హోంమేడ్ ఫేస్ ప్యాక్స్ తో తళతళా మెరిసిపోండిలా.. !

By Super

తీయని పదార్ధాలు మీ చర్మానికి నిగారింపునిస్తాయి. అర్ధం కాలేదా?? ఈరోజు మనం ఇంట్లో తయారు చేసుకుని వేసుకునే ఫేస్ మాస్కుల గురించి తెలుసుకుందాము. ఇవి మీ చర్మానికి సహజంగా మృదుత్వాన్ని కలుగచేసి కాంతినిస్తాయి.

వీటిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇవి పూర్తిగా సహజ సిద్ధమైన దినుసులతో ఉండి, ఎటువంటి దుష్ఫలితాలూ లేకపోవడమే కాకుండా మీ చర్మం సెన్సిటివ్ అయినా కూడా మీ చర్మానికి సరిపడతాయి.

సహజమైన పదార్ధాలని మాస్కులలో కలపడం వల్ల మాస్కు మందంగా అయ్యి మరింత ప్రభావవంతంగా మారుతుంది. యాక్నే లేదా మచ్చలు లాంటి సమస్యలతో బాధ పడుతున్నవారు ఈ మాస్కులని తరచూ వేసుకోవడం వల్ల మీ చర్మం ప్రకాశవంతంగా మారుతుందని నిపుణుల సూచన. ఇవి మీ స్కిన్ టోన్ ని ప్రకాశవంతం చేస్తాయి కూడా. మరి మీ చర్మాన్ని మెరిపించే 10 స్వీట్ మాస్కులని చూద్దామా??


గ్రేప్ వైన్ మాస్క్

గ్రేప్ వైన్ మాస్క్

3 టేబుల్‌స్పూన్ల రెడ్ వైన్,ఒక గ్రుడ్డు సొన మరియు ఒక గ్రుడ్డు.వీటినన్నింటినీ కలిపి బ్రష్ సహాయంతో మీ ముఖం మీద ఒక పొర లాగ వేసుకోవాలి.ముఖం మీద సహజం గా ఆరనిచ్చి వెచ్చటి నీటితో కడుక్కుని ఒక మెత్తటి టవల్‌తో ముఖాన్ని అద్దుకోవాలి.

టమాటా మాస్క్

టమాటా మాస్క్

1 టేబుల్‌స్పూన్ తేనె,1 టీస్పూన్ గ్రుడ్డు తెల్ల సొన, 1/2 టీస్పూన్ నిమ్మ రసం,1/3 కప్ పెరుగు, 3 టేబుల్‌స్పూన్ల టమాటా ప్యూరీ.వీటినన్నింటినీ కలిపి ముఖానికి పూయండి. ఇలా 10 రోజులు చేస్తే మీ ముఖంలో మార్పు మీరే గమనిస్తారు.దీనివల్ల మీ ముఖం సహజ సిద్ధంగా కాంతులీనుతుంది.

అవకాడో మాస్క్

అవకాడో మాస్క్

1/2 కప్పు అవకాడో గుజ్జు,1 టేబుల్‌స్పూన్ యాపిల్ జ్యూస్, 1 తీస్పూన్ బ్రౌన్ రైస్ ఫ్లోర్.ఒక అవకాడోని ఫోర్కుతో బౌల్‌లో వేసి మెత్తగా మెదపండి.దీనిలో రైస్ ఫ్లోర్ వేసి మెత్తటీ పేస్టులా అయ్యేవరకూ కలపాలి.కాస్త యాపిల్ జ్యూస్ వేసి కలిపి ముఖానికి ఈ మాస్క్ వేసుకుని ఆరనివ్వాలి.తరువాత వెచ్చటి నీటితో కడుక్కుని ఒక మెత్తటి టవల్‌తో ముఖాన్ని అద్దుకోవాలి.

