For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీగా ఉన్నప్పుడు ఇలా చేస్తే బాగా ఆస్వాదించొచ్చు, ఇవన్నీ చేసి చూడండి

ఇటువంటి అవహేళనలు గర్భిణీ స్త్రీలను కూడా వదలకపోవడం ఇంకా దారుణం. చివరికి స్వీయగౌరవం, విలువల గురించి వివరించే క్రమంలో భాగంగా అనేకమంది సెలెబ్రిటీలు, తాము గర్భంతో ఉన్నప్పుడు, ఆ కాలాన్ని ఎలా ఆస్వాదిస్తున్నా

|

మానవజీవితం ఎప్పుడూ ఒకే విధంగా సరళరీతిలో సాగుతుంది అనుకుంటే, అది భ్రమే అవుతుంది. అనేక ఒడిదుడుకుల మద్య, సానుకూల, ప్రతికూల ఫలితాలు మరియు ప్రభావాల మద్య ప్రతి నిమిషమూ ఒక యుద్ధంవలె జీవితం నడుస్తుంటుంది. కానీ, వాటన్నిటినీ ఎలా ఎదుర్కొన్నాము అన్న దానిమీదే మనిషి సుఖదుఃఖాలు ఆధారపడి ఉంటాయి అనడంలో ఆశ్చర్యమే లేదు. వీటన్నిటిలో భాగంగా బరువు, ఆకృతి, అందం వంటి అంశాలు కూడా స్త్రీ, పురుషుల ఆందోళనలకు కారణమవుతుంటాయి. అందులో గర్భవతులు, ప్రసవం తర్వాత తిరిగి సాధారణ స్థితికి వచ్చే విషయాల మీద ఎక్కువగా ఆలోచిస్తుంటారని మనకు తెలియనిది కాదు. కానీ గర్భవతిగా ఉన్నప్పుడు ప్రసవం తర్వాత ఆలోచనలను పక్కన పెట్టి, ప్రస్తుతం ఉన్న స్థితిని ఏవిధంగా ఆస్వాదించాలి అన్న విషయం మీద దృష్టి సారించడం ద్వారా, మానసిక ఆందోళనలు తొలగి సంతోషభరితమైన కాలాన్ని పొందవచ్చు.

నిజమే అద్దంలో చూస్తున్నప్పుడు, మీకు మీరే వేరే వ్యక్తి వలె కనపడవచ్చు, కానీ అది తాత్కాలికం. ప్రసవం తర్వాత మనం తీసుకునే చర్యల ఫలితంగా తిరిగి యధాస్థితికి వచ్చేందుకు అనేక పద్దతులు ఎటుతిరిగీ అందుబాటులో ఉన్నాయి. కావున, వాటి గురించిన ఆలోచనలను పక్కన పెట్టి, ప్రస్తుతం మీ శరీరంలో కలిగే మార్పులను ఎలా స్వీకరించాలి అన్న అంశం గురించి తెలుసుకుందాం.

మనం నివసిస్తున్న ఈ సమాజంలో ఇటువంటి దుస్తులే ధరించాలి, ఇదే ఆకృతిలో, ఇంత అందంగా ఉండాలి అంటూ కొన్ని నియమాలను తెలీకుండా అనుసరిస్తున్నారు. అది మన దౌర్భాగ్యమనే చెప్పాలి. మనిషి ఎంత సంతోషంగా ఉన్నాడు, ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు, ఎటువంటి జీవన శైలిని అనుసరిస్తున్నారు అన్నవి ప్రామాణికంగా ఉండాల్సింది పోయి, ఎదుటి వారి రూపు రేఖలను అవమానిస్తూ, రెచ్చగొడుతూ ఉండే వారే ఎక్కువ. క్రమంగా ఆ అవహేళనల నుండి బయటపడే క్రమంలో భాగంగా ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా అనుసరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకునే వారిని ఎంతోమందిని చూస్తున్నాం. చివరికి సర్జరీల వరకు వెళ్లి, అవి వికటించి మరణించిన సెలెబ్రిటీలను కూడా చూశాం. అయినా మారరు.

