Latest Updates
-
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే!
Rosemary For Hair: బలమైన, పొడవైన జుట్టు కావాలా? రోజ్‌మేరీ ఇలా వాడితే అద్భుతమైన ఫలితాలు
జుట్టు అందంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు. పొడవైన, లావైన, బలమైన జుట్టు కావాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది. జుట్టు రాలకుండా ఉండటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. షాంపూలు, హెయిర్ ఆయిల్స్, కండిషనర్స్, సీరమ్, హెయిర్ మాస్క్‌లు ఇలా చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వీటి వల్ల కొంతలో కొంత ప్రయోజనాలు ఉన్నప్పటికీ వాటి ఖరీదు చాలా ఎక్కువ.
మీకు బలమైన, పొడవైన జుట్టు కావాలంటే తక్కువ ఖర్చులో లభించే రోజ్‌మేరీ వాడండి. రోజ్‌మేరీతో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. జుట్టుకు షైన్ ఇస్తుంది:
రోజ్మేరీలో మెరుపును పెంచే గుణాలు ఉంటాయి. ఇది సహజసిద్ధంగా జుట్టుకు షైన్ ను అందిస్తుంది. జుట్టు క్యూటికల్స్ ను సున్నితంగా మార్చడంలో సహాయపడుతుంది. స్మూత్ క్యూటికల్స్ జుట్టును మెరిసేలా చేయడంతో పాటు ఆరోగ్యంగా ఉంచుతాయి.
2. హెయిర్ స్ట్రాండ్స్‌ను బలపరుస్తుంది:
రోజ్మేరీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తలపై రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని వల్ల బలమైన, ఆరోగ్యకరమైన తంతువులకు సహాయపడతాయి. కార్నోసిక్ యాసిడ్, రోజ్మరినిక్ యాసిడ్, కార్నోసోల్ వంటివి రోజ్మేరీలో ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
3. స్కాల్ప్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది:
రోజ్మేరీలో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు స్కాల్ప్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే తలపై చర్మాన్ని బలపరిచి జుట్టు కుదుళ్లను బలంగా ఉంచేందుకు సహాయపడతాయి. పొడి, దురద లాంటి సమస్యలు తలెత్తవు. చుండ్రును నివారిస్తుంది. స్కాల్ప్ సోరియాసిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలను అడ్డుకుంటుంది.
4. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది:
రోజ్మేరీ నూనె జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. రోజ్మేరీలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నెత్తిపై రక్తప్రసరణను కూడా మెరుగుపరుస్తాయి.
5. స్కాల్ప్‌ను శక్తివంతం చేస్తుంది:
జుట్టు దృఢంగా, రాలకుండా ఉండటానికి స్కాల్ప్ ఆరోగ్యం చాలా కీలకం. రోజ్మేరీ ఆయిల్ ను పెట్టుకోవడం వల్ల ఇందులోని పోషకాలు స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తాయి. దీని వల్ల జుట్టు రాలడం సమస్య తలెత్తదు. జుట్టు లావుగా, పొడుగ్గా మారుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications