For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గేందుకు ఉపయోగపడే మ్యాంగో డైట్ ప్లాన్

ఈ కాలంలో మామిడి పండ్లు పుష్కలంగా దొరుకుతాయి. అవునండి, మేము పండ్లకు రాజైన మామిడి పండు గురించే మాట్లాడుతున్నాము. ఏడాది మొత్తం వేసవి కాలంలో వచ్చే మామిడి పండ్ల కోసం ఎదురుచూసే వారు కూడా ఉన్నారు.

|

ఇది వేసవి కాలం. ఈ కాలంలో మామిడి పండ్లు పుష్కలంగా దొరుకుతాయి. అవునండి, మేము పండ్లకు రాజైన మామిడి పండు గురించే మాట్లాడుతున్నాము. ఏడాది మొత్తం వేసవి కాలంలో వచ్చే మామిడి పండ్ల కోసం ఎదురుచూసే వారు కూడా ఉన్నారు. మామిడి పండు రుచి అంత గొప్పది. వేసవి కాలంలో వేసవి వేడిని మరచిపోయేలా మామిడి మైమరపించివేస్తుంది.

మామిడి పండ్ల ద్వారా ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు జరుగుతుంది. బరువు తగ్గేందుకు కూడా ఈ పండు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు బరువు తగ్గాలని అనుకుంటే మామిడి పండుని పరిగణలోకి తీసుకోవడం మరచిపోకండి. ఈ ఆర్టికల్ లో మ్యాంగో డైట్ ప్లాన్ ద్వారా బరువును ఏ విధంగా తగ్గించుకోవచ్చో తెలియచేస్తాము.

మ్యాంగో డైట్ ప్లాన్ లో మామిడి పండ్లను ఏ విధంగా తీసుకోవాలో వివరించడం జరుగుతుంది. మామిడి పండ్లలో విటమిన్స్ తో పాటు మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఫోలేట్, విటమిన్ ఏ, విటమిన్ బి6 మరియు విటమిన్ సి ఇందులో లభ్యమవుతాయి. అందువలన మామిడి పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే.

మామిడి పండ్లలో వివిధ మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. అలాగే, ఇందులో బీటా కెరోటిన్ తో పాటు ఫైబర్(పెక్టిన్) లభిస్తుంది. దీని వలన, కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. అధ్యయనాల ప్రకారం మామిడి పండును తీసుకోవడం ద్వారా లోయర్ బ్లడ్ ప్రెషర్ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలుస్తోంది. అలాగే క్యాన్సర్ పై పోరాడే గుణం మామిడి పండులో గలదు. మామిడి పండులో విటమిన్ కే లభిస్తుంది. ఇది కేల్షియం ను గ్రహించి ఎముకల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.

మ్యాంగో డైట్ ద్వారా బరువును ఏ విధంగా తగ్గించుకోవచ్చు?

మ్యాంగో డైట్ ద్వారా బరువును ఏ విధంగా తగ్గించుకోవచ్చు?

మామిడి పండు వంటి ఫ్రూట్స్ లో ఎనర్జీ డెన్సిటీ తక్కవగా ఉంటుంది. కేలరీలు తక్కువగా లభిస్తాయి. అందువలన, సులభంగా బరువును తగ్గించుకోవచ్చు. తక్కువ కేలరీలు లభించే ఫ్రూట్స్ ను తీసుకోవడం ద్వారా ఆకలిని తీర్చుకోవచ్చు. ఎనర్జీ డెన్సిటీ ఎక్కువగా లభించే ఫ్రూట్స్ ను తీసుకోవడం కంటే లోఎనర్జీ డెన్సిటీ ఫ్రూట్స్ ను తీసుకోవడం మంచి ఎంపిక. మామిడి పండ్లలో ఒక గ్రాముకు 0.6 కేలరీలు లభిస్తాయి. అందువలన, ఇది ఎనర్జీ డెన్సిటీ తక్కువ కలిగిన ఫ్రూట్స్ కోవలోకి వస్తుంది.

అలాగే, మామిడి పండ్లలో ఫైబర్ లభిస్తుంది. ఇది బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. ఫైబర్ అనేది కడుపు నిండిన భావనను ఎక్కువ సేపు కలిగిస్తుంది. అందువలన, క్రేవింగ్స్ తగ్గుతాయి. ఈ ఫ్రూట్ అనేది కార్బోహైడ్రేట్స్ మరియు ఫ్యాట్ వంటి మ్యాక్రో న్యూట్రియెంట్ గ్రహింపును తగ్గిస్తుంది. తద్వారా, బరువును సులువుగా తగ్గించుకోవచ్చు.

ఒక కప్పుడు మామిడి పండులో 2.6 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. ఇది రోజువారీ ఫైబర్ సిఫార్సు విలువలో పదిశాతం వరకు ఉంటుంది.

మ్యాంగో డైట్ ప్లాన్ అనేది మీ మీల్ ప్లాన్ కి అనుగుణంగా ఉంటుంది. అయితే, కేలరీలు మాత్రం మామిడి పండు నుంచే అందుతాయి. సరైన మోతాదులో తీసుకుంటే మామిడి పండు వలన బరువును ఆరోగ్యకరమైన పద్దతిలో తగ్గించుకోవచ్చు. ఎందుకంటే, మామిడి పండులో ఫ్రక్టోస్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని మితంగా తీసుకోవాలి.

మామిడి పండులో బరువును ఏ విధంగా తగ్గవచ్చు?

మామిడి పండులో బరువును ఏ విధంగా తగ్గవచ్చు?

