Latest Updates
-
ఎయిర్ పోర్ట్ డివోర్స్ అంటే ఏంటి?.. జంటలను ఆకర్షిస్తున్న కొత్త ట్రెండ్! -
వర్షాకాలంలో ఈ చిన్న పని చేస్తే..ఏ రోగాలు మీ దరిచేరవు! -
పంజాబీ ఫేమస్ చిక్కడ్ చోలే.. పూరీ, కుల్చాకి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్! -
ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు, కట్టల కొద్దీ కరెన్సీ? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు! -
ఇలాంటి స్త్రీ ఎంతటి కష్టంలోనూ మిమ్మల్ని విడిచిపెట్టదు! -
ఈ స్పెషల్ బెండకాయ రోస్ట్ ముందు నాన్ వెజ్ ఫ్రైలు కూడా పనికిరావు..ట్రై చేసి చూడండి! -
డీప్ ఫ్రై లేకుండానే KFC స్టైల్ పాప్ కార్న్ చికెన్.. మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
మీ బ్రెయిన్ పవర్ పెరగాలా? ఎయిమ్స్ డాక్టర్ చెప్పిన ఈ సీక్రెట్స్ మీకోసమే! -
జూలై 3న నక్షత్ర మార్పు.. ఈ రాశుల వారికి ఆర్థికంగా తిరుగేలేదు! -
శుక్రుడి దయతో.. ఈ 5 రాశుల వారికి భారీ అదృష్టం!
వేసవిలో ఇవి తీసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది, చర్మ సమస్యలన్నీ దూరమవుతాయి
వేసవికాలంతో పాటు పలు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అలా కొద్ది సేపు ఎండలో బయటకు వెళ్లి వస్తే ఎక్కడలేని నిస్సత్తువ ఆవహిస్తుంది. ఒంట్లోని శక్తి అంతా కోల్పోయినట్లుగా, అలసటగా అనిపిస్తుంది. అలాగే ఎండ వేడిమికి వచ్చే చెమట చాలా చికాకు పెడుతుంది. విపరీతంగా వచ్చే చెమట వల్ల చెమటకాయ కూడా అవుతుంది. ఎండ వేడిమికి చర్మం పొడిబారుతుంది. దీని వల్ల ఇతర సమస్యలూ వస్తాయి.
సూర్య కిరణాలు, తేమ, గాలిలోని కాలుష్య కారకాల వల్ల చర్మం నిస్తేజంగా, జిడ్డుగా మారుతుంది. ఎండకు బయటకు వెళ్తే తప్పనిసరిగా సన్‌స్క్రీన్ రాసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఈ వేసవిలో మీరు కూడా చర్మ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటుంటే ఈ ఆయుర్వేద ఫుడ్స్ తీసుకోండి. వీటి వల్ల చర్మ సమస్యలు తొలగిపోవడంతో పాటు చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

వేప:
వేపలో అనే ఆయుర్వేద ప్రయోజనాలు ఉంటాయి. చర్మ సంరక్షణలో కూడా వేప చాలా సహాయపడుతుంది. వేప దాని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలతో చర్మాన్ని డిటాక్స్ చేస్తుంది. చెమటతో మూసుకుపోయిన చర్మ రంధ్రాలను తెరుస్తుంది. మొటిమలను నివారించడంలో సహాయపడుతుంది. వేపను నూనె రూపంలో, పొడి రూపంలో చర్మ సంరక్షణకు ఉపయోగించవచ్చు.
పసుపు:
పసుపులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చర్మ వాపును తగ్గిస్తుంది. చర్మ కణజాలాన్ని మెరుగుపరుస్తుంది. పసుపు చర్మం యొక్క ఆకర్షణీయమైన రంగులో కూడా సహాయపడుతుంది. పసుపును ఆహారంతో పాటు తీసుకోవచ్చు. అలాగే పేస్టు రూపంలో చర్మంపై అప్లై చేసుకోవచ్చు.
ఉసిరికాయ:
ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది స్కిన్ డిటాక్స్ కి చాలా సహాయపడుతుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. ఇది చర్మానికి మెరుపునిస్తుంది. ఉసిరికాయను నేరుగా తినొచ్చు. ఉసిరి రసాన్ని చర్మంపై రాసుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి.
కొత్తిమీర:
దాదాపు ప్రతి వంటకంలోనూ కొత్తిమీర వాడటం సాధారణం. కొత్తిమీరలోని పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మంలోని ట్యాక్సిన్లను బయటకు పంపడంలో కొత్తిమీరు చక్కగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని అందంగా మారుస్తాయి.
త్రిఫల:
త్రిఫల అనేది మూడు ఆయుర్వేద మూలికల మిశ్రమం నుండి తయారు చేసిన పదార్థం. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. త్రిఫల క్యాప్సూల్స్ అన్ని ఆయుర్వేద ఫార్మసీలలో అందుబాటులో ఉంటాయి.
మంచినీళ్లు:
మంచి నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. హైడ్రేటెడ్ గా ఉండటానికి నీటిని తాగడం చాలా ముఖ్యం. పుష్కలంగా నీరు తాగితే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. చర్మం పొడిబారకుండా ఉంటుంది. చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

కలబంద:
అలోవెరాతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కలబందను చర్మ సంబంధిత సౌందర్య ఉత్పత్తుల్లో విరివిగా వాడతారు. ఇందులోని పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. కలబంద ఆధారిత సన్ స్క్రీన్ లోషన్ తో మరింత మెరుగైన రక్షణ ఉంటుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications