For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సహజసిద్ధమైన పసుపు ఫేస్ మాస్క్ లను, మీ అందమైన స్కిన్ కోసం వాడండి !

పసుపు ఫేస్ మాస్క్ లను, మీ అందమైన స్కిన్ కోసం వాడండి.పసుపును "గోల్డెన్ స్పైస్ ఆఫ్ లైఫ్" గా పిలుస్తారు ఎందుకంటే, భారతదేశ ఔషధాల తయారీలో పురాతనకాలం నుంచి పసుపును ఉపయోగించబడుతున్నది.

|

పసుపును "గోల్డెన్ స్పైస్ ఆఫ్ లైఫ్" గా పిలుస్తారు ఎందుకంటే, భారతదేశ ఔషధాల తయారీలో పురాతనకాలం నుంచి పసుపును ఉపయోగించబడుతున్నది. దగ్గు, సైనసిటిస్, డయాబెటిక్, గాయాలు, అనోరెక్సియా (ఆకలి లేకపోవటం) వంటి మొదలైన వ్యాధులకు చికిత్సను చేయడంలో పసుపును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

పసుపును కేవలం మసాలాగా ఉపయోగించడమే కాకుండా, మృదువైన - ప్రకాశవంతమైన చర్మం కోసం సమయోచితంగా ఉపయోగించగల అద్భుతమైన సహజ-చర్మ సంరక్షణా వస్తువుగా కూడా మంచి పేరును పొందింది.

turmeric beauty benefits in telugu

సుగంధం గా ఉపయోగించకుండా వేరుగా ఉన్న పసుపు, మృదువైన ప్రకాశవంతమైన చర్మం కోసం సమయోచితంగా ఉపయోగించగల అద్భుతమైన సహజ-చర్మ సంరక్షణా వస్తువు. మోటిమలను, బ్లాక్ హెడ్స్, జిడ్డుగల చర్మం, పొడి చర్మం, ఎరుపుదనం, దద్దుర్ల వంటి మొదలైన రకాల చర్మ సమస్యలను నివారించడానికి పసుపును ఇతర పదార్థాలతో కలిపినప్పుడు అద్భుతమైన ఫేస్-ప్యాక్లా కూడా మారుతుంది.

భారతదేశంలో, పెళ్లికి ముందు వధు-వరూలిద్దరి చర్మము మరింత కాంతివంతంగా ఉండటం కోసం, పసుపును అప్లై చేస్తారు. పసుపులో యాంటిసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియ, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది, ఇవన్నీ అద్భుతమైన ఫేస్ ప్యాక్లా ఉండి చర్మ సంరక్షణకు సహాయపడతాయి.

కాబట్టి, ఈరోజు ఈ ఆర్టికల్ ద్వారా పసుపుతో ఇతర పదార్ధాలను కలిపి మీ ఇంట్లోనే సులభంగా, చవకగా చేసుకోగల ఫేస్-ప్యాక్లను గూర్చి మీకు తెలియజేస్తున్నాము. ఈ ఫేస్-ప్యాక్లు మీరు కోరుకున్న ఫలితాలను అందించగలదని మేము మీకు ఖచ్చితంగా చెప్పగలం. అవి ఏమిటో మీరు ఒకసారి చూడండి.

1. పసుపు, తేనె, పాలతో చేసిన ఫేస్-మాస్క్ :

1. పసుపు, తేనె, పాలతో చేసిన ఫేస్-మాస్క్ :

తేనె, మీ చర్మానికి పోషణను అందించి, హైడ్రేట్గా ఉంచి, మీ చర్మాన్ని మృదువుగా - కోమలంగా చేస్తుంది. ఈ ఫేస్-ప్యాక్లో గొప్ప యాంటిసెప్టిక్, యాంటీబాక్టీరియ లక్షణాలను కలిగి ఉండడం చేత మోటిమలను కలుగజేసే బాక్టీరియాను నిర్మూలించడానికి సహాయపడతాయి. తేనె చర్మానికి సంబంధించిన డిస్కలెరేషన్స్, మచ్చలు, మొటిమలు మొదలైన వాటిని తొలగిస్తుంది, అలాగే ఇది చర్మాన్ని లోతు నుంచి శుభ్రపరుస్తుంది మరియు సూర్యరశ్మి నుంచి చర్మాన్ని పాడవకుండా చేస్తుంది.

