Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Tamannaah Bhatia: అమ్మదొంగా అసలు సీక్రెట్ ఇదా..మిల్కీ బ్యూటీ మొఖానికి ఏం పూస్తుందో తెలుసా!
హీరోయిన్ తమన్నా,నటుడు విజయ్ వర్మ ప్రేమ వ్యవహారం తెలిసిందే. రెండు మూడేళ్లుగా ఏ పంక్షన్ అయినా, పర్యటన అయినా ఒకరి చేయి ఒకరు వదలకుండా తిరిగిన ఈ జంట పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కుతారా అని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో బ్రేకప్ చెప్పుకొని అందరికీ షాక్ ఇచ్చారు. వీళ్లిద్దరికి లవ్ బ్రేకప్ అయ్యిందనే వార్త ఇవాళ ఉదయం అటు మీడియా,ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు పెటాకులవడం, లవ్ బ్రేకప్ లు చాలా సర్వసాధారణమైన విషయమే. అయితే తమన్నా ఫ్యాన్స్ మాత్రం ఇంత అందగత్తె దొరకాలంటే ఎవరికైనా రాసి పెట్టి ఉండాలి..విజయ్ వర్మకు ఆ లక్ లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
తమన్నా మేకప్ వేయకపోయినా,వేసిన పెద్ద తేడా ఉండదు. తెల్లగా చెక్కిన శిల్పంలా అందంగా ఉంటుంది. 35 ఏళ్ల వయస్సు వచ్చినప్పటికీ ఆమె స్కిన్ ఇంకా మిలమిల మెరిసిపోతుంది. అయితే తమన్నా ఇంత అందంగా ఉండటానికి కారణంగా వాళ్ల అమ్మ చెప్పిన రెండు హోంమేడ్ స్కిన్ కేర్ సీక్రెట్స్ అంట. తన తల్లి చెప్పిన స్కిన్ కేర్ సీక్రెట్స్ పాటించడం వల్లనే తన స్కిన్ కు ఇన్ స్టంట్ గ్లో, ప్రకాశవంతంగా ఉన్నట్లు ఓ వీడియోలో తమన్నా చెప్పింది.

తమన్నా చెప్పిందిదే
ఓ వీడియోలో తమన్నా మాట్లాడుతూ.."ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకునే రెండు ఫేస్ మాస్క్ ల గురించి మా అమ్మ నాకు చెప్పింది. వాటిని ఎలా తయారుచేయాలో చూపించింది.నేను నా నటనా జీవితాన్ని ప్రారంభించినప్పుడు నా తల్లి వీటిని నాకు నేర్పింది ఎందుకంటే నేను ప్రతిరోజూ మేకప్ వేసుకోవాలి, నా జుట్టును స్టైల్ చేయాలి. ఆ రసాయనాల తర్వాత నా దినచర్యలో సహజమైనదాన్ని చేర్చాలనుకున్ననప్పుడు మా అమ్మ నాకు నేర్పించిన రెండింటి గురించి మీకు చెప్తున్నా అంటూ తాను ఫేస్ మాస్క్‌లను ఎలా తయారు చేసుకుంటుందో చూపించింది.
తమన్నా ఇంట్లోనే తయారుచేసుకునే ఫేస్ మాస్క్ లు ఇవే
1. ఎక్స్‌ఫోలియేటింగ్ ఫేస్ స్క్రబ్ మాస్క్
1 టీస్పూన్ గంధపు చెక్క (చందన) పొడి,1 టీస్పూన్ కాఫీ పొడి,1 టీస్పూన్ సేంద్రీయ ముడి తేనె మొత్తం కలిపి ఈ ఈ స్క్రబ్ ను మీ ముఖానికి రాసుకుని కొన్ని నిమిషాలు మసాజ్ చేయాలి. కళ్ళు ,దాని చుట్టూ ఉన్న సున్నితమైన ప్లేస్ లలో పూయవద్దని తమన్నా సూచించింది. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని, ఆరబెట్టండి. ఈ మాస్క్.. చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది, మీ చర్మాన్ని మృదువుగా ఉంచుతుందని తమన్నా తెలిపింది. ఎక్స్‌ఫోలియేటింగ్ ఫేస్ స్క్రబ్ మాస్క్ తర్వాత మీరు మీ ముఖానికి రోజ్ వాటర్ అప్లై చేయవచ్చని తమన్నా చెప్పారు.
మాయిశ్చరైజింగ్ ఫేస్ మాస్క్
రోజ్ వాటర్, శనగపిండి, చల్లని పెరుగు కలిపి ఈ మాస్క్ ని మీ ముఖానికి, కళ్ళ కింద ఉన్న ప్రాంతంతో సహా సమానంగా అప్లై చేసి, దాదాపు 10 నిమిషాల తర్వాత అది ఆరిపోయే వరకు అలాగే ఉంచండి. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని, ఆరబెట్టండి. ఈ మాస్క్ తీవ్రమైన మాయిశ్చరైజింగ్‌ను అందిస్తుంది, చర్మాన్ని చల్లబరుస్తుంది, ఎరుపును తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications