Latest Updates
-
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ!
టీ వలన 5 ఉత్తమమైన మరియు అందమైన ప్రయోజనాలు
టీ వలన అనేక మంది శక్తిని పొందుతున్నారు. ఈ తేనీరు చురుగ్గా ఉండటానికి ఒక ఉత్తమ ఔషధం. టీ మరియు కాఫీ వినియోగం వలన ఆరోగ్యం చెడిపోతుంది అని అంటారు, కాని గ్రీన్ టీ మరియు బ్లాక్ టీ వంటి టీ రకాలు తీసుకోవటం వలన ఆరోగ్యకరమైన ప్రభావాలు ఉంటాయి.
కానీ ఈ తేనీరు సేవించటం మీ చర్మం మరియు అందం కోసం మంచిది అని మీకు తెలుసా? అలసటతో ఉన్న మీ కళ్ళు, అలసటతో చిందరవందరగా ఉన్న మీ జుట్టు, మీరు టీ సేవించటం వలన అలసట తీరి మిమ్మలిని మరల చురుగ్గా ఉండేట్లుగా చేస్తుంది.
మీరు ఎల్లప్పుడూ చాయ్ త్రాగటం ఇష్టపడుతున్నారు ఎందుకంటే అది అనామ్లజనితం కాబట్టి-దీనిని సేవించటం వలన మీరు చాలా చురుగ్గా ఉండటానికి సహాయపడుతుంది. ఇక్కడ టీ వలన కలిగే లాభాలను కొన్నింటిని ఇస్తున్నాము.

1. ఇది ఒక గొప్ప మాయిశ్చరైజర్: పొడి చర్మం ఉన్నవారు కేవలం చల్లటి, గ్రీన్ టీని ముఖంపై చల్లుకోండి. ఇది ఒక గొప్ప రిఫ్రెషర్ మరియు మలినాలను తొలగిస్తుంది. ఇది చర్మానికి అందమైన మెరుపును ఇస్తుంది.
2. కళ్ళ క్రింద ఉబ్బులు తగ్గటానికి: మీరు ఉపయోగించిన టీ బ్యాగులను పారవేయవొద్దు. ఈ ఉపయోగించిన బ్యాగ్ ను ఫ్రిజ్ లో ఉంచి చల్లబరచండి. తరువాత దీనిని మీ కళ్ళ క్రింద ఉబ్బులున్న చోటులో ఉంచండి. ఇది చాలా సులభమైన గృహ వైద్యం. టీలో కెఫిన్ ఉన్నది. ఇది కళ్ళ క్రింద ఉన్న రక్తనాళాలు ముడుచుకుపోవటాన్ని తగ్గింస్తుంది, ఫలితంగా మీ కళ్ళ క్రింద ఉబ్బులు కూడా తగ్గుతాయి మరియు కళ్ళ క్రింద నల్లని వలయాలు కూడా తగ్గుతాయి.
3. ఇది మీ జుట్టును కాంతివంతంగా మరియు గట్టిపరుస్తుంది: బాగా జుట్టు పెంచాలనుకుంటున్నారా? మీ జుట్టును బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ ఉపయోగించి శుభ్రం చేసుకోండి. బ్లాక్ టీ జుట్టును చిట్లటం వంటి వాటిని తగ్గిస్తుంది మరియు గ్రీన్ టీ జుట్టు పెరుగుదలను ఉద్దీపన చేస్తుంది. కేవలం జుట్టుపైన చల్లటి టీని పోయండి మరియు పది నిముషాలవరకు అలానే వదిలేయండి. ఆ తర్వాత మీ జుట్టుకు షాంపూ మరియు కండిషన్ చేయండి.
4. పాదాల దుర్వాసనను వదిలించుకోండి : మీ పాదాల దుర్వాసనతో బాధపడుతున్నారా? కేవలం వాటిమీద డియోడరంట్ ను చల్లకండి, దీనిబదులు బ్లాక్ టీ ద్రావణంలో మీ పాదాలను ఉంచి నాననివ్వండి. టీ ఒక యాంటీ బాక్టీరియల్,అందువలన అది మీ పాదాల స్వేదాన్ని ఆపుతుంది మరియు దీనివలన మీ పాదాల దుర్వాసన ఆగుతుంది. మీ పాదాల రంధ్రాలను కూడా మూసివేస్తుంది.
5. పోస్ట్ షేవింగ్ తరువాత చర్మాన్ని సున్నితంగా ఉంచుతుంది : షేవ్ తరువాత మీ కాళ్ళు ఎరుపు మరియు దురదగా ఉంటున్నాయా? ప్రభావిత ప్రాంతంలో ఒక చల్లని, బ్లాక్ టీ బ్యాగ్ ను గట్టిగా నొక్కి ఉంచండి;ఉపశమనం లభిస్తుంది.



Click it and Unblock the Notifications