చర్మపోషణకు, చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడే వివిధ ఖనిజాలను, విటమిన్లను పాలు కలిగి ఉంటుంది. ఇది నెమ్మదిగా చనిపోయిన చర్మం కణాలను తొలగించి, కఠినమైన చర్మాన్ని నునుపుగా చేస్తుంది. ఇది అకాల వృద్ధాప్యమును, పెద్దగా ఉన్న చర్మరంధ్రాలను కూడా తగ్గిస్తుంది.

తయారికి కావలసిన పదార్ధాలు :

పసుపు పొడి - ¼ టీస్పూన్.

ముడి తేనె యొక్క - 1 టీస్పూన్.

పచ్చి పాలు - 1 టీస్పూన్.

ఎలా ఉపయోగించాలి:

ఎలా ఉపయోగించాలి:

• క్లీన్సర్తో మీ ముఖాన్ని సున్నితంగా శుభ్రపరచాలి.

• ఇప్పుడు, మీ ముఖమును గోరువెచ్చని నీటితో కడగాలి, తద్వారా మీ చర్మరంధ్రాలు బయటకు తెరచి, పోషక పదార్ధాలను గ్రహించగలవు. ఆతర్వాత మీ ముఖాన్ని శుభ్రం చేయడానికి టవల్తో శుభ్రం చేయండి.

• ఒక గిన్నెలో, పైన చెప్పిన అన్ని పదార్ధాలను చేర్చి బాగా కలపాలి.

• ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని శుభ్రమైన మీ చేతివేళ్ళతో, మీ ముఖం మీద పలుచని ఫేస్-మాస్క్లా ముఖం మొత్తానికి అప్లై చేయండి. ఆ ఫేస్-ప్యాక్ను అలాగే ఒక 10 నిమిషాల పాటు ఉంచాలి (లేదా) ఆ ఫేస్-ప్యాక్ను పూర్తి పొడిగా మారే వరకు వేచి చూడాలి.

• మీ ముఖాన్ని క్లీన్సర్ సహాయంతో శుభ్రపరిచేందుకు చల్లని నీటిని ఉపయోగించాలి.

• ప్రకాశించే చర్మం కోసం మీరు ఈ ప్రక్రియను వారానికి ఒకసారి రిపీట్ చేయండి.

2. పసుపు, అవోకాడో, పెరుగులతో చేసిన ఫేస్-మాస్క్ :

2. పసుపు, అవోకాడో, పెరుగులతో చేసిన ఫేస్-మాస్క్ :

అవోకాడలో విటమిన్ E, సహజసిద్ధమైన ఆయిల్స్, కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది, ఇది చర్మాన్ని హైడ్రేట్గా ఉంచి, చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. యవ్వనమైన, ఆరోగ్యకరమైన చర్మంను ప్రోత్సహించే యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-ఏజింగ్కు సంబంధించిన లక్షణాలను ఇది కలిగి ఉంటుంది.

పెరుగులో విటమిన్ B, జింక్, కాల్షియములను కలిగి ఉంటుంది, అవి మీ చర్మాన్ని పోషించి, హైడ్రేట్గా ఉంచి, మీ చర్మాన్ని మృదువుగా కోమలంగా ఉంచడంలో సహాయపడుతుంది. పెరుగులో ఉన్న ప్రత్యేక గుణాలు, అలాగే యాంటీ-బాక్టీరియ వంటి లక్షణాలు మోటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడానికి సహాయపడతాయి.

తయారీకి కావలసిన పదార్థాలు :

• పసుపు పొడి - ¼ టీస్పూన్.

• అవోకాడో - 1 టేబుల్ స్పూన్

• తాజా పెరుగు 1 టీస్పూన్.

ఎలా ఉపయోగించాలి:

ఎలా ఉపయోగించాలి:

• అవోకాడోను బాగా నూరి,మెత్తని పేస్ట్లా చేయండి.