చామంతి మాస్క్

చామంతి మాస్క్

1/2 కప్పు పుదీనా పేస్టు,1 టేబుల్‌స్పూన్ చామంతి టీ, 1 టీస్పూను దోస గుజ్జు.వీటన్నింటినీ బాగా కలిపి శుభ్రమైన ముఖం మీద ప్యాక్ లాగ వేసి ఆరనిచ్చి చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.

దోస మాస్క్

దోస మాస్క్

మీ చర్మం సహజ సిద్ధంగా మెరవాలంటే దోసకాయ సగం, కొన్ని పుదీనా ఆకులూ కావాలి.వీటిని మిక్సీలో వేసి మెత్తగా నూరి ఒక దూదిని దీనిలో ముంచి మీ కళ్ళ చుట్టూ అద్దాలి. 20 నిమిషాల తరువాత కడిగెయ్యాలి.

హనీ మాస్క్

హనీ మాస్క్

1/2 కప్పు దోస గుజ్జు,1 టేబుల్‌స్పూన్ తేనె, 1 టేబుల్‌స్పూన్ పెరుగు లేదా గ్రీక్ యోగర్ట్.వీటినన్నింటినీ కలిపి మెత్తగా పేస్టులా చేసి సన్నటి బ్రష్‌తో ముఖానికి ప్యాక్‌లాగ వేయాలి.ఆరాకా గోరువెచ్చటి నీటితో ముఖం కడుక్కోవాలి.

ఆరెంజ్ మాస్క్

ఆరెంజ్ మాస్క్

ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ తొక్కలపొడికి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్‌స్పూన్ తేనె కలపాలి.దీనిని మేకప్ బ్రష్ లేదా ఇతర బ్రష్ ఉపయోగించి ముఖానికి పూసి ఆరాకా నీటితో కడుక్కోవాలి.

కొబ్బరి మాస్క్

కొబ్బరి మాస్క్

4 టేబుల్ స్పూన్ల తురిమిన కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ రాయల్ జెల్లీ,1 టేబుల్ స్పూన్ వనిలా ఫ్లేవర్ కలగలిసిన ఆల్మండ్ మిల్క్. వీటన్నింటినీ కలిపి ముఖం, మెడ మీద వేసి ఆరనిచ్చి 15 నిమిషాల తరువాత కడుక్కుని మెత్తటి బట్టతో అద్దుకోవాలి.

ఓట్‌మీల్ మాస్క్

ఓట్‌మీల్ మాస్క్

ఈ మాస్కు రాత్రి పూట ముఖానికి వేసుకోవాలి.1/2 కప్పు వేడి నీరు,1/3 కప్ ఓట్‌మీల్,2 టేబుల్స్పూన్ల పెరుగు,2 టేబుల్‌స్పూన్ల తేనె, ఒక గ్రుడ్డు తెల్ల సొన.మొదట వేడి నీటిలో ఓట్‌మీల్ వేసి రెండు నిమిషాలాగి మిగతా పదార్ధాలని వేయాలి.ముఖం మీద ఈ మాస్క్ వేసుకుని 15 నిమిషాల తరువాత కడిగేసుకుంటే తెల్లవారి లేచేసరికి మెరిసే చర్మం మీ సొంతం.

చాక్లెట్ మాస్క్

చాక్లెట్ మాస్క్

1/3 కప్పు డార్క్ చాక్లెట్ పౌడర్,1/4 కప్ తేనె,3 టేబుల్ స్పూన్ల హెవీ క్రీం, 2 టేబుల్‌స్పూన్ల మెత్తటీ ఓట్‌మీల్.అన్నిటినీ కలిపి మెత్తటి పేస్టులా చేసి ముఖానికి వేసి 15 నిమిషాలు ఆరనివ్వాలి.గోరు వెచ్చటి నీటితో కడిగి ముఖాన్ని మెత్తటి బట్టతో అద్దుకోవాలి.


Desktop Bottom Promotion