మామిడి పండులో ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇవి ఫ్యాట్ సెల్స్ విస్తరణను అడ్డుకుంటాయి. ఈ ప్రాసెస్ వలన బరువు పెరగడం అదుపులో ఉంటుంది. అలాగే, మామిడి పండులో మాలిక్ మరియు టార్టారిక్ యాసిడ్ లభిస్తాయి. ఈ రెండూ శరీరాన్ని ఆల్కలైన్ గా ఉంచుతాయి. దాంతో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన బరువు పెరగడమనే సమస్య వేధించదు. అలాగే ఇది ర్యుమటాయిడ్ ఆర్తరైటిస్ ను అరికడుతుంది. అలాగే, మామిడి పండు అనేది మీ శరీరాన్ని డిటాక్సిఫై చేసేందుకు తోడ్పడుతుంది. ఈ ప్రక్రియలో శరీరంలో పేరుకున్న టాక్సిన్స్ ను తొలగిస్తుంది. మామిడి పండులో లభ్యమయ్యే ఫైబర్ కంటెంట్ అనేది శరీరంలోని ఇంటస్టినల్ వాల్స్ ను అంటుకుని ఉన్న మల పదార్థాన్ని పూర్తిగా తొలగిస్తుంది.

అలాగే, మామిడి పండ్లలో లైకోపీన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది వెయిట్ లాస్ కు తోడ్పడే నేచురల్ యాంటీ ఆక్సిడెంట్. మామిడి పండు వలన బెల్లీ ఫ్యాట్ సమస్య తొలగిపోతుంది. అలాగే, వీటిలో లభించే నేచురల్ ప్రో బయాటిక్స్ వలన మీ గట్ హెల్త్ కూడా బాగుంటుంది. తద్వారా, మూడ్ అనేది మెరుగవుతుంది.

మామిడి పండులో లభించే ఫైబర్ అనేది నేచురల్ కార్బోహైడ్రేట్ బ్లాకర్ గా పనిచేసి బ్లడ్ షుగర్ లెవల్స్ ని స్టేబుల్ గా ఉంచేందుకు తోడ్పడుతుంది.

మామిడి పండును ఎలా తీసుకోవడం వలన బరువును తగ్గుతారు?

మామిడి పండును ఎలా తీసుకోవడం వలన బరువును తగ్గుతారు?

మామిడి పండు మాత్రమే కలిగిన డైట్ ను తీసుకోవడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదని స్వయానా పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు మామిడి పండ్లను రెండు లేదా మూడు సెర్వింగ్స్ ను తీసుకోమని వారు సూచిస్తున్నారు. అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే, సిట్రస్ మరియు డైరీ ప్రోడక్ట్స్ తో మామిడి పండ్లను తీసుకోకూడదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం మామిడి పండ్లను రోజులోని ప్రథమార్థంలో తీసుకోవడం మంచిది. ముఖ్యంగా మిడ్ మార్నింగ్ లో దీనిని తీసుకుంటే మంచిది. ఈ సమయంలో బీఎంఆర్ (బాసల్ మెటబాలిక్ రేట్) అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మామిడి పండును వేరే మీల్ తో కలిపి తీసుకోకూడదు.

మామిడి పండును మాత్రమే తీసుకునే డైట్ లో ఎన్నో ప్రతికూలతలు కలవు. ఇది ఎన్నో పోషకాహార లోపాలకు దారితీస్తుంది. అలాగే మెటబాలిక్ రియాక్షన్స్ అనేవి దెబ్బతింటాయి కూడా.

మామిడి పండును తీసుకోవడం వలన కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు

మామిడి పండును తీసుకోవడం వలన కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు

మామిడి పండులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎన్నో వ్యాధులను అరికట్టేందుకు తోడ్పడతాయి. శరీరం పనితీరు సజావుగా ఉండేందుకు తోడ్పడతాయి. మీడియం సైజ్ బాగా పండిన మామిడి పండులో 165 కేలరీలు లభిస్తాయి. వర్క్ అవుట్ కి అరగంట ముందుగా ఈ మామిడి పండును తీసుకోవడం వలన ఈ ఫ్రూట్ ద్వారా గ్రహించిన ఎనర్జీని సవ్యంగా వినియోగించగలుగుతారు.

ఒక కప్పుడు మామిడి పండులో విటమిన్ సి 75 శాతం లభిస్తుంది. ఇది ఇంఫ్లేమేషన్, ఒబెసిటీతో పాటు ర్యుమటాయిడ్ ఆర్తరైటిస్ మరియు డయాబెటిస్ వంటి ఆరోగ్యసమస్యలు దూరంగా ఉంచుతుంది. అలాగే విటమిన్ ఏ 25 శాతం లభిస్తుంది. 25 రకాల కెరోటినాయిడ్స్ లభిస్తాయి. ఇవన్నీ వ్యాయామం వలన కలిగిన శ్రమ నుంచి మిమ్మల్ని వెంటనే కోలుకునేలా చేస్తాయి.

ఈ పండులో లభ్యమయ్యే విటమిన్ బి6 మరియు మిగాతా బి విటమిన్స్ అనేవి థైరాయిడ్ గ్లాండ్స్ మరియు పిట్యూటరీ గ్లాండ్స్ యొక్క స్మూత్ ఫంక్షనింగ్ కు తోడ్పడతాయి. మామిడి పండులో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది కండరాలను అలాగే నెర్వస్ సిస్టంను రిలాక్స్ చేసేందుకు తోడ్పడుతుంది.

English summary

this mango diet plan will help you lose weight

this mango diet plan will help you lose weight
Story first published:Saturday, June 2, 2018, 15:46 [IST]
Desktop Bottom Promotion