్త సంవత్సరం మొదటి రోజున కొన్ని ప్రత్యేక మార్గాలను అనుసరించడం ద్వారా నూతన సంవత్సరాన్ని ప్రత్యేకంగా మార్చుకోవచ్చు. కొత్త ఏడాది మొదటి రోజున 3 పనులు కొన్ని పనులు చేయడం వల్ల సమస్యలు అంతం కావడమే కాకుండా ఇంట్లో సంతోషం,ఐశ్వర్యం పెరిగి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఏడాది పొడవునా డబ్బులో మునిగిపోతారంట. అయితే కొత్త సంవత్సరం మొదటి రోజున అంటే జనవరి1వ తేదీన ఏ మూడు పనులు చేస్తే అదృష్టం మీ తలుపు తడుతుందో,అన్ని సమస్యల నుండి బయటపడవచ్చో ఇప్పుడు చూద్దాం.

2025 జనవరి1వ తేదీన చేయాల్సిన 3 పనులు ఇవే
శివునికి ఈ నైవేద్యం పెట్టండి
కొత్త సంవత్సరం ప్రత్యేకతను సంతరించుకోవడానికి కొత్త సంవత్సరం మొదటి రోజున శివుడికి పాలతో అభిషేకం చేయాలని పండితులు తెలిపారు. దీంతో పాటు ధుత్ర పుష్పాలు, ధుత్ర పండ్లు శివుడికి సమర్పించడం బెటర్. శివలింగానికి భాంగ్ కూడా సమర్పించండి. భాంగ్ అనేది మొక్కల నుంచి తయారయ్యే పానియం. పరమ శివుడికి ఇష్టమైన పానియం భాంగ్ అని చెప్తుంటారు. ఈ సాంప్రదాయ పానీయాన్ని అనాధి కాలం నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిపే సమయంలోనూ సేవిస్తుంటారు. ఫీమేల్ గంజాయి మొక్కల ఆకులు, పువ్వులని ఒక మిశ్రమంగా తయారు చేసి దానిని పాలు, సుగంధ ద్రవ్యాలు, పంచదారతో కలిపి దీనిని చేస్తారు.
మంగళ గౌరీ పూజ
కొత్త సంవత్సరం మొదటి రోజున శివునితో మంగళ గౌరీని పూజిస్తే ఆ పూజ తర్వాత ఎర్రటి కంకణాలు సమర్పించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
హనుమంతుడిని పూజించండి
నూతన సంవత్సరం మొదటి రోజున హనుమంతుడికి పసుపు పచ్చని నైవేద్యం సమర్పించి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే అన్ని రోగాలు, కష్టాలు, సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం పెరిగి పాజిటివ్ ఎనర్జీ వెల్లివిరుస్తుందని పండితులు తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications