Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఫేషియల్ చేయించుకున్నారా? తర్వాత ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసా?
అందంగా కనిపించడాని చాలా మంది ఫేషియల్ చేయించుకుంటారు. పింపుల్స్, మచ్చలు తొలగిపోయి చర్మం ప్రకాశవంతంగా మెరిసిపోవడానికి రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటారు. ఫేషియల్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఫేషియల్ చేయించుకున్న తర్వాత తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల చర్మం తిరిగి కాంతిహీనంగా మారుతుంది. అందుకే ఫేషియల్ చేయించుకున్న తర్వాత ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫేషియల్ ప్రయోజనాలు:
ముఖంపై చర్మాన్ని ఫేషియల్స్ రిలాక్స్‌గా, రిఫ్రెష్‌గా, మెరిసేలా చేస్తాయి. ఫేషియల్ ముఖంపై ఉన్న చర్మానికి రక్త ప్రసరణను, శోషరస ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మంలోకి పోషకాలు చొప్పించి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఫేషియల్స్‌లో చాలా రకాలు ఉంటాయి. యాక్నే తగ్గించడం నుండి చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి రకరకాల ఫేషియల్స్ మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి.
ఫేషియల్స్ చర్మం కింద రక్త ప్రవాహాన్ని ప్రసరింపజేయడం ద్వారా చర్మ కణాలను పునరుజ్జీవింపజేయడంలో సహాయపడతాయి. ఇది శోషరస వ్యవస్థ వల్ల ఏర్పడే ఉబ్బరాన్ని, ద్రవాలను తగ్గిస్తుంది. మెరుగైన రక్త ప్రసరణ వల్ల చర్మం నుండి టాక్సిన్స్ తొలగిపోతాయి. అలాగే పోషకాలు, ప్రోటీన్లు, ఆక్సిజన్ అందిస్తాయి.
ఫేషియల్ చేయించుకున్న తర్వాత ఏం చేయాలంటే..
1. హైడ్రేటెడ్‌గా ఉండాలి:
పుష్కలంగా నీరు తాగాలి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. దీని వల్ల చర్మం తేమగా ఉంటుంది. మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. నాణ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోవాలి. ఫేషియల్ చేయించుకున్న తర్వాత ముఖం ఎర్రగా మారినా, దురద, మొటిమలు వంటి అలెర్జీలు వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
2. సున్నితమైన క్లెన్సర్ వాడాలి:
చర్మంపై పేరుకుపోయిన దుమ్ము ధూళిని, మృతకణాలను తొలగించడానికి సున్నితమైన క్లెన్సర్ వాడాలి. ఏదైనా క్లెన్సర్ వాడే ముందు పరీక్షించుకోవాలి.
3. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయాలి:
ఫేషియల్ తర్వాత చర్మం పొడిబారినట్లుగా, సున్నితంగా మారవచ్చు. తేమను తిరిగి పొందడానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
4. సన్‌స్క్రీన్ రాసుకోవాలి:
ఫేషియల్ తర్వాత సన్‌స్క్రీన్ రాసుకోవడం మర్చిపోవద్దు. సన్‌స్క్రీన్ రాసుకోవడం వల్ల సూర్యుడి హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మానికి రక్షణ లభిస్తుంది. కనీసం SPF-30 ఉన్న సన్‌స్క్రీన్ ఎంచుకోవడం మర్చిపోవద్దు.
ఫేషియల్ చేయించుకున్న తర్వాత ఏం చేయకూడదంటే..
1. చర్మాన్ని వేడికి దగ్గరగా ఉంచడం:
ఫేషియల్ చేసిన వెంటన అధిక వేడి లేదా చెమట కలిగించేలా వేడి ప్రాంతాల్లో ఉండకూడదు. స్టీమ్ బాత్, హాట్ వాటర్, ఎండలోకి వెళ్లడం లాంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల చర్మం ఎర్రగా మారుతుంది. చికాకు కలిగిస్తుంది.
2. ముఖ వెంట్రుకలను వాక్సింగ్ చేయడం:
ముఖంపై ఉన్న వెంట్రుకలను తొలగించడానికి వాక్సింగ్ చేయాలనుకుంటే ఫేషియల్ చేయించుకోవడానికి రెండు, మూడు రోజుల ముందు వాక్సింగ్ చేయించుకోవడం మంచిది. ఫేషియల్ ద్వారా చర్మం లోతుగా ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. ఇలాంటప్పుడు వాక్సింగ్ చేస్తే చర్మ రంధ్రాల్లోకి బ్యాక్టీరియా చేరుతుంది.
3. ముఖాన్ని తాకడం:
చాలా మంది ముఖాన్ని తాకుతుంటారు. ఎక్కడెక్కడో ముట్టుకున్న తర్వాత అవే చేతులతో ముఖాన్ని తాకడం ద్వారా చేతులకు ఉండే మురికి, బ్యాక్టీరియా ముఖంపైకి చేరతాయి. దీని వల్ల చర్మంపై మచ్చల్లాంటివి ఏర్పడతాయి.
4. వెంటనే మేకప్ వేయడం:
ఫేషియల్ చేయడం ద్వారా చర్మం లోతుగా ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. వెంటనే మేకప్ వేయడం, కాస్మోటిక్స్ వాడటం వల్ల అవి చర్మ రంధ్రాల్లోకి వెళ్తాయి. దీని వల్ల చికాకు కలుగుతుంది. మొటిమలు రావడానికి కారణం అవుతుంది.
5. కెమికల్ పీల్స్ వాడటం:
ఫేషియల్ తర్వాత వెంటనే కెమికల్ పీల్స్ వాడటం ఎట్టిపరిస్థితుల్లోనూ మంచిది కాదు. దీని వల్ల చర్మ సమస్యలు రావొచ్చు.



Click it and Unblock the Notifications