• పైన పేర్కొన్న పదార్ధాలను బాగా కలపండి.

• తేలికపాటి క్లీనర్తో మీ ముఖాన్ని బాగా శుభ్రపరచండి.

• మీ ముఖానికి పూర్తిగా ఈ ఫేస్ ప్యాక్ను అప్లై చేసి, ఒక 10 నిమిషాల పాటు అలానే వదిలివేయండి.

• ఆ తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని శుభ్రంగా కడిగి, ఒక శుభ్రమైన టవల్తో మీ ముఖాము పొడిగా మారేలా చేయండి.

• ప్రకాశవంతమైన చర్మం కోసం వారంలో ఒక్కసారి ఈ ఫేస్-ప్యాక్ను ఉపయోగించండి.

3. పసుపు, నిమ్మ, తేనెలతో చేసిన ఫేస్-మాస్క్ :

3. పసుపు, నిమ్మ, తేనెలతో చేసిన ఫేస్-మాస్క్ :

నిమ్మకాయ ఒక సహజ రక్తస్రావ-నివారిణి; జిడ్డైన & మొటిమలు గల చర్మం కోసం ఇది చాలా బాగా పనిచేస్తుంది. నిమ్మకాయ చర్మరంధ్రాలను బిగించి మొటిమలను, వైట్ హెడ్స్, మచ్చల వంటి మొదలైన వాటిని తొలగించటానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని లోపలి వైపు నుండి శుభ్రపరుస్తుంది, ఆయిల్ చర్మాన్ని మరింత కాంతివంతంగా మెరుగుపరుస్తుంది.

తేనె, చర్మమును తేమగా ఉంచి మొటిమలను & మచ్చలను తగ్గిస్తుంది. ఇది ముడుతలను, వదులైన చర్మానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది.

తయారికి కావలసిన పదార్ధాలు :

• పసుపు పొడి - ¼ టీ టీస్పూన్.

• నిమ్మరసం - ½ టీస్పూన్

• ముడి తేనె - 1 టేబుల్ స్పూన్

ఎలా ఉపయోగించాలి:

ఎలా ఉపయోగించాలి:

• ఒక గిన్నెలో, పైన తెలిపిన అన్ని పదార్ధాలను కలపాలి. అలా ఒక మిశ్రమంగా తయారుచేసుకునేటప్పుడు అందులో కొద్దిగా గోధుమ (లేదా) బియ్యం పిండిని కలుపుకోవాలి.

• మీ ముఖం మీద ఈ మిశ్రమాన్ని అప్లై చేయడానికి ముందు మీ ముఖాన్ని బాగా శుభ్రపరచుకోవాలి.

• శుభ్రమైన ఫేస్ బ్రష్ (లేదా) చేతివేళ్ల సహాయంతో, మీ ముఖం మీద ఈ మిశ్రమాన్ని అప్లై చేసి, ఒక 10 నిముషాల పాటు బాగా ఆర నివ్వాలి.

• ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్రంగా కడగాలి.

• కాంతివంతమైన ముఖం కోసం వారానికి ఒకసారి ఈ ఫేస్ ప్యాక్ ను ఉపయోగించండి.

4. పసుపు, శనగపిండి, రోజ్ వాటర్లతో చేసిన ఫేస్ మాస్క్ :

4. పసుపు, శనగపిండి, రోజ్ వాటర్లతో చేసిన ఫేస్ మాస్క్ :

చర్మం నుండి అధికంగా ఉత్పత్తి అయ్యే ఆయిల్ను శనగపిండి గ్రహిస్తుంది, మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపి, చర్మము నుంచి ఉత్పత్తి అయ్యే ఆయిల్ ను నియంత్రిస్తుంది. చర్మానికి హాని కలిగించే దుమ్ము, ధూళిని మరియు ఇతర వ్యర్థాలను తొలగించి చర్మానికి సహజమైన కాంతిని చేకూరుస్తుంది. చర్మము pH స్థాయిని నిర్వహించడానికి - శనగపిండిలో ఉండే ఆల్కలీన్ లక్షణాలు దోహదపడతాయి. అలాగే ఇది చర్మాన్ని తగిన పోషణను అందించి, మృదువుగా & కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుంది. చనిపోయిన చర్మకణాలు తొలగించి వాటి స్థానంలో కొత్త కణజాల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తోంది.

