Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
మచ్చలేని చర్మం, మెరిసే జుట్టు సొంతమవ్వాలంటే.. చెరుకు రసం వాడాల్సిందే!
అందం, ఆరోగ్యం అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు. మనం ఏ చేసినా ఈ రెండింటి కోసమే. అయితే మనం తీసుకునే చాలా ఆహారాల వల్ల మనం అందం, ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా మచ్చలేని చర్మం కావాలన్నా, మెరిసే జుట్టు కావాలన్నా చెరుకు రసం తాగాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల చర్మం, జుట్టు కాంతివంతంగా తయారవుతుందట. కేవలం తాగడమే కాదండోయ్ చర్మంపై, జుట్టుపై రాసుకుంటూ మసాజ్ చేయడం వల్ల మరిన్ని అద్భుత ఫలితాలను అందుకోవచ్చని చెబుతున్నారు.

ఈ మధ్య చెరుకు రసంతో అనేక ఉత్పత్తులను తయారు చేస్తున్నారుట. కాస్మొటిక్ రంగంలో చెరుకు రసానికి ఉన్న డిమాండ్ గణనీయంగా పెరిగిపోయింది. ఫేస్ మాస్కుల నుంచి హెయిర్ ట్రీట్ మెంట్ లు, హైడ్రేటింగ్ చేయడం వరకు దీన్ని వాడుతున్నారట. అయితే చెరుకు రసం వాడడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది:
చెరకు రసంలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను ఎదుర్కోవడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. చెరకులో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్‌లు.. చర్మంపై పేరుకుపోయిన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అలాగే సెబమ్ ను కూడా మాయం చేస్తుంది. చెరుకు రసంలో ఉండే సహజ ఆమ్లాలు రంధ్రాలను అన్‌క్లాగ్ చేయడం, అదనపు నూనె ఉత్పత్తిని తగ్గించడం, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ వంటివి ఏర్పడకుండా నిరోధించడంలో ముందుటాయి.
2. తేమ మరియు హైడ్రేట్:
చెరకు రసం చర్మానికి అద్భుతమైన సహజ మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. ఇందులోని అధిక గ్లైకోలిక్ యాసిడ్ కంటెంట్ తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే చర్మం పొడి బారకుండా చేస్తుంది. రెగ్యులర్ అప్లికేషన్ ఫ్లాకీ స్కిన్, డల్‌నెస్, రఫ్ ప్యాచ్‌ల వంటి సమస్యలను ఎదుర్కోవడంలోనూ సహాయపడుతుంది.
3. వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది:
చెరకు రసంలో ప్రొటీన్లు, మినరల్స్, ఐరన్, జింక్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు ఫ్రీ రాడికల్ డ్యామేజీని నివారిస్తుంది. చెరకు రసంలో ఉండే విటామిన్ ఏ, సీలు ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తాయి. ఇది మొహంపై ఏర్పడే గీతలు, ముడతలు, వయస్సు పెరుగుతున్నట్లుగా వచ్చే మచ్చల రూపాన్ని తగ్గించడంలో సహాయ పడుతుంది. యవ్వన మరియు ప్రకాశవంతమైన ఛాయను ప్రోత్సహిస్తుంది.
4. గాయాలను నయం చేస్తుంది:
చెరకు రసంలో గాయం నయం చేసే గుణాలు ఉన్నాయి. ఇది రికవరీ ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయ పడుతుంది. విటామిన్ సీ తో సహా చెరకు రసంలో ఉండే సహజ యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు వాపును తగ్గించడంలో, కణజాలాన్ని బాగు చేయడంకో కీలక పాత్ర పోషిస్తాయి. ఏవైనా చిన్న దెబ్బలు తగినా, చర్మం కట్ అయినా, గాయాలు లేదా చర్మపు చికాకులను తగ్గించుకునేందుకు చెరకు రసాన్ని వాడొచ్చు. నేరుగా గాయాలపై చెరుకు రసాన్ని పూస్తే ఫలితం ఉంటుంది.
5. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది:
చెరకు రసం జుట్టును హైడ్రేట్ చేస్తుంది. అలాగే కండిషన్ చేస్తుంది. చుండ్రుతో పోరాడటానికి సహాయ పడుతుంది. జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. చెరకు రసంలో ఉండే విటామిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు వంటి పోషకాలు జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషణను అందిస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో చెరుకు రసం ముఖ్య పాత్ర పోషిస్తుంది. జుట్టు తంతువులకు షైన్, మృదుత్వాన్ని ఇస్తుంది. చెరకు రసంలో ఉండే సహజ ఆమ్లాలు స్కాల్ప్ యొక్క pH స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయ పడతాయి.



Click it and Unblock the Notifications











