Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Sonakshi sinha: రహస్యాలను బయటపెట్టేసిన సోనాక్షి సిన్హా..మెత్తం చూపించింది
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'దబాంగ్'తో నటనారంగ ప్రవేశం చేసి అందరి మనసులు దోచేసింది బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. సినీ ఇండస్ట్రీలోని అందగత్తెలలో ఒకటైన సోనాక్షి సిన్హాకి సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. ఇటీవలే తన స్నేహితుడిని పెళ్లి చేసుకున్న ఈ బొద్దుగుమ్మ తెలుగు ఆడియన్స్ కూడా కనెక్ట్ అవ్వాలని నిర్ణయించుకుంది. సుధీర్‌బాబు హీరోగా వెంకట్ కల్యాణ్ తెరకెక్కిస్తున్న జటాధర సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు రెడీ అవుతోంది సోనాక్షి సిన్హా. ప్రస్తుతం ఈ మూవీ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది.
సోనాక్షి సిన్హా కేవలం అందగత్తె మాత్రే కాదండోమ్..ఆమె చాలా ప్రతిభ కలిగిన నటి కూడా. ఇటీవల సోనాక్షి తన రహస్యాలను బయటపెట్టేసింది. తన మేకప్ కిట్‌ను చూపించి తన అందం వెనుక రహస్యాలను వెల్లడించింది. హాలిడేస్ లో తన ట్రావెల్ కిట్ లో ఏ చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ, మేకప్ ఉత్పత్తులను ఉపయోగిస్తుందో సోనాక్షి చూపించింది. మీరు కూడా ఆమెలాగే మెరిసే చర్మాన్ని కోరుకుంటే, మీరు ఆమె అందం చర్మ సంరక్షణ నుండి ప్రేరణ పొందవచ్చు.

ప్రయాణాల్లో అందం విషయంలో సోనాక్షి తీసుకునే జాగ్రత్తలు
సోనాక్షి సిన్హా తన యూట్యూబ్ వ్లాగ్ లో తన ట్రావెలింగ్ ఎసెన్షియల్ కిట్ లోని మూడు బ్యాగులను చూపించింది. మొదటి కిట్‌లో అతి ముఖ్యమైన మేకప్ కిట్ ఉందని చెప్పింది. రెండవ కిట్ ఆమె జుట్టు సంరక్షణ ఉత్పత్తులతో కూడుకున్నది, ఎందుకంటే ఈ అమ్మడు తన హెయిర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. మూడవ కిట్ స్కిన్‌కేర్ కిట్.
మేకప్ కిట్ లో సోనాక్షి గ్లామరస్ మెరుపు రహస్యం
సోనాక్షి సిన్హా తన ట్రావెల్ కిట్ లో చేర్చిన మేకప్ ప్రొడక్ట్ ల గురించి తెలిపింది. సోనాక్షి మేకప్ కిట్ లో పౌడర్, ఫౌండేషన్, కన్సీలర్, టిన్టెడ్ సన్‌స్క్రీన్, ప్రైమర్, కాంటౌరింగ్ ఉత్పత్తులు, మాయిశ్చరైజర్ మోడల్స్, బ్యూటీ బ్లెండర్, లిప్ బామ్, స్ట్రోబ్ క్రీమ్, మస్కారా ఉన్నాయి. ఆమెకు కనురెప్పల పొడిగింపులు ఉన్నందున ఆమె కింది కనురెప్పలకు మస్కారా ధరిస్తుంది. ఆమె తన మేకప్ కిట్‌లో మేకప్ రిమూవింగ్ వైప్స్, బాబీ పిన్స్, సేఫ్టీ పిన్స్,చాలా ఐషాడో కిట్స్ ని కూడా తీసుకెళ్తుంది.
లిప్ స్టిక్ అంటే చాలా ఇష్టం
సోనాక్షి సిన్హాకి లిప్ స్టిక్ అంటే చాలా ఇష్టమట. సోనాక్షి దగ్గర 12 లిప్‌స్టిక్‌లు ఉన్నాయి, వాటిలో సాఫ్ట్ పింక్, న్యూడ్, బ్రైట్ రెడ్, మెరూన్ లిప్‌స్టిక్ ఉన్నాయి. ఆమెకు న్యూడ్ లిప్ స్టిక్ వేసుకోవడం చాలా ఇష్టం.
మెరిసే చర్మానికి రహస్యం
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన చర్మ సంరక్షణ కోసం చాలా శ్రద్ధ తీసుకుంటుంది. ఆమె తన బ్లాగులో తన చర్మ సంరక్షణ దినచర్యను కూడా పంచుకుంది. అన్నింటికంటే ఆమె ప్రయాణించేటప్పుడు తన స్కిన్ కేర్ కిట్ లో మేకప్ రిమూవింగ్ వైప్స్, స్క్రబ్బర్, అండర్-ఐ క్రీమ్, చర్మాన్ని తాజాగా కనిపించేలా చేసే ఫేస్ మాస్క్, యాంటీ-డార్క్ సర్కిల్ మాస్క్, ఫేస్ వాష్ వంటివి ఉంచుకుంటుంది.
జుట్టు పట్ల ప్రత్యేక శ్రద్ధ
సోనాక్షి సిన్హా తన జుట్టును షాంపూ, కండిషనర్‌తో కడుక్కుంటోంది..తద్వారా ఆమె జుట్టు ఆరోగ్యంగా,మృదువుగా ఉంటుంది. అదే సమయంలో ఆమె జుట్టును పోషణ కోసం వారానికి ఒకసారి హెయిర్ మాస్క్ వేసుకుంటుంది.



Click it and Unblock the Notifications