Latest Updates
-
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి!
తెల్ల జుట్టు నల్లగా మారడానికి.. అన్ని చిట్కాల్లో ఇదే బెస్ట్..!
ప్రస్తుతం తెల్లజుట్టు సమస్యను చాలా మంది యువకులూ, యువతులూ ఎదుర్కోంటున్నారు. చిన్ని వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. 40 ఏళ్ల తరువాత వచ్చే సమస్యలు ఇప్పుడే రావడం వల్ల యువత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య అధికంగా ఎదురౌతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా తెల్లజుట్టును నల్లగా ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం. శీకాకాయ వల్ల ఈ సమస్యను పరిష్కరించవచ్చు. తలలో చుండ్రు, దురద లాంటి సమస్యలను కూడా ఇది నివారిస్తుంది. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సమస్యను నివారిస్తుంది. జుట్టుకు శక్తివంతమైన నలుపుదనాన్ని ఈ శీకాకయ తిరిగి తీసుకొని వస్తుంది.వెంట్రుకలు రాలిపోయే సమస్యను కూడా తగ్గిస్తుంది. ఆరోగ్యవంతమైన, కాంతివంతమైన జుట్టును ఇది తిరిగి తీసుకొని వస్తుంది.

బాదాం నూనె జుట్టు ఎదుర్కొనే సమస్యలను తీర్చడంతో పాటు చిన్న వయసులో ఏర్పడే తెల్ల జుట్టు సమస్యను కూడా ఇది నివారిస్తుంది. తలలో చుండ్రు తగ్గించడంతో పాటు దృఢమైన కురులను తీసుకొని వస్తుంది. ఇక మూడవ పదార్థం పెరుగు. తరతరాలుగా జుట్టుపోషనకు పెరుగును వాడుతూ వస్తున్నారు. ఇందులో విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది. పెరుగు మంచి కండీషనర్‌గా మనకు ఉపయోగపడుతుంది. జుట్టకు పెరుగు మంచి ఫుడ్‌గా చెప్పుకోవచ్చు. దీంట్లోనే మంచి పోషకాలు వుంటాయ్. ఆరోగ్యవంతమైన కేశాలు తిరిగి వచ్చేలా సహాయపడుతుంది. శీకాకాయ పెరుగు, బాదాం ఆయిల్, ఈ మూడింటినీ ఉపయోగించి ఈ టిప్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
ముందుగా ఒక ఖాలీ బౌల్‌ను తీసుకొని అందులో ఒక టీ స్పూన్ శీకాకాయ పౌడర్‌ను వేసుకోవాలి. ఒక స్పూన్ బాదాం ఆయిల్‌ను కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో రెండు స్పూన్ల పెరుగును కూడా వేసుకోవాలి. శీకాకాయ, బాదాం పౌడర్, పెరుగు ఈ మూడింటినీ బాగా కలుపుకోవాలి. వీటిలో వుండే గుణాలు తెల్ల జుట్టు సమస్యను పూర్తగా తొలగిస్తుంది.
మిశ్రమం రెడీ అయిన తరువాత దాన్ని జుట్టుకు అప్లై చేసుకోవాలి. తలస్నానం చేసే ఒక అరగంట ముందు ఈ మిశ్రమాన్ని తలకు రాసుకోవాలి. 20 నుంచి 30 నిమిశాల తరువాత జుట్టును అలాగే వదిలివేయాలి. తరువాత ఏదైనా శాంపూ లేదంటే కుంకుడు కాయను వాడి చల్లటి నీళ్లతో తలస్నానం చేయాలి. వారంలో ఒక సారి ఇది అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్య నుంచి త్వరగా బయటపడతారు. దీంతో పాటు అందమైన, పొడవైన జుట్టును మీరు సొంతం చేసుకోవచ్చు. తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న నేటి యువతీ యువకులకు ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది.

పెరుగు, బాదాం నూనె, శికాకాయలో వుండే గుణాలు తెల్లజుట్టు సమస్యను పూర్తిగా తొలగిస్తుంది. వారంలో రెండు రోజుల పాటు జుట్టుకు ఈ మిశ్రమాన్ని అప్లై చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది. దీంతో అందమైన, బలమైన కాంతివంతమైన జుట్టును మీరు సొంతం చేసుకోవచ్చు. వీటి వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వుండవు.
గమనిక : పైన ఇచ్చిన వివరాలన్నీ ప్రముఖ వైద్యులు, ఆయుర్వేద నిపుణుల నుంచి తీసుకొనబడింది. వీటిని మేము ఎట్టి పరిస్థితిలో దృవీకరించము.



Click it and Unblock the Notifications