ఇటువంటి అవహేళనలు గర్భిణీ స్త్రీలను కూడా వదలకపోవడం ఇంకా దారుణం. చివరికి స్వీయగౌరవం, విలువల గురించి వివరించే క్రమంలో భాగంగా అనేకమంది సెలెబ్రిటీలు, తాము గర్భంతో ఉన్నప్పుడు, ఆ కాలాన్ని ఎలా ఆస్వాదిస్తున్నామో చూడండి అంటూ సోషల్ నెట్వర్క్స్ లో చైతన్యాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేయవలసి వచ్చింది. గర్భం దాల్చిన మహిళకు, అనేక రకాల గోల్స్ ఉంటాయి. ఉద్యోగం మరియు కుటుంబ భాద్యతల నడుమ, తమ మరియ గర్భస్థ శిశువు ఆరోగ్యం పరంగా ఈ గోల్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆ గోల్స్ పూర్తి స్థాయిలో నేరవేర్చుకోవాలి అంటే, కొన్ని అనవసరమైన అంశాలను పక్కన పెట్టాలి అని ప్రస్తుత మహిళా లోకం పిలుపునిస్తుంది. క్రమంగా అలా తమ రూపురేఖలను జడ్జ్ చేసే కళ్ళకు గర్భం దాల్చడం కూడా ఒక అందమే, అది చూసే కళ్ళను అనుసరించి ఉంటుంది అని మొఖం మీదే చెప్పేలా అడుగులు ముందుకు వేస్తున్నారు.

మీరు అనేక రకాల శారీరిక సమస్యలతో జీవితాంతం పోరాడుతూ ఉన్న ఎడల, గర్భం కారణంగా ఏర్పడే బరువు మీకు అదనపు కష్టాన్ని కలిగించవచ్చు. జీన్స్ మీకు ఇష్టం అయినప్పటికీ, వీటిని కొంత కాలం మీరు ధరించలేక పోవచ్చు, క్రమంగా గర్భిణీ స్త్రీలకు ఎంపిక చేయబడిన దుస్తులనే వినియోగించవలసి రావొచ్చు. కానీ ఇది తాత్కాలికమే. మీరు తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది, ఇది మీకు కష్టంగానే ఉండవచ్చు. కానీ ముందుగా మీరు బిగ్గరగా చెప్పాల్సిన మాట - “ నన్ను నేను ప్రేమించుకోవడం మొదలుపెట్టాలి, నా మరియు నా బిడ్డ కోసం” అని.

మీ శిశువుతో ఆరోగ్యకరమైన సంబంధానికి వేయాల్సిన మొదటి అడుగు, మీ శరీరంతో ఆరోగ్యకరమైన అనుబంధాన్ని కలిగి ఉండడం. మీ లోపల ఒక శిశువు పెరుగుతున్నారని మీకు తెలుసు, కావున అలా చేయడానికి, మీరు కూడా మానసిక, శారీరిక ఆరోగ్యాల పట్ల జాగ్రత్తను వహించడం అవసరమని గుర్తుంచుకోండి.

మీరు మీ శరీరంలో జరిగే మార్పుల గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉన్న ఎడల, అది ప్రసవం తర్వాత నిరాశా నిస్పృహలకు లేదా ముందస్తు ప్రసవానికి కూడా దారితీస్తుంది. కావున మీరు అన్నిటికన్నా ముందుగా మీ శరీరాన్ని ప్రేమించడం ప్రారంభించాలి. చెప్తున్నట్లే, అనుసరించడం కూడా తేలికే. కాబట్టి నిర్ణయం తీసుకుని ముందుకు సాగండి.

1. వ్యాయామం

1. వ్యాయామం

మీరు గర్భం కారణంగా బరువు పెరిగినట్లు భావిస్తున్న పక్షంలో, ఆ బరువు నుండి ఉపశమనం పొందే మార్గాలు అనేకం ఉన్నాయి. కానీ అది పూర్తిగా నిజం కాదు. వైద్యుని సంప్రదించి, సూచనల మేరకు క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామాలను అనుసరిస్తున్న ఎడల, కొంతమేర ఉపశమనం పొందగలరు. ఫలితంగా మానసిక ప్రశాంతత తోడై, అలసటను దూరంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. క్రమంగా మీరు ప్రసవం తర్వాత రికవరీ అవడాన్ని వేగవంతం చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా తీసుకోవలసిన చర్యలలో భాగమే, కానీ ఎట్టిపరిస్థితుల్లో డైటింగ్ (ఆహారాన్ని త్యజించడం వంటివి) చేయడం లేదని నిర్ధారించుకోండి. గర్భంతో ఉన్నప్పుడు డైటింగ్ వంటివి గర్భస్థ పిండం మీద ప్రభావాన్ని చూపిస్తే, ప్రసవం తర్వాత డైటింగ్ చేయడం తల్లిపాల మీద ఆధారపడి ఉండే పిల్లల మీద పోషక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కావున వైద్యుడు సూచించినట్లుగా ఆహారాన్ని అనుసరిస్తున్నారని నిర్ధారించుకోండి.