చర్మపు చికాకు వల్ల కలిగే ఎరుపుదానానికి కారణమైన మొటిమలను, దుమ్ము, ధూళిని, అలాగే చర్మం నుండి ఉత్పత్తి కాబడి ఆయిల్ను తగ్గించడానికి రోజ్ వాటర్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సహాయపడతాయి. రోజ్ వాటర్, చర్మం యొక్క pH స్థాయిని కూడా బాగా నిర్వహిస్తుంది.

తయారికి కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ - పసుపు పౌడర్.

• 2 టేబుల్ స్పూన్ల - శనగపిండి

• 1 - 2 టేబుల్ స్పూన్ల రోజు వాటర్.

ఎలా ఉపయోగించాలి:

ఎలా ఉపయోగించాలి:

• ఒక గిన్నెలో, అన్ని పదార్ధాలను కలిపి, మెత్తని పేస్ట్గా తయారు చేయండి.

• తేలికపాటి క్లీన్సర్తో మీ ముఖాన్ని కడిగి, ఈ ఫేస్ ప్యాక్ను మీ ముఖం మీద అప్లై చేయడం.

• ఇప్పుడు, 10-15 నిమిషాల వరకూ మీ ముఖాన్ని అలానే వదిలివేయండి.

• ఆ తర్వాత చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసి, ఒక పొడి బట్టతో మీ చర్మాన్ని శుభ్రంగా తుడవాలి.

• మీ ముఖంపై పింపుల్స్, మొటిమలను పూర్తిగా నివారించడం కోసం వారంలో రెండుసార్లు ఈ ప్యాక్ను ఉపయోగించండి.

5. పసుపు, పెరుగు, టమటోతో చేసిన ఫేస్ మాస్క్ :

5. పసుపు, పెరుగు, టమటోతో చేసిన ఫేస్ మాస్క్ :

హానికరమైన UV కిరణాలు చర్మంపై ఎరుపుదానానికి, బొబ్బలకు కారణమవుతాయి. పెరుగులో ఉండే అద్భుతమైన లక్షణాలు మీ చర్మానికి ఉపశమనాన్ని కలిగించడంలో సహాయం చేస్తుంది అలాగే సూర్యరశ్మి బారి నుండి చర్మాన్ని రక్షిస్తుంది. టొమాటోలు సన్ స్క్రీన్ గా పనిచేసే యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, చర్మ కణాల నష్టాన్ని చేకూర్చే వాడితో వ్యతిరేకంగా పోరాడటంలో ఇది సహాయపడుతుంది.

తయారీకి కావల్సిన పదార్థాలు :

• పసుపు పొడి - 1/4 టేబుల్ స్పూన్

• పెరుగు - 1 టేబుల్ స్పూన్

• టమోట రసం - 1 టేబుల్ స్పూన్

ఎలా ఉపయోగించాలి:

ఎలా ఉపయోగించాలి:

• ఒక గిన్నెలో అన్ని పదార్థాలను వేసి వాటిని సరిగా కలపాలి.

• ముఖానికి ఈ ముసుగు అప్లై చేసే ముందు ఒక తేలికపాటి ప్రక్షాళనతో మీ ముఖం కడగాలి

• మిశ్రమాన్ని మీ ముఖం మీద వేసి, 10-15 నిమిషాల పాటు వదిలివేయండి.

• చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రపరచాలి.

English summary

DIY Turmeric Face Mask For Beautiful Skin

Turmeric is an age-old remedy for skin care and to treat any type of health issues. Turmeric, when combined with different ingredients, will make an amazing face pack to treat different kinds of skin problems, like acne, blackheads, oily skin, etc. Some of the best ingredients that can be combined with turmeric is honey, milk, avocado, etc.
Story first published:Tuesday, March 27, 2018, 17:54 [IST]
Desktop Bottom Promotion