Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మీ ఇంటి కోసం టాప్ 5 న్యూ ఇయర్ రిజల్యూషన్స్
మనము మన ఆరోగ్యం, బరువు, డబ్బు మరియు ఇతర విషయాలకు సంబంధించి కొత్త సంవత్సరంలో కొన్ని తీర్మానాలను చేసుకుంటూ ఉంటాము. కానీ ఎందుకు మనం ఎప్పుడూ ఇల్లును మాత్రం ఈ ముఖ్యమైన జాబితాలో చేర్చం? మీరు తప్పనిసరిగా 2015, కొత్త సంవత్సరంలో కట్టుబడి ఉండవలసిన కొన్ని తీర్మానాలను కొన్నిటిని ఇక్కడ ఇస్తున్నాము.
ప్రతి కొత్త సంవత్సరం కొత్త తీర్మానాలతో వస్తుంది. కాబట్టి ఈ సమయంలో కూడా, చాలా ఆహ్లాదకరమైన మరియు ఆశ్చర్యకరమైన కొత్త సంవత్సరం కొరకు ఎదురుచూద్దాము. మరియు మీరు ఈ జాబితాలో మీ తీర్మానాల 'గూడు'ను చేర్చాలి. అలంకరణ నుండి పరిశుభ్రత వరకు మరియు నిర్వహణ నుండి అభివృద్ధి వరకు, మీ ఇంటి కోసం మీ మనస్సులో అన్ని అంశాల తీర్మానాలు బయటకు వెల్లడించే ముందు సిద్ధంగా ఉంచుకోవటం అవసరం. దీనివలన మీ ఇల్లు స్థిరంగా ఉండటం మాత్రమే కాదు కానీ మీ జీవితం నుండి అనవసరమైన అయోమయస్థితిని కత్తిరించవేయబడుతుంది .
మేము మీ ఇంటి కోసం ముఖ్యమైన ఐదు కొత్త సంవత్సర తీర్మానాలను క్రింద ఇచ్చాము. మేము ఈ తీర్మానాలతోనే మీరు స్థిరంగా ఉండగలుగుతారు అని చెప్పబోవటం లేదు.కాని మీ ఇంటి కోసం తయారుచేసుకునే ఏ ఇతర ప్రణాళికకు ముందు, మీరు మనస్సులో ఈ విషయాలను ఉంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీ ఇంటి కోసం డబ్బు పొదుపు ఆలోచనలుగా కూడా ఇవి పనిచేస్తాయి.

పద్ధతీకరణ
మీ ఇంటి కోసం చేసుకునే ఉత్తమ నూతన సంవత్సరం తీర్మానాలు ఒక పద్ధతీకరణలో ఉంచుకోవాలి. మీ రోజువారీ ఉపయోగం ఉన్న వొస్తువులను ఒక క్రమంలో ఉంచుకోండి మరియు వ్యవస్థీకృతంగా ఉంచుకోండి. నెలలకొద్దీ మీ వంటగదిలో మరియు బెడ్ రూమ్ లో పేరుకొని ఉన్న చెత్తను తీసివేయండి. ఇంట్లో గాలి సహజంగా పారేట్లుగా ఉంచుకోండి.

ఒక పని తరువాత ఒకటి ముగించండి
సుదీర్ఘ ఆలస్యం చేస్తూ వొస్తున్న పనులను పూర్తి చేయండి. కేవలం మీరు ఏ విధంగా ప్రాజెక్టు పూర్తి చేయాలనుకున్నారో, ఆ విధంగా మీ వార్డ్రోబ్, కుటుంబం ఫోటోలు, శుభ్రంగా, కళాత్మకంగా అమర్చుకోండి. మీరు మొదట చిన్న పనులను పూర్తి చేయండి మరియు అప్పుడు ప్రతి నెల పెద్ద వాటిని షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయవొచ్చు.

భద్రత చెక్
మీ ఇంటికి ఉన్న భద్రతను విశ్లేషించండి. తీగలు, విద్యుత్ పరికరాలు, తాళాలు మరియు వాటిని చాలాకాలం నుండి వినియోగించనట్లయితే, వాటిని తిరిగి వినియోగించేట్లుగా చూసుకోండి. తరువాత పశ్చాతాపం పడేకంటే మొదటే వాటిని ఎప్పుడూ సురక్షితంగా చూసుకోవటం ఉత్తమం.

బడ్జెట్
క్రిస్మస్ మరియు నూతన సంవత్సర పార్టీ కారణంగా, మీ బడ్జెట్ ఆకాశాన్ని అంటుకుని ఉండి ఉండాలి. ఇప్పుడు మీ ఆర్ధికపరిస్థితి మీద ఒక కన్ను వేసి ఉంచవలసిన సమయం. ఎటువంటి వెర్రి ఖర్చు పెట్టవొద్దు. కరెంట్ బిల్లులు కట్ చేయండి. దీనిని మీరు లైట్ బల్బ్స్ మార్చటం వలన, విద్యుతు గృహోపకరణాలను వాడకుండా ఉండటం వలన మరియు వాడుకలో లేనప్పుడు లైట్లు ఆఫ్ చెయ్యటం ద్వారా చేయవచ్చు.

నిర్వహణ మరియు క్లీనింగ్
ఈ మాటలు వినటానికి బోరింగ్ గా ఉండవొచ్చు, కానీ శుభ్రంగా ఉంచుకోవటానికి మరియు ఇంటి నిర్వహించుకోవటానికి ఒక ప్రణాళికను అమలుపరుచుకోవటం ఉత్తమం. మీకున్న సమయాన్ని బట్టి, పక్షానికి, వారానికి గాని లేదా నెలకోసారి షెడ్యూల్ ప్రకారం ఇంటిని శుభ్రం చేసుకోండి. మీరు ఒకసారి ప్రణాళిక వేసుకుంటే, దాని ప్రకారం నడవండి. ఈ చిన్న కొత్త సంవత్సర తీర్మానాలు మీ ఇంటిని సమర్థవంతంగా, అందంగా మరియు సురక్షితంగా నిర్వహించటంలో సహాయపడతాయి.



Click it and Unblock the Notifications