2. మిమ్మల్ని మీరు సావధానపరచుకోండి

2. మిమ్మల్ని మీరు సావధానపరచుకోండి

మాతృత్వం అనేది ఎంత ఆనందకరమైన విషయమో, అదేవిధంగా ఒత్తిడితో కూడుకుని ఉంటుంది అన్నది సుస్పష్టం. కానీ మీరు ఇష్టపడే అంశాలకు దూరంగా ఉండడమనేది కష్టం, అవునా?., కావున తరచుగా పార్లర్ వెళ్ళడం, లేదా మీకిష్టమైన అభిరుచులు అలవాట్ల మీద దృష్టి సారించడం కూడా ముఖ్యమని మరచిపోకండి.

3. మీ పరిస్తితులను గురించి చర్చించండి

3. మీ పరిస్తితులను గురించి చర్చించండి

మనం ఎంత స్వతంత్రులమైనా లేదా బలంగా ఉన్నా సరే, ఎప్పటికప్పుడు మనకంటూ మద్దతునిచ్చేవారు ఉండాలి. అనగా మీ భాగస్వామి లేదా మీ సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అలా ఎవరైనా కావచ్చు., మీ భావాలను పంచుకోవడమనేది ఈ సమయంలో ఉత్తమమైన ఆలోచనగా ఉంటుంది. మీ ఆరోగ్య, మానసిక పరిస్థితుల గురించి వారితో తరచుగా చర్చలు జరపడం మంచిది. క్రమంగా మీకు స్వాంతన చేకూరగలదు.

Most Read :వంటిట్లో పని మనిషి ఏం చేసిందో తెలుసా, సీసీ టీవీ కెమెరాల్లో అంతా రికార్డ్ అయిపోయింది (వీడియో)Most Read :వంటిట్లో పని మనిషి ఏం చేసిందో తెలుసా, సీసీ టీవీ కెమెరాల్లో అంతా రికార్డ్ అయిపోయింది (వీడియో)

4. మీపట్ల దయగా ఉండండి

4. మీపట్ల దయగా ఉండండి

కొంచెం ఒత్తిడికి గురైనా పర్లేదు (మీరు ఒక శిశువు కలిగి ఉన్నారు, కావున కొంత ఒత్తిడి సాధారణం). అందుచేత పని ఎక్కువగా చేయడం చేయకండి. అసంతృప్తి మరియు ఒత్తిడిని నివారించడానికి చిన్న పాటి నడక కూడా అవసరమని మరవకండి. మీ తోటి ఉద్యోగులు లేదా మరే ఇతర వ్యక్తులైనా, మీపట్ల వ్యతిరేక మాటలను మాట్లాడిన పక్షంలో తేలికగా తీసుకోండి. ఇది కొంచం కష్టమైనా పర్లేదు, బదులుగా, సున్నితంగా సమాధానం చెప్పి తప్పుకోండి. మీ ఆందోళనలు మీ శిశువు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని మాత్రం మరువకండి.

5. అన్నిటికన్నా విలువైనది మీ శిశువు, ఆ విషయం మరువకండి

5. అన్నిటికన్నా విలువైనది మీ శిశువు, ఆ విషయం మరువకండి

కొన్ని నెలల దూరంలోనే మీకు సంతోషాలను పంచే మీ శిశువు ప్రపంచంలోకి రాబోతుంది. ఈ కొద్ది నెలలు మిమ్మల్ని మీరు పరిస్థితులను ఎదుర్కొనేలా సిద్దపరచుకోండి. క్రమంగా ఇతరుల హేళనలు, సూటిపోటి మాటలు వచ్చే సంతోషం ముందు చిన్నవిగా కనిపిస్తాయి. అందుకే వాటిని అస్సలే పట్టించుకోవద్దు.

Most Read :ఈ ఆహారాలు తింటే వయాగ్రా అస్సలు అవసరం లేదు, సెక్స్ సామర్థ్యాన్ని పెంచే ఆహారాలు,ఆ సమయంలోరెచ్చిపోవొచ్చుMost Read :ఈ ఆహారాలు తింటే వయాగ్రా అస్సలు అవసరం లేదు, సెక్స్ సామర్థ్యాన్ని పెంచే ఆహారాలు,ఆ సమయంలోరెచ్చిపోవొచ్చు

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవనశైలి, మాతృత్వ, శిశు సంబంధ, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

How to Love Your Body During Pregnancy?

How To Love Your Body When You're Pregnant
Desktop Bottom Promotion