For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాళ్ళు అందంగా వుండాలంటే....పది మార్గాలు!

By B N Sharma
|

10 Ways To Get White Knees Naturally
మోకాళ్ళు, మోచేతులు నల్లగా వుంటే అసహ్యంగా వుంటుంది. వాటినే చాలామంది చూస్తుంటారు. ప్రత్యేకించి చర్మ రంగు వీటికి వేరుగా వుంటే మరీ బాగా కనపడుతుంది. కాళ్ళను నున్నగా వెంట్రుకలు లేకుండా తెల్లగా ఆకర్షణీయం చేయటానికి దిగువ పద్ధతులు ఆచరించండి,

1. నల్లగా వున్న మోకాళ్ళకు, మోచేతులకు ప్రతి రోజూ రెండు సార్లు నిమ్మరసం రాయండి. కొద్దిపాటి దూదిని నిమ్మరసంలో ముంచి ఈ భాగాలకు రాయండి. 15 నుండి 20 నిమిషాలు అలానే వుంచి తర్వాత నీటితో కడిగేయండి. నిమ్మ తొక్కను నేరుగా ఈ భాగాలపై రుద్దవచ్చు కూడాను. అయితే ఈ చర్యకు ముందు చర్మం మెత్తగా వుండేలా చూడండి.
2. నల్లగా వున్న మో చేతులను మోకాళ్ళను కొబ్బరి నూనెతో మర్దన చేయండి కనీసం 5 నుండి 10 నిమిషాలపాటు మర్దన చేయాలి. కొంతసేపు అలానే వుంచి నీటితో కడిగేయండి. చర్మం తెల్లబడాలంటే కొబ్బరి నూనెలో అయిదు లేదా ఆరు చుక్కలు నిమ్మరసం కూడా వేయండి.
3. గుడ్డు సొనకు కొద్ది చుక్కలు వినేగర్ కలిపి కాళ్ళకు రాస్తే, కాళ్ళ భాగం తెలుపు రావటమే కాక నున్నగా కూడా తయారవుతుంది.
4. పంచదారను బేకింగ్ సోడాతో కలిపి దానిని నల్లగా వున్న మోచేతులు, మోకాళ్ళకు రాయండి. 5 నిమిషాలపాటు రుద్దండి. 10 నుండి 15 నిమిషాలు అలానే వుంచి నీటితో కడిగేయండి. ఏదైనా బాడీ లోషన్ రాయండి.
5. మోచేతులను, మోకాళ్ళను స్నానం చేసేటపుడు మంచి స్క్రబ్బర్ తో గట్టిగా రుద్ది. మృత కణాలు తొలగేలా చూడండి.
6. కొబ్బరినూనెలో కొద్దిపాటి ఆవనూనె కలిపి ఆ మిశ్రమాన్ని నల్లగా వున్న మోకాళ్ళకు క్రమం తప్పకుండా రాస్తే, చర్మం సహజ కాంతి పొందుతుంది.
7. ఆల్మండ్ లేదా కోకోనట్ నూనెను పంచదార, తేెలతో కలపండి. ఈ మిశ్రమాన్ని నల్లగా వున్న మోకాళ్ళకు మోచేతులకు రాయండి. 10 నుండి 15 నిమిషాలపాటు వుంచి నీటితో కడిగేయండి.
8. గుడ్డుసొన, నిమ్మరసం కలిపిన మివ్రమాన్ని నల్లని మోకాళ్ళ భాగాలపై పది నిమిషాలు రుద్దండి. కొంత సేపు అలా వుంచి, పాలను రాసి, నీటితో కడిగివేయండి. తెల్లని మోకాళ్లు మీ సొంతమవుతాయి.
9. ఎండలోకి వెళ్ళేముందు సన్ స్క్రీన్ లోషన్ రాయండి. నిద్రపోయేముందు బాడీ లోషన్ రాసి విశ్రమించండి.
10, ఆవనూనెను కొద్దిపాటి ఉప్పుతో కలపండి. ఈ మిశ్రమాన్ని నల్లని భాగాలపై రాసి పది నిమిషాలు వుంచి నీటితో కడిగేయండి.

ఈ చర్యలు నల్లగా అసహ్యంగా వున్న మీ మోచేతులను మోకాళ్ళను తెల్లబరుస్తాయి.

English summary

10 Ways To Get White Knees Naturally | కాళ్ళు అందంగా వుండాలంటే....పది మార్గాలు!

Apply lemon juice on the dark knees two times daily. You can dip cotton in lemon juice and apply it on the knees. Leave it for 15-20 minutes and then rinse off. You can also directly apply lemon peel and rub the knees for 4-5 minutes but before applying, moisturize the skin previous night as lemon dries the skin.
Story first published:Thursday, September 15, 2011, 10:35 [IST]
Desktop Bottom Promotion