Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
ఎండాకాలం గడ్డం ఉంటే మంచిదా? లేకపోతే మంచిదా.. నిపుణులు ఏమంటున్నారంటే?
ఈరోజుల్లో గడ్డం ఒక ఫ్యాషన్ ట్రెండ్‌గా మారిపోయింది. కొందరు దాన్ని తమ వ్యక్తిత్వంలో ఒక భాగంగా చూస్తారు. మరికొందరికి అది పురుషత్వానికి ప్రతీకగా భావించబడుతుంది. అయితే, చర్మ ఆరోగ్యం పరంగా గడ్డం పెట్టుకోవడం మంచిదా లేక క్లీన్ షేవ్ మంచిదా అనేది ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే ఈ స్టోరీలో దానికి సంబంధించిన జవాబు ఇవ్వడంతో పాటు.. గడ్డం ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి? లేకపోతే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకుందాం.
క్లీన్ షేవ్ ప్రయోజనాలు
చర్మ శుభ్రత: క్లీన్ షేవింగ్ ద్వారా చర్మంపై పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోతాయి. ఇది ముఖాన్ని తాజాగా మార్చడంతో పాటు చాలా మృదువుగా మారుస్తుంది. .
సరైన సంరక్షణ: షేవ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వంటి ఉత్పత్తులు చర్మంలో బాగా చొచ్చుకుపోతాయి ఇది సంరక్షణను మెరుగుపరుస్తుంది.
బ్యాక్టీరియా సమస్య తగ్గింపు: చెమట, దుమ్ము ధూళి గడ్డంలో పేరుకుపోవడం వల్ల వచ్చే మొటిమలు, దురద వంటి సమస్యలు షేవింగ్ వల్ల తగ్గుతాయి.

క్లీన్ షేవ్ ప్రతికూలతలు
చర్మ సమస్యలు: తరచూ షేవ్ చేయడం వల్ల దద్దుర్లు, చర్మం ఎర్ర బడడం, చర్మంపై గాట్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది సున్నితమైన చర్మం ఉన్నవారికి మరింత ఇబ్బందిగా మారుతుంది.
ఎర్రగా మారడం: అలర్జీ ప్రబలిన చర్మం ఉన్నవారిలో షేవింగ్ తర్వాత చర్మం ఎరుపుగా మారడం సాధారణం.
గడ్డం ఉంచడం వల్ల ప్రయోజనాలు
చర్మ రక్షణ: గడ్డం ముఖాన్ని ఎండ, కాలుష్యం, గాలి వల్ల వచ్చే దుమ్ము నుండి కాపాడుతుంది. ఇది ఒక రకంగా సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది.
తేమను నిలుపుతుంది: గడ్డం చర్మంపై తేమను నిలబెట్టేలా చేస్తుంది. ఇది చర్మాన్ని పొడిబారకుండా ఉంచుతుంది.
ఆత్మవిశ్వాసం: కొంతమందికి గడ్డం పెంచుకోవడం తమ వ్యక్తిత్వాన్ని బలంగా చూపించేందుకు ఉపయోగపడుతుంది.
గడ్డం ఉంచడం వల్ల కలిగే సమస్యలు
పరిశుభ్రత లోపం: గడ్డాన్ని శుభ్రంగా ఉంచకపోతే సెబమ్(చర్మ నూనె), బ్యాక్టీరియా, ఫంగస్ పేరుకుని మొటిమలు, దురదలకు కారణమవుతాయి.
ఇన్ఫెక్షన్లు: పరిశుభ్రత పాటించకపోతే పేలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
జిడ్డు చర్మం ఉన్నవారికి తక్కువ అనుకూలం: ఇప్పటికే చర్మం జిడ్డుగా ఉండే వారికి గడ్డం ఉంచడం వల్ల సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది.
సరైన సంరక్షణ ముఖ్యం
మీరు గడ్డం ఉంచుకున్నా, లేక క్లీన్ షేవ్‌ను ఎంచుకున్నా.. ముఖ చర్మానికి సరైన సంరక్షణ ఇవ్వడం తప్పనిసరి. మిల్డ్ క్లెన్జర్‌తో రోజూ ముఖాన్ని కడగడం, మాయిశ్చరైజర్ ఉపయోగించడం, సన్ ప్రొటెక్షన్ తీసుకోవడం లాంటివి ముఖ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
గడ్డం ఉంచే వారు చేయాల్సిన పనులు:
వారానికి 2-3 సార్లు గడ్డాన్ని క్లీన్ షాంపూతో శుభ్రం చేయాలి.
కండిషనర్ ఉపయోగించి తేమను నిలబెట్టాలి.
గడ్డం నూనె వాడటం వల్ల తడి ఉండి చర్మం కుదురుగా ఉంటుంది.
క్లీన్ షేవ్ చేసే వారు చేయాల్సిన పనులు:
మంచి క్వాలిటీ రేజర్ ఉపయోగించాలి.
షేవింగ్ క్రీమ్ లేదా జెల్ వాడాలి.
షేవింగ్ తర్వాత చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయాలి, అవసరమైతే ఆఫ్టర్‌షేవ్ జెల్ ఉపయోగించవచ్చు.



Click it and Unblock the Notifications