Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
రైస్ వాటర్(గంజి)ను వాడితే జుట్టు ఒత్తుగా, బలంగా అవుతుంది
జుట్టు ఒత్తుగా, బలంగా, పొడువుగా, మెరిసిపోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకోసం మార్కెట్లో లభించే రకరకాల షాంపూలు, నూనెలు, సీరమ్ లు వాడుతుంటారు. ఇవి ఖరీదుతో కూడుకున్నవి, అలాగే కొన్ని ఉత్పత్తుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లో దొరికే వాటిని సౌందర్య ఉత్పత్తులుగా వాడొచ్చు.

వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఖరీదు చాలా తక్కువ. అలాంటి వాటిలో బియ్యం నీళ్లు ఒకటి. గంజి నీటిని సరిగ్గా వాడితే ఒత్తైన, బలమైన, పొడవైన జుట్టు సొంతమవుతుంది. ఈ రైస్ వాటర్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు కూడా. జుట్ట సంరక్షణకు బియ్యం నీళ్లు ఎలా ప్రయోజనం చేకూరుస్తాయో,, వాటిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం నీళ్లు అంటే ఏంటి?
అన్నం వండడానికి ముందు బియ్యాన్ని నీటిలో నానబెడతాం. తర్వాత నీటిని వడపోసి అన్నం వండుతాం. ఆ నీటిలో బియ్యంలోని పోషకాలు కలుస్తాయి. అలా వాటికి పోషక సామర్థ్యం వస్తుంది. అలాగే కొందరు నీటిలో బియ్యాన్ని ఉడికించి గంజిని వంపుతారు. ఈ నీటిలో కూడా బియ్యంలోని పోషకాలు చేరుతాయి. ఈ నీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బియ్యంలోని పిండి పదార్థాలు, ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు కలిసి పోషక సామర్థ్యం వస్తుంది. ఇనోసిటాల్, ఫెరులిక్ యాసిడ్, విటమిన్ బి, ఈ వంటివి కూడా ఉంటాయి.
జుట్టుకు బియ్యం నీరు మంచిదేనా?
రైస్ వాటర్ లోని పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బియ్యం నీటిలోని ఇనోసిటాల్, కార్బొహైడ్రేట్లు.. పొడి జుట్టుకు తేమను అందిస్తాయి. చిట్లిపోయిన జుట్టును నయం చేస్తాయి. గంజిలోని అమైనో ఆమ్లాలు కుదుళ్లకు బలం చేకూర్చి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. బియ్యం నీళ్లు జుట్టుకు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చడంతో పాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సురక్షితంగా ఉంటుంది.
బియ్యం నీరు ప్రయోజనాలు
1. జుట్టును దృఢంగా చేస్తుంది:
రైస్ వాటర్ లోని అమైనో ఆమ్లాలు జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తాయి. దీని వల్ల జుట్టు రాలడం కతగ్గుతుంది. అలాగే చిట్లిపోయిన జుట్టును రిపేర్ చేస్తుంది.
2. హెయిర్ కండీషనర్‌గా పనిచేస్తుంది:
బియ్యం నీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు లోతైన హైడ్రేషన్‌ను అందిస్తాయి. ఇది సహజమైన కండీషనర్‌గా పని చేస్తుంది. రైస్ వాటర్‌లోని ఎమల్షన్లు, ప్రోటీన్లు జుట్టు తంతువులను తేమగా మారుస్తాయి.
3. జుట్టు మృదువుగా మారుతుంది:
రైస్ వాటర్ లోని ప్రోటీన్లు జుట్టుకు కోట్ చేయడానికి, క్యూటికల్స్ ను మృదువుగా చేయడానికి, ఫ్రిజ్‌ని తగ్గించడానికి సహాయపడతాయి.
4. చుండ్రును తగ్గిస్తుంది:
రైస్ వాటర్‌లోని పోషకాలు సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి. దీని వల్ల తల దురద తగ్గుతుంది. అలాగే చుండ్రును నియంత్రిస్తుంది.
5. జుట్టు పొడువుగా పెరగడానికి సహాయపడుతుంది:
రైస్ వాటర్ లోని విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇది మూలాలను బలపరుస్తుంది. తలలో రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది.
6. మెరుపు అందిస్తుంది:
బియ్యం నీటిలోని విటిమిన్ బి, ఈ వంటి పోషకాలు జుట్టుకు సహజసిద్ధమైన మెరుపును అందిస్తాయి. రైస్ వాటర్‌ను హెయిర్ రిన్స్‌గా రెగ్యులర్‌గా వాడటం వల్ల జుట్టు నిగనిగలాడుతుంది.
బియ్యం నీటిని ఎలా వాడాలి?
ఒక కప్పు బియ్యం నీటిలో కొన్ని చుక్కల రోజ్మేరీ, లావెండర్, ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. దీనిని తలకు పట్టించాలి. ఇలా చేయడం ద్వారా జుట్టు ఒత్తుగా, బలంగా, పొడుగ్గా మారుతుంది.



Click it and Unblock the Notifications