Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఈ నూనె జుట్టుకు రాసుకుంటే.. మీరు వద్దన్నా జుట్టు పెరుగుతుంది,గుంజినా కూడా ఊడదు
ఈ మధ్యకాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య జుట్టు రాలిపోవడం. జుట్టు అధికంగా రాలిపోవడం వలన చాలా మంది తమలోని ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతున్నారు. బయటికి కాన్ఫిడెంట్‌గా ఉండలేకపోతున్నారు. అలాంటి వ్యక్తులు చియా విత్తనాల నుంచి తీసే నూనె రాసుకుంటే అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి. వద్దన్నా జుట్టు పెరుగుతుంది. అలాగే రాలిపోవడం కూడా తగ్గిపోతుంది. అసలు ఈ నూనె వలన జుట్టుకు ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయనేది ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.
1. బలమైన జుట్టు
చియా విత్తనాల్లో ఉండే ప్రోటీన్ జుట్టుకు బలం కలిగిస్తుంది. డ్యామేజ్ అయిన జుట్టును ఈ నూనె లోపలి నుంచి వాటిని రిపేర్ చేస్తుంది. ఇది హెయిర్ ఫాలికల్స్‌ని బలంగా మార్చుతుంది, తద్వారా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

2. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్
చియా విత్తనాలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణను అందించి, కుదుళ్లను హైడ్రేట్ చేయడంలో సహాయపడతాయి. హైడ్రేటెడ్ జుట్టు వల్ల హెయిర్ ఫాలికల్స్ డ్యామేజ్ కాకుండా ఉంటాయి, దీంతో జుట్టు బలంగా, మందంగా పెరుగుతుంది.
3. కుదుళ్లకు మాయిశ్చర్
చియా విత్తనాలు జుట్టుకు తగిన మాయిశ్చర్‌ను అందిస్తాయి. ఈ నూనెను జుట్టుకు అప్లై చేసినప్పుడు, స్కాల్ప్‌కు మంచి పోషణ అందించి, జుట్టు తేమను నిలుపుతుంది. దీని వల్ల చుండ్రు సమస్య తగ్గిపోతుంది. అలాగే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టగలుగుతుంది.
4. యాంటీ ఆక్సిడెంట్లు
చియా విత్తనాల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించి, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. తద్వారా, జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది మరియు తెల్లవెంట్రుకల సమస్య రాకుండా చేస్తాయి.
5. కుదుళ్ల ఆరోగ్యం
చియా విత్తనాల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఇది జుట్టుపై వచ్చే దురద మరియు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. తద్వారా జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని చెప్పవచ్చు. వీటితో పాటు అనేక రకాల ప్రయోజనాలను ఈ నూనె అందజేస్తుంది.
టిప్స్:
చియా విత్తనాల నూనెను జుట్టుకు నేరుగా అప్లై చేసి మసాజ్ చేయండి. దీనివల్ల బ్లడ్ సర్కులేషన్ మెరుగవుతుంది.
చియా సీడ్ ఆయిల్ యొక్క కొన్ని చుక్కలను జుట్టుకు అప్లై చేసి, 10-15 నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత తలస్నానం చేయండి.
మీరు జుట్టుకు మాస్క్ కూడా తయారుచేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ ఆయిల్ లో తేనె కలిపి అప్లై చేయండి. ఇది జుట్టు హైడ్రేషన్‌కు మేలు చేస్తుంది.



Click it and Unblock the Notifications