Latest Updates
-
భర్త/భార్య పక్కనే ఉన్నా 'నాకు అర్థమయ్యే వాళ్లెవరూ లేరు' అనిపిస్తోందా? కారణం ఇదే -
నెలాఖరులో డబ్బు తక్కువైనప్పుడు భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడతారో తెలుసా? -
సమ్మర్లో చల్లచల్లగా మిల్క్‌షేక్, మాక్‌టెయిల్.. ఈ ఫ్రూట్స్‌తో స్పెషల్ డ్రింక్స్ -
కొవిడ్ తెచ్చిన కష్టాలు.. యువతలో పెరుగుతున్న తుంటి మార్పిడి సర్జరీలు.! -
కళ్లలో నీళ్లు తిరుగుతున్నా ఆపకుండా తినేంత టేస్టీ..మహారాష్ట్ర స్పెషల్ తేచ్చా చికెన్..ఈజీగా ఎలా చేయాలంటే.. -
బీట్రూట్, అటుకులతో హాట్ అండ్ స్వీట్ హెల్తీ స్నాక్స్ -
మధురై స్పెషల్ బంగాళాదుంప ఫ్రై..జన్మలో మర్చిపోలేని టేస్ట్..ఇంట్లోనే ఎలా చేయాలంటే.. -
అధిక మాసంలో ఈ 4 వస్తువులు ఇంట్లో ఉంటే చాలా డేంజర్.. వెంటనే తీసేయండి.! -
World cycle day 2026: ప్రపంచ సైకిల్ దినోత్సవం.. ఈ ఏడాది ప్రత్యేక థీమ్ ఇదే.! -
తిన్న వెంటనే కడుపు ఉబ్బిపోతోందా?..ఇలా చేస్తే జీర్ణక్రియ మెరుగుపడి, కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది!..
ఇలా చేస్తే మేకప్ కూడా అవసరం లేదు.. ముఖం ధగధగా మెరిసిపోతుంది! 100% గ్యారెంటీ!
ప్రతి ఒక్కరికీ మెరిసిపోయే అందమైన చర్మం ఉండాలని ఉంటుంది. అందుకోసం ఎన్నో రకాల క్రీమ్స్, హోమ్ రెమెడీస్ పాటిస్తూ ఉంటారు. మేకప్ వేయడం, చికిత్స తీసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇంకొందరు డీప్ హైడ్రేషన్, మరికొందరు స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతుంటారు. అయితే ముఖాన్ని అందంగా ఉంచుకోవాలన్నా లేదా మృదువుగా తయారు చేసుకోవాలన్నా ఆవిరి పట్టడం ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఫిషియల్ స్టీమర్ మెషిన్, వేడినీరు, ద్వారా ఇలా ఆవిరి పెట్టుకోవచ్చు. ఇలా ముఖానికి ఆవిరి పట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ముఖం ఏ విధంగా మెరిసిపోతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆవిరి పట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు
ముఖ చర్మాన్ని శుభ్రం చేసుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖంపై మూసుకుపోయిన రంధ్రాలను కూడా ఇది క్లీన్ చేస్తుంది అలాగే చర్మాన్ని కాంతి వంతంగా మారుస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. దీంతో అవయవాల పనితీరు మెరుగుపడతాయి. ముఖంపై మొటిమలు కలిగించే బ్యాక్టీరియా కణాలను ఇది చంపేస్తుంది.

పెరిగిన జుట్టు సమస్యలను నివారిస్తుంది. అలాగే చిక్కుకున్న సెబమ్‌ను విడుదల చేస్తుంది. చర్మాన్ని తాజాటా హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. తద్వారా చర్మం కాంతి వంతంగా మారుతుంది. సైనస్ సమస్యలను తగ్గించి, తుమ్ముల నుంచి ఊరటనిస్తోంది. కొలాజెన్‌ను ప్రోత్సహించి చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.
ఇలా వినియోగించండి..
మెరిసే చర్మం కోసం: ముఖానికి ఆవిరి పట్టడం వల్ల చర్మం నిగనిగలాడుతూ మెరిసిపోతుంది. దీనికోసం స్టీమర్‌లో చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే ప్రతిరోజూ సాయంత్రం స్కిన్ కేర్ రొటీన్ చేసుకునే ముందు ఇలా ఆవిరి పట్టుకోవాలి. అంతే ముఖం తాజాగా కాంతి వంతంగా మారిపోతుంది.
జిడ్డు చర్మం కోసం: చర్మం జిడ్డుగా ఉంటే ఆ చర్మాన్ని అద్దంలో చూసుకోవాలనుకున్నా, లేదా మనం ముట్టుకున్నా చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ జూడఁడు తనాన్ని పోగొట్టుకోవడానికి స్టీమర్‌లో అలోవెరా జెల్ వేసి.. పదిహేను నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. ఆ తరువాత ఆవిరిని ముఖానికి పట్టించాలి. ఆ తరువాత ముఖం కడుక్కుంటే చర్మంపై ఉండే జిడ్డు తొలిగిపోయి చర్మం ఫ్రెష్‌గా కనిపిస్తుంది.
సున్నితమైన చర్మం కోసం: సున్నితమైన చర్మం కోసం కూడా ఆవిరి పడితే చాలా మంచి ప్రయోజనాలను పొందొచ్చు. అందుకోసం స్టీమర్‌లో కొంచెం చమోమిలే టీ వేసి ఆ తరువాత ఆవిరి పట్టాలి. ఇది అద్భుతమైన వాసన అందించడంతో పాటు చర్మాన్ని సున్నితంగా తయారు చేస్తుంది. అలాగే శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
మొటిమలు దూరం అవ్వాలంటే?: సాధారణంగా మొటిమలు బ్యాక్టీరియాల కారణంగా వస్తుంటాయి. అయితే ఆవిరి పట్టడం వల్ల ఆ బ్యాక్టీరియాలను దూరం చేసుకోవచ్చు. అందుకోసం స్టీమర్‌లో కొన్ని తులసి, మరికొన్ని వేప ఆకులను వేసుకొని ఉడికించుకోవాలి. ఆ తరువాత వాటి నుంచే వచ్చే ఆవిరిని ముఖానికి పట్టుకుంటే కచ్చితంగా మొటిమలు దూరమైపోతాయి. అలాగే మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ.
గమనిక: ఈ స్టోరీలో మేము వివరించిన పాయింట్స్ అన్ని మాకు ఇంటర్నెట్‌లో దొరికిన కొన్ని సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఇవి కచ్చితమైనవి అని మేము నిర్ధారించడం లేదు.



Click it and Unblock the